Walnut Scrub: మృదువైన చర్మం కోసం వాల్‌నట్ స్క్రబ్‌.. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే తయారు చేసుకోండిలా..

|

Feb 19, 2024 | 3:16 PM

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే వాల్‌నట్స్‌తో సులభంగా స్క్రబ్‌ని తయారు చేసుకోవచ్చు. ఒమేగా 3 పుష్కలంగా ఉన్నందున వాల్‌నట్‌లు చర్మానికి చాలా ప్రయోజనకరంగా పనిచేస్తాయి.. ఒమేగా 3 చర్మాన్ని మెరిసేలా, మృదువుగా చేస్తుంది. అలాగే వాల్‌నట్ స్క్రబ్‌లోని పోషకాలు చర్మాన్ని డిటాక్స్ చేయడంతో పాటు మృత చర్మ కణాలను తొలగించి చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి.

Walnut Scrub: మృదువైన చర్మం కోసం వాల్‌నట్ స్క్రబ్‌.. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే తయారు చేసుకోండిలా..
Walnut Scrub
Follow us on

చర్మాన్ని శుభ్రం చేసుకోవడానికి రెగ్యులర్ ఫేస్ వాష్ సరిపోదు. డెడ్ స్కిన్ సెల్స్‌ను తొలగించడానికి ఎప్పటికప్పుడు స్క్రబ్బింగ్ కూడా చేయడం అవసరం. అందుకోసం రెడీమేడ్ స్క్రబ్‌లు మార్కెట్లో సులభంగా లభిస్తాయి. అయితే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే వాల్‌నట్స్‌తో స్క్రబ్‌ను తయారు చేసుకోవచ్చు. వాల్‌నట్ స్క్రబ్‌లోని పోషకాలు చర్మాన్ని డిటాక్స్ చేయడానికి పని చేస్తాయి. ఇది చర్మంలోని డెడ్ స్కిన్‌ను తొలగించి చర్మాన్ని క్లియర్‌గా మార్చుతుంది. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే వాల్‌నట్స్‌తో సులభంగా స్క్రబ్‌ని తయారు చేసుకోవచ్చు. ఒమేగా 3 పుష్కలంగా ఉన్నందున వాల్‌నట్‌లు చర్మానికి చాలా ప్రయోజనకరంగా పనిచేస్తాయి.. ఒమేగా 3 చర్మాన్ని మెరిసేలా, మృదువుగా చేస్తుంది. అలాగే వాల్‌నట్ స్క్రబ్‌లోని పోషకాలు చర్మాన్ని డిటాక్స్ చేయడంతో పాటు మృత చర్మ కణాలను తొలగించి చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి.

ఇందుకోసం కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ తెలుసుకుందాం..

వాల్‌నట్స్‌ స్క్రబ్‌ తయారీ కోసం కావాల్సిన పదార్థాలు..

ఇవి కూడా చదవండి

వాల్‌నట్స్‌ స్క్రబ్‌ తయారీ కోసం ఐదు నుండి ఆరు వాల్‌నట్స్ షెల్స్‌ తీసుకోవాలి. దానికి సరిపడ ఆమ్లా పౌడర్‌, తేనె తీసుకోవాలి.

వాల్నట్ స్క్రబ్ ఎలా తయారు చేయాలి..

ముందుగా వాల్‌నట్ షెల్స్‌ని పొడిగా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత దానికి ఒక చెంచా తేనె వేసి బాగా మిక్స్ చేసి పేస్ట్ లా చేసుకోవాలి. ఇప్పుడు దానికి ఉసిరికాయ పేస్ట్ లేదా రసం కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని గాజు సీసాలో భద్రపరుచుకోండి. మీరు ఈ మిశ్రమాన్ని ఒక నెల పాటు ఉపయోగించవచ్చు.

వాల్నట్ స్క్రబ్ ఎలా ఉపయోగించాలి..

స్క్రబ్ ఉపయోగించే ముందు ముఖాన్ని శుభ్రంగా వాస్‌ చేసుకోవాలి. ఆ తర్వాత స్క్రబ్ అప్లై చేసి ముఖాన్ని సర్క్యులర్ మోషన్ లో మసాజ్ చేయాలి. ఐదు నిమిషాల పాటు మసాజ్ చేసిన తర్వాత స్క్రబ్ ను ముఖంపై రెండు నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత చల్లటి నీటితో ముఖం కడిగేసుకోవాలి.

ఎవరైనా ఈ స్క్రబ్‌ని ఉపయోగించవచ్చు. కానీ, గింజలు, తేనె లేదా ఉసిరికాయలకు అలెర్జీ ఉన్నవారు ఈ స్క్రబ్‌ని ఉపయోగించకూడదు. అలాగే మసాజ్ చేసేటప్పుడు చర్మంపై ఎక్కువ ఒత్తిడి పెట్టకూడదు. సున్నితంగా మసాజ్ చేయండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..