AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పిల్లలకు బెస్ట్ స్నాక్స్.. ఇంట్లోనే సింపుల్‌గా రాగి లడ్డూ తయారు చేయండి!

పిల్లలకు మంచి పోషకాలు కలిగిన ఆహారం పెట్టాలని ప్రతి తల్లి కోరుకుంటుంది.ఇక స్కూల్ నుంచి వచ్చాక పిల్లలు ఏవైనా స్నాక్స్ తినడానికి ఇష్టపడుతుంటారు. దీంతో అసలు వారికి ఎలాంటి స్నాక్స్ పెట్టాలో తెలియక, చాలా మంది తల్లిదండ్రులు సతమతం అవుతారు. అయితే అలాంటి వారి కోసమే అదిరిపోయే ఐడియా.

Samatha J
|

Updated on: Jul 29, 2025 | 7:47 PM

Share

1 / 5
మీ పిల్లలు హెల్దీగా ఉండాలి అంటే, వారికి మంచి ప్రోటీన్, ఐరన్, వంటివి అందాలంటే, తప్పక వారికి రాగి లడ్డూ పెట్టాల్సిందే. రాగిలడ్డు తినడం వలన ఇది శరీరానికి అవసరమైన ప్రోటీన్, ఖనిజాలు, విటమిన్స్ అందిస్తుంది. అయితే చాలా మంది రాగి జావ తాగడానికి ఇష్టపడరు, ముఖ్యంగా పిల్లలకు రాగి జావ తాగడం అస్సలు నచ్చదు. అయితే అలాంటి సమయంలో రాగులతో లడ్డూ చేసి ఇస్తే వారు ఎంతో ఇష్టంగా తింటారు. కాగా, అసలు రాగి లడ్డూ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.

2 / 5
కావాల్సిన పదార్థాలు : రాగి పిండి ఒక కప్పు, యాలకుల పొడి, పావు కప్పు, బెల్లం పొడి, అరకప్పు, నెయ్యి రెండు స్పూన్స్, పాలు పావు కప్పు, జీడిపప్పులు గుప్పెడు, బాదం పప్పు గుప్పెడు, కొబ్బరి తురుము పావు కప్పు.

3 / 5
తయారీ విధానం : గ్యాస్ ఆన్ చేసి, స్టవ్ మీద పాన్ పెట్టాలి. అందులో నెయ్యి వేసి, జీడి పప్పు, బాదం పప్పులు వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే నెయ్యిలో మంట కాస్త తగ్గించి, నెయ్యిని దోరగా వేయించుకోవాలి. తర్వాత అదే పిండిలో బెల్లం తురుము, యాలకుల పొడి, ఎండు కొబ్బరి తురుము వేసి వేయించుకోవాలి.

4 / 5
ఇప్పుడు బాగా కాచిన పాలను పిండిలో వేసి చిన్న మంటపై మెల్లిగా కలుపుతూ ఉండాలి. రెండు మూడు నిమిషాలు కలిపిన తర్వాత అది దగ్గరగా వస్తుంది. అప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి, దానిని ఒక నిమిషం పక్కన పెట్టుకోవాలి.  వేడి తగ్గి గోరు వెచ్చగా ఉన్న సమయంలో వాటి లడ్డుల్లా చుట్టుకొని, గాలి చొరబడి డబ్బాల్లో వేసి మూత పెట్టేసుకోవాలి. ఇక ప్రతి రోజూ ఒక లడ్డూ మీ పిల్లలకు స్నాక్‌గా ఇవ్వడం వలన వారి ఆరోగ్యం బాగుంటుంది.

5 / 5