ఆర్. ఓ ప్యూరిఫైయర్ నుండి బయటకు వచ్చే వేస్ట్‌వాటర్‌ తిరిగి ఉపయోగిస్తున్నారా..? ఏమవుతుందో తెలుసా

సాధారణంగా ఏదైనా ఒక RO 3 లీటర్ల నీటి నుండి 1 లీటరు నీటిని శుద్ధి చేయగలదు. ఇక్కడ ఎంత నీరు వృథా అవుతుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో వృథా అవుతున్న నీటిని ఎలా వినియోగించుకోవాలని చాలా మంది ఆలోచిస్తున్నారు. రోజుకు లీటర్ల కొద్దీ వృథా అవుతున్న నీటిని తిరిగి ఎలాంటి పనులకు వాడుకోవాలి.. ఆ నీటితో స్నానం చేయవచ్చా..? అలా  చేస్తే ఏమవుతుందో నిజంగా ఎవరికీ తెలియదు..కానీ,

ఆర్. ఓ ప్యూరిఫైయర్ నుండి బయటకు వచ్చే వేస్ట్‌వాటర్‌ తిరిగి ఉపయోగిస్తున్నారా..? ఏమవుతుందో తెలుసా
Purifier Waste Water
Follow us

|

Updated on: Mar 12, 2024 | 8:15 AM

ఈ రోజుల్లో ఆరోగ్యం పట్ల ప్రజల్లో ఆందోళన పెరిగింది. ప్రతి విషయంలో జాగ్రత్తలు పాటిస్తూ.. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం అలవాటుగా చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రతి ఇంట్లోనూ నీటి శుద్ధి ఏర్పాట్లు వాటర్‌ ప్యూరిఫైయర్లు తప్పనిసరిగా అయింది. అపరిశుభ్రమైన నీటిని శుద్ధి చేయడానికి RO ఉపయోగిస్తుంటారు. అయితే, RO నుండి వ్యర్థ నీరు బయటకు వస్తుంది. అదంతా వృథాగా పోతుంది. ఇలా వేస్ట్‌గా పోతున్న నీటిని కూడా కొందరు ఇతర పనులకు వినియోగిస్తుంటారు. అయితే, ఇది ఎంతవరకు సరైనది. ప్యూరిఫైయర్‌ ఫిల్టర్‌ నుండి వచ్చే వేస్ట్‌ వాటర్‌తో స్నానం చేయొచ్చా..? ఇప్పుడు తెలుసుకుందాం..

సాధారణంగా ఏదైనా ఒక RO 3 లీటర్ల నీటి నుండి 1 లీటరు నీటిని శుద్ధి చేయగలదు. ఇక్కడ ఎంత నీరు వృథా అవుతుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో వృథా అవుతున్న నీటిని ఎలా వినియోగించుకోవాలని చాలా మంది ఆలోచిస్తున్నారు. రోజుకు లీటర్ల కొద్దీ వృథా అవుతున్న నీటిని తిరిగి ఎలాంటి పనులకు వాడుకోవాలి.. ఆ నీటితో స్నానం చేయవచ్చా..? అలా  చేస్తే ఏమవుతుందో నిజంగా ఎవరికీ తెలియదు..కానీ, నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఫిల్టర్‌ నుండి వృథాగా పోతున్న నీరు తాగడానికి, లేదంటే, స్నానం చేయడానికి వాడరాదట. ఎందుకంటే ఇందులో మొత్తం కరిగిన ఘనపదార్థాలు (TDS) ఎక్కువగా ఉంటాయి. ఈ TDS ఎక్కువగా ఉన్నందున ఈ నీరు తాగడానికి పనికిరాదు. చర్మంపై కూడా ప్రభావం చూపుతుంది. ఈ RO ప్రక్రియ ద్వారా విడుదలైన వ్యర్థ నీటిలో వివిధ రకాలైన అకర్బన లవణాలు, సేంద్రియ పదార్థాలు, మలినాలను కలిగి ఉంటాయి. ఇవి చర్మం ద్వారా గ్రహించబడతాయి. అది చర్మ వ్యాధులకు కారణం కావచ్చు.

RO నుండి విడుదలయ్యే నీటిని కారు,టూ వీలర్ వాహనాలను శుభ్రం చేయడానికి ఉపయోగించవచ్చు. ఎందుకంటే ఇది చాలా ఎక్కువ నీరు-ఇంటెన్సివ్ సబ్జెక్ట్. మీరు మీ ఇంటిలోని RO నుండి వచ్చే వ్యర్థ జలాలను టాయిలెట్ శుభ్రం చేయడానికి, ఇళ్లు తుడుచుకోవడం వంటి వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి

టాలీవుడ్‌ వజ్రోత్సవాల వివాదాన్ని గుర్తు చేసిన చిరంజీవి
టాలీవుడ్‌ వజ్రోత్సవాల వివాదాన్ని గుర్తు చేసిన చిరంజీవి
ఆశీష్‌ మెరిసే.. తెలుగు టైటాన్స్‌ మురిసే...
ఆశీష్‌ మెరిసే.. తెలుగు టైటాన్స్‌ మురిసే...
హైదరాబాద్‌లో దీపావళిపై పోలీసులు ఆంక్షలు విధించారా...?
హైదరాబాద్‌లో దీపావళిపై పోలీసులు ఆంక్షలు విధించారా...?
ఎదురులేని హర్యానా స్టీలర్స్‌.. దబంగ్‌ ఢిల్లీపై 41-34తో ఘన విజయం
ఎదురులేని హర్యానా స్టీలర్స్‌.. దబంగ్‌ ఢిల్లీపై 41-34తో ఘన విజయం
రతన్ టాటా గౌరవార్థం ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ కీలక ప్రకటన.. ఏంటంటే
రతన్ టాటా గౌరవార్థం ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ కీలక ప్రకటన.. ఏంటంటే
ఖైదీ 2 పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. దానితో పాటు మరొక సర్‌ప్రైజ్‌
ఖైదీ 2 పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. దానితో పాటు మరొక సర్‌ప్రైజ్‌
'రక్తపు మడుగులో ఉన్న నన్ను చూసి నా భర్త'.. నటి శ్రీవాణి ఎమోషనల్
'రక్తపు మడుగులో ఉన్న నన్ను చూసి నా భర్త'.. నటి శ్రీవాణి ఎమోషనల్
తెలుగు స్టేట్స్‌లో కంగువాకు తప్పని కస్టాలు
తెలుగు స్టేట్స్‌లో కంగువాకు తప్పని కస్టాలు
గీజర్‌ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? రూ. 5వేలలో బెస్ట్‌ డీల్స్ ఇవే..
గీజర్‌ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? రూ. 5వేలలో బెస్ట్‌ డీల్స్ ఇవే..
ఆదివాసీ గూడాల్లో దండారిసంబరాలు..అడవి బిడ్డల గుండెల్లో ఆనందోత్సహలు
ఆదివాసీ గూడాల్లో దండారిసంబరాలు..అడవి బిడ్డల గుండెల్లో ఆనందోత్సహలు