Mangoes Identify: మామిడి పండ్లు కొంటున్నారా? అవి సహజమైనవో కాదో గుర్తించడానికి ఈ 3 సింపుల్ ట్రిక్స్ పాటించండి!
Mangoes Identify: మామిడి పండ్లు సహజంగా పండాయో, రసాయనాలతో మగ్గబెట్టారో తెలుసుకోవడం ముఖ్యం. రంగు, సువాసన, మెత్తదనం, నీటిలో మునిగే తీరు ఆధారంగా గుర్తించవచ్చు. కెమికల్స్ వాడిన పండ్లు ఆరోగ్యానికి హానికరం. కార్బైడ్ పండ్లు కడుపునొప్పి, వాంతులు, దీర్ఘకాలంలో క్యాన్సర్ ప్రమాదానికి దారితీస్తాయి. ఆరోగ్యం కోసం సరైన పండ్లను ఎంచుకోండి.

Mangoes Identify: వేసవి కాలం వచ్చిందంటే చాలు.. పండ్ల రాజా మామిడి పండ్ల కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. మార్కెట్లోకి రకరకాల మామిడి పండ్లు అందుబాటులోకి వస్తాయి. అయితే, పెరిగిన డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కొందరు వ్యాపారులు లాభాపేక్షతో మామిడి పండ్లను రసాయనాలతో (కార్బైడ్ వంటివి) మగ్గబెడుతున్నారు. ఇటువంటి పండ్లు ఆరోగ్యానికి ఎంతో హానికరం. ఈ నేపథ్యంలో, సహజంగా పండిన మామిడి పండ్లను గుర్తించడం ఎలా? కొనేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
వేసవి కాలం రాగానే నోరూరించే మామిడి పండ్లు మార్కెట్లోకి వచ్చేస్తాయి. నోరూరించే మామిడి పండ్లు మార్కెట్లోకి వచ్చినా, అవి సహజంగా పండాయో లేక విషపూరిత రసాయనాలతో మగ్గబెట్టాయో తెలుసుకోవడం అత్యవసరం. మీ ఆరోగ్యం పాడవకుండా ఉండాలంటే, మామిడి పండ్లు కొనే ముందు కొన్ని పరీక్షలు చేయడం మంచిది.
ఇది కూడా చదవండి: Gold Price Today: కుప్పకూలుతున్న బంగారం, వెండి.. భారీగా తగ్గిన ధరలు.. ఎంత తగ్గిందంటే..
మొదటిగా, పండు రంగును గమనించండి. సహజంగా పండిన పండు అక్కడక్కడా పసుపు, ఆకుపచ్చ రంగుల మిశ్రమంతో ఉంటుంది. రసాయనాలతో పండించినవి మాత్రం నిగనిగలాడుతూ, అంతా ఒకే పసుపు రంగులో కనిపిస్తాయి. అలాగే, సహజమైన మామిడి పండు నుంచి మంచి సువాసన వస్తుంది. తాకితే మెత్తగా ఉంటుంది. కల్తీ పండైతే, పైన పండులా కనిపించినా, ముట్టుకుంటే గట్టిగా ఉంటుంది.
పండ్లను గుర్తించడానికి బెస్ట్ ట్రిక్ ఏమిటంటే, వాటిని ఒక బకెట్ నీళ్లలో వేయడం. సహజంగా పండిన పండ్లు బరువుగా ఉండి నీటిలో మునిగిపోతాయి. రసాయనాలతో మగ్గబెట్టిన పండ్లు లోపల సరిగ్గా పండవు కాబట్టి నీటిపై తేలుతాయి. ఈ పండ్లు తిన్నప్పుడు నాలుకపై మంటగా అనిపించినా, గొంతులో అసౌకర్యంగా ఉన్నా, అవి కల్తీ పండ్లే అని గుర్తించాలి. కార్బైడ్ వేసిన పండ్లు తింటే కడుపునొప్పి, వాంతులు వంటి తక్షణ సమస్యలతో పాటు, దీర్ఘకాలంలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందుకే రుచి కంటే ఆరోగ్యానికే ప్రాధాన్యత ఇవ్వండి.
ఇది కూడా చదవండి: BYD Leopard: పెట్రోల్ లేకుండా 100 కి.మీ, ఫుల్ ట్యాంక్‌తో 1200 కి.మీలు.. ఇక ఫార్చ్యూనర్‌కు చుక్కలే..!
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




