Ink Stains: బట్టలపై ఇంక్ మరకలు పోవట్లేదా? ఇలా చేస్తే చిటికెలో మరక మాయం

|

May 13, 2024 | 12:14 PM

దుస్తులపై మరకలు పడటం సాధారణంగా జరిగేదే. తినేటప్పుడు, ఏదైనా పనులు చేసేటప్పుడు దుస్తులపై మరకలు పడుతుంటాయి. అయితే చిన్నపిల్లల బట్టలు మరింత త్వరగా మురికైపోతుంటాయి. ఇంట్లో ఉన్నా, స్కూల్‌కి వెళ్ళినా రకరకాల మరకలు దుస్తులకు అంటించుకుంటూ ఉంటారు. అలాగే ఎన్నికల సమయంలో ఓటర్లకు వేసే సిరా గుర్తు ఒక్కోసారి ఓ పట్టాన వదలదు. ఆనక.. వాటిని వదిలించలేక గృహిణులు పడరాని పాట్లు పడుతుంటారు..

Ink Stains: బట్టలపై ఇంక్ మరకలు పోవట్లేదా? ఇలా చేస్తే చిటికెలో మరక మాయం
Ink Stains On Clothes
Follow us on

దుస్తులపై మరకలు పడటం సాధారణంగా జరిగేదే. తినేటప్పుడు, ఏదైనా పనులు చేసేటప్పుడు దుస్తులపై మరకలు పడుతుంటాయి. అయితే చిన్నపిల్లల బట్టలు మరింత త్వరగా మురికైపోతుంటాయి. ఇంట్లో ఉన్నా, స్కూల్‌కి వెళ్ళినా రకరకాల మరకలు దుస్తులకు అంటించుకుంటూ ఉంటారు. అలాగే ఎన్నికల సమయంలో ఓటర్లకు వేసే సిరా గుర్తు ఒక్కోసారి ఓ పట్టాన వదలదు. ఆనక.. వాటిని వదిలించలేక గృహిణులు పడరాని పాట్లు పడుతుంటారు. ఇక ఇంక్ అలాంటి మరకలైతే చెప్పక్కర్లేదు. పిల్లలు దుస్తులకు అంటుకునే ఇలాంటి కఠినమైన మరకలను వదిలించాలంటే కొన్ని టిప్స్ ఫాలో అయితే సరి. సులువుగా మరకలు వదిలిపోతాయ్‌..

సాధారణంగా ఇంక్ మరకలు సబ్బుతో క్లీన్ చేస్తే ఓ పట్టాన పోదు. అలాంటప్పుడు.. గోరువెచ్చని నీటిలో కాసేపు నానబెట్టి ఉతకడం వల్ల ఏ మరకైనా చాలా వరకూ వదిలిపోతాయి. ముఖ్యంగా తెల్లని దుస్తులపై పడిన ఇంక్‌ మరలకు వదలగొట్టాలంటే టూత్‌ పేస్ట్ భేషుగ్గా పనిచేస్తుంది. మరకపై టూత్‌పేస్టు అప్లై చేసి కాసేపు అలాగే ఉంచి, ఆ తర్వాత వాష్‌ చేస్తే మరకలు పోతాయి. బ్లీచింగ్ పౌడర్ కూడా బట్టలపై ఇంక్‌ మరకలను క్షణాల్లో వదలగొడతాయి. మరక అంటిన చోట బ్లీచింగ్‌ రాసి తర్వాత స్క్రబ్ చేయాలి. దీని వల్ల మరక చాలా వరకూ వదులుతుంది.

Ink Stains

బట్టల మరకలను వదలగొట్టడంలో డెటాల్‌ కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇంక్‌ మరక ఉన్న చోట కాస్త డెటాల్‌ వేసి.. కాసేపు అలాగే ఉంచండి. ఆ తర్వాత టూత్ బ్రష్‌తో క్లీన్ చేయాలి. ఇలా చేస్తే త్వరగా మరకలు వదిలిపోతాయి. అవసరం అయితే మరోసారి డెటాల్‌ అప్లై చేసి, వాష్‌ చేసుకోవాలి. ఇలా చేస్తే ఇంక్‌ మరక చాలా వరకు పోతుంది. అయితే బట్టలను తప్పనిసరిగా ఎండలో ఆరబెట్టాలి. ఫలితంగా మరక చాలా వరకూ తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి

మొండి మరకలకు ఇలా చేయండి..

Ink Stains

కూరగాయలు కట్‌ చేసేప్పుడు, గాయాలు అయినప్పుడు దుస్తులపై రక్తం మరకలు పడుతూ ఉంటాయి. ఇక పీరియడ్స్‌ టైమ్‌లోనూ రక్తం మరకలు అంటడం జరుగుతుంటుంది. ఆ మరకలు అంత సులువుగా పోవు. ఈ మరకలు తొలగించాలంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ ప్రభావవంతంగా పనిచేస్తుంది. మరక ప్రదేశంలో హైడ్రోజన్ పెరాక్సైడ్ రాసి, కొంతసేపు అలాగే ఉంచి, ఆ తర్వాత సోప్‌తో ఉతికితే సరి. ఇలా చేస్తే మరకలు సులభంగా తొలగుతాయి. టీ మరకలను తొలగించడానికి వెనిగర్‌ ఉపయోగించవచ్చు. మరక ఏదైనా శ్రమ లేకుండా చిన్నపాటి ట్రిక్‌తో సులువుగా వదలగొట్టొచ్చు.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.