- Telugu News Photo Gallery Bay Leaf Benefits: Bay Leaf Reduces Sugar Levels In Your Body, Know Details
Bay Leaf for Diabetes: డయాబెటీస్ నివారణలో బే ఆకుల మేలు మరువలేనిది.. ఎలా వినియోగించాలంటే!
బిర్యానీకి మంచి సువాసనను, రుచిని తీసుకువచ్చే బే ఆకుల గురించి ప్రతి ఒక్కరికీ తెలుసు. బే ఆకులు వంటల్లో మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. ఇవి శరీరంలోని అనేక తీవ్రమైన వ్యాధులను నయం చేస్తుందని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా, కీళ్ల నొప్పులు, మైగ్రేన్, గ్యాస్ట్రిక్, న్యుమోనియా వంటి అనేక వ్యాధుల చికిత్సలో కూడా ఇది ప్రభావవంతంగా పనిచేస్తుంది. బే ఆకులలో కొన్ని ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటంటే..
Updated on: Mar 11, 2024 | 9:15 PM

బిర్యానీకి మంచి సువాసనను, రుచిని తీసుకువచ్చే బే ఆకుల గురించి ప్రతి ఒక్కరికీ తెలుసు. బే ఆకులు వంటల్లో మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. ఇవి శరీరంలోని అనేక తీవ్రమైన వ్యాధులను నయం చేస్తుందని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా, కీళ్ల నొప్పులు, మైగ్రేన్, గ్యాస్ట్రిక్, న్యుమోనియా వంటి అనేక వ్యాధుల చికిత్సలో కూడా ఇది ప్రభావవంతంగా పనిచేస్తుంది. బే ఆకులలో కొన్ని ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటంటే.. కడుపు సమస్యలతో బాధపడేవారు బే ఆకులను తీసుకోవచ్చు.

ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అంటే ఆహారం కొంచెం తిన్న తర్వాత కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు ఉన్నవారు బే ఆకులను తీసుకుంటే సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

బే ఆకు శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను కూడా నియంత్రిస్తుంది. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడేవారు వంటలలో బే ఆకులను ఉపయోగించవచ్చు. బే ఆకులు డిప్రెషన్ నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఒత్తిడిని అదుపులో ఉంచుతాయి.

ఆయుర్వేద గ్రంథాలలో బే ఆకులకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఇవి యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటామి. ఇది ఫంగస్, ఇన్ఫెక్షన్లను నయం చేస్తుంది. నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. బే ఆకులతో చేసిన టీ న్యుమోనియా రోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. టీలో ఒక ఆకు, ఒక పెద్ద ఏలకులు, కొద్దిగా బెల్లం కూడా జోడించవచ్చు. బాగా మరిగించి వడకట్టి, కొంచెం కొంచెం సిప్ చేస్తే హాయిగా ఉంటుంది.




