AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బకెట్ నీళ్లలో ఇది 2 చుక్కలు వేస్తే చాలు.. మీ ఇంటి నేల మొత్తం అద్దంలా మెరిసిపోవాల్సిదే..

ఇంట్లో వైట్ టైల్స్ లేదా మార్బుల్ ఫ్లోరింగ్ ఉంటే లుక్ గ్రాండ్‌గా ఉంటుంది.. కానీ కాస్త దుమ్ము పడినా, చిన్న మరక పడినా ఇల్లంతా మురికిగా కనిపిస్తుంది. పైగా వర్షాకాలంలో జిడ్డు, చిన్న చిన్న కీటకాల బెడద మరీ ఎక్కువ. మార్కెట్లో దొరికే ఖరీదైన కెమికల్ లిక్విడ్స్ బదులు, వంటింట్లోని చిట్కాలతో రూపాయి ఖర్చు లేకుండా తయారుచేసే న్యాచురల్ ఫ్లోర్ క్లీనర్ మీ ఇంటిని అద్దంలా ఎలా మెరిపిస్తుందో తెలుసుకుందాం..

బకెట్ నీళ్లలో ఇది 2 చుక్కలు వేస్తే చాలు.. మీ ఇంటి నేల మొత్తం అద్దంలా మెరిసిపోవాల్సిదే..
Homemade Natural Floor Cleaner
Krishna S
|

Updated on: Aug 28, 2026 | 2:53 PM

Share

ఇంట్లో వైట్ టైల్స్ ఉంటే ఇల్లు ఎంతో అందంగా, విశాలంగా కనిపిస్తుంది. కానీ ఈ నేలను క్లీన్‌గా ఉంచుకోవడం పెద్ద సవాల్. చిన్న మరక పడినా, దుమ్ము చేరినా లేదా పిల్లలు తిరిగిన పాదముద్రలు పడినా వెంటనే స్పష్టంగా కనిపిస్తాయి. ముఖ్యంగా వర్షాకాలంలో నేల జిడ్డుగా మారడం, తేమ వల్ల చిన్న చిన్న కీటకాలు, ఈగలు, దోమల బెడద ఎక్కువవడం సర్వసాధారణం. మార్కెట్లో దొరికే ఖరీదైన కెమికల్ ఫ్లోర్ క్లీనర్ల బదులు, వంటింట్లోని సహజ పదార్థాలతో ఎంతో సులభంగా హోమ్‌మేడ్ క్లీనర్‌ను తయారు చేసుకోవచ్చు. ఇది ఎలాంటి హాని చేయకపోగా.. నేలను అద్దంలా మెరిపించి, ఇల్లంతా మంచి సువాసనను పంచుతుంది.

కావలసిన పదార్థాలు:

  • కర్పూరం బిళ్లలు: 2 నుంచి 3 (పొడి చేసుకోవాలి)
  • బేకింగ్ సోడా: 2 టేబుల్ స్పూన్లు
  • తెల్ల ఉప్పు: 3 టేబుల్ స్పూన్లు
  • వైట్ వెనిగర్: 2-3 టేబుల్ స్పూన్లు
  • నిమ్మరసం: 2 పెద్ద నిమ్మకాయల నుంచి తీసిన రసం
  • ఎసెన్షియల్ ఆయిల్ (సుగంధ తైలం): 5-6 చుక్కలు (ఐచ్ఛికం)
  • నీరు: 1 నుంచి 1.5 గ్లాసులు

తయారీ విధానం

  • ఒక పెద్ద గిన్నెలో నీరు తీసుకుని, అందులో కర్పూరం పొడి, ఉప్పు, బేకింగ్ సోడా వేసి చెంచాతో బాగా కలపాలి.
  • ఆ తర్వాత నిమ్మరసం, వెనిగర్ జోడించి మిశ్రమం పూర్తిగా కరిగేలా మిక్స్ చేయాలి.
  • ఈ ద్రవాన్ని ఒక స్ప్రే బాటిల్ లేదా సాధారణ సీసాలోకి పోసి, సువాసన కోసం ఎసెన్షియల్ ఆయిల్ వేసి మూత పెట్టి బాగా షేక్ చేయాలి.
  • అంతే.. రూపాయి ఖర్చు లేకుండా కెమికల్ ఫ్రీ హోమ్‌మేడ్ ఫ్లోర్ క్లీనర్ సిద్ధం.

ఎలా ఉపయోగించాలి?

  • రోజూ ఇల్లు తుడిచే నీటి బకెట్‌లో ఈ లిక్విడ్‌ను 2-3 చెంచాలు కలిపి మాప్ చేయవచ్చు.
  • నేలపై మొండి మరకలు ఉన్న చోట దీన్ని నేరుగా వేసి కాసేపు ఆగి క్లాత్‌తో తుడిస్తే జిడ్డు, మరకలు క్షణాల్లో మాయమవుతాయి.

ఈ క్లీనర్ ప్రత్యేకతలు

మరకల నివారణ: వెనిగర్, నిమ్మరసంలోని ఆమ్ల గుణాలు మొండి మరకలను తొలగిస్తాయి.

దుర్వాసనకు చెక్: బేకింగ్ సోడా చెడు వాసనలను పీల్చుకుంటుంది.

కీటకాలు దూరం: కర్పూరం, ఉప్పు సహజ క్రిమిసంహారకాలుగా పనిచేసి ఈగలు, చీమలు, చిన్న కీటకాలు రాకుండా అడ్డుకుంటాయి. ఎసెన్షియల్ ఆయిల్ ఇల్లంతా రోజంతా ఫ్రెష్ సువాసనను అందిస్తుంది.

Follow Us