Buransh Flower: హిమాలయాల్లో దొరికే ఈ పూల రసం ఎన్నో వ్యాధులకు దివ్యఔషధం..! ఎలాంటి రోగాలైనా పరార్‌..

హిమాలయాల మూలికా సంపదగా పిలువబడే..ఈ మొక్క పేరు బురాన్ష్. ఈ పువ్వులు చూడటానికి చాలా అందంగా ఉంటాయి. బురాన్ష్ పువ్వులు ఎక్కువగా హిమాలయాల్లో కనిపిస్తాయి. కాబట్టి అవి మనకు కనిపించవు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో మాత్రమే అందుబాటులో ఉంటాయి.. కానీ బురాన్ష్ పూలతో చేసిన జ్యూస్ సూపర్ మార్కెట్లలో దొరుకుతుంది.

Buransh Flower: హిమాలయాల్లో దొరికే ఈ పూల రసం ఎన్నో వ్యాధులకు దివ్యఔషధం..! ఎలాంటి రోగాలైనా పరార్‌..
Buransh Flower
Follow us

|

Updated on: Mar 12, 2024 | 7:44 AM

Buransh Flower: ఈ పువ్వును హిమాలయాల మూలికా సంపదగా పిలుస్తారు. ఇక్కడ అనేక రకాల ఔషధ మొక్కలు, చెట్లు ఉన్నాయి. వాటి గురించి మనకు తెలియకపోవచ్చు. కానీ హిమాలయాల్లో లభించే అనేక మూలికలను ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగిస్తున్నారు. వాటి నుంచి తయారైన మందులు అనేక వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడుతాయి. అటువంటిదే ఈ పుష్పం కూడా అనేక ఔషధగుణాలను కలిగి ఉంటుంది. ఆ పువ్వు వల్ల కలిగే లాభాలు తెలిస్తే నిజంగా షాక్ అవుతారు. ఇంతకీ ఆ పువ్వు ఏంటి..? దీనిని ఔషధంగా దేనికి ఉపయోగిస్తారు? ఈ వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం..

హిమాలయాల మూలికా సంపదగా పిలువబడే..ఆ మొక్క పేరు బురాన్ష్. ఈ పువ్వులు చూడటానికి చాలా అందంగా ఉంటాయి. లేత గులాబీ రంగులో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఈ పూలు ఎక్కువగా ఉత్తరాఖండ్ , హిమాచల్ ప్రదేశ్‌లోని కొండ ప్రాంతాలలో కనిపిస్తాయి.. బురాన్ష్‌లో ఔషధ గుణాలతో పాటు పోషకాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. బురాన్ష్ పువ్వుల నుంచి రసం తీసి తాగుతారు. ఈ పూల రేకుల్లో క్వినిక్ యాసిడ్ ఉంటుంది. దీని రుచి అమోఘంగా ఉంటుంది. ఈ పూల రుచి మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.

బురాన్ష్ పూల ప్రయోజనాలు

ఇవి కూడా చదవండి

బురాన్ష్ పువ్వులు ఇనుముతో సమృద్ధిగా ఉంటాయి. ఇది శరీరంలో హిమోగ్లోబిన్‌ను పెంచడానికి సహాయపడుతుంది. పెరిగే కొద్దీ ఎముకలు బలహీనపడి కీళ్ల నొప్పుల సమస్య మొదలవుతుంది. దీనికి బురాన్ష్ పూలు అద్భుతంగా పనిచేస్తాయి. ఇందులోని క్యాల్షియం కీళ్ల నొప్పులను దూరం చేసి ఎముకలను దృఢంగా ఉంచుతుంది.

మీరు ఏదైనా అనారోగ్యకరమైన ఆహారం తీసుకుంటే, ఆహారంలో అసమతుల్యత చర్మం, గొంతు, కడుపులో మంటను కలిగిస్తుంది. అలాంటప్పుడు బురాన్ష్‌ పువ్వు రసం తాగడం వల్ల చికాకు నుంచి ఉపశమనం పొందవచ్చు.

బురాన్ష్ పువ్వులు యాంటీ హైపర్గ్లైసీమిక్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇది షుగర్ లెవల్స్ ని కంట్రోల్ చేయడంలో బాగా పనిచేస్తుంది. అందుకే డయాబెటిక్ పేషెంట్లు బురాన్ష్ ఫ్లవర్ జ్యూస్ తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.

బురాన్ష్ ఆయుర్వేదంలో పోషకాల నిధిగా పిలుస్తారు. ఇందులో కాల్షియం, జింక్, ఐరన్, కాపర్ పుష్కలంగా ఉన్నాయి. బురాన్ష్ ఫ్లవర్ జ్యూస్‌ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలోని పోషకాహార లోపాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. ఇది శరీరాన్ని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.

బురాన్ష్ పువ్వులు ఎక్కువగా హిమాలయాల్లో కనిపిస్తాయి. కాబట్టి అవి మనకు కనిపించవు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో మాత్రమే అందుబాటులో ఉంటాయి.. కానీ బురాన్ష్ పూలతో చేసిన జ్యూస్ సూపర్ మార్కెట్లలో దొరుకుతుంది. ఈకామర్స్ సైట్లలో కూడా అందుబాటులో ఉంటుంది. అక్కడ కొనుక్కుని వాడుకోవచ్చు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి

టాలీవుడ్‌ వజ్రోత్సవాల వివాదాన్ని గుర్తు చేసిన చిరంజీవి
టాలీవుడ్‌ వజ్రోత్సవాల వివాదాన్ని గుర్తు చేసిన చిరంజీవి
ఆశీష్‌ మెరిసే.. తెలుగు టైటాన్స్‌ మురిసే...
ఆశీష్‌ మెరిసే.. తెలుగు టైటాన్స్‌ మురిసే...
హైదరాబాద్‌లో దీపావళిపై పోలీసులు ఆంక్షలు విధించారా...?
హైదరాబాద్‌లో దీపావళిపై పోలీసులు ఆంక్షలు విధించారా...?
ఎదురులేని హర్యానా స్టీలర్స్‌.. దబంగ్‌ ఢిల్లీపై 41-34తో ఘన విజయం
ఎదురులేని హర్యానా స్టీలర్స్‌.. దబంగ్‌ ఢిల్లీపై 41-34తో ఘన విజయం
రతన్ టాటా గౌరవార్థం ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ కీలక ప్రకటన.. ఏంటంటే
రతన్ టాటా గౌరవార్థం ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ కీలక ప్రకటన.. ఏంటంటే
ఖైదీ 2 పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. దానితో పాటు మరొక సర్‌ప్రైజ్‌
ఖైదీ 2 పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. దానితో పాటు మరొక సర్‌ప్రైజ్‌
'రక్తపు మడుగులో ఉన్న నన్ను చూసి నా భర్త'.. నటి శ్రీవాణి ఎమోషనల్
'రక్తపు మడుగులో ఉన్న నన్ను చూసి నా భర్త'.. నటి శ్రీవాణి ఎమోషనల్
తెలుగు స్టేట్స్‌లో కంగువాకు తప్పని కస్టాలు
తెలుగు స్టేట్స్‌లో కంగువాకు తప్పని కస్టాలు
గీజర్‌ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? రూ. 5వేలలో బెస్ట్‌ డీల్స్ ఇవే..
గీజర్‌ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? రూ. 5వేలలో బెస్ట్‌ డీల్స్ ఇవే..
ఆదివాసీ గూడాల్లో దండారిసంబరాలు..అడవి బిడ్డల గుండెల్లో ఆనందోత్సహలు
ఆదివాసీ గూడాల్లో దండారిసంబరాలు..అడవి బిడ్డల గుండెల్లో ఆనందోత్సహలు