- Telugu News Photo Gallery Skin Care Tips: Aloe Vera And Vitamin E Capsules Help To Smooth And Glowing Skin
Skin Care Tips: షేవింగ్ తర్వాత చర్మం గరుకుగా మారుతోందా? కలబందతో ఇలా చేస్తే మృదువైన చర్మం మీ సొంతం..
మొటిమల మచ్చలతో నలుగురిలోకి వెళ్లలేకపోతున్నారా? ఎండ వల్ల చర్మంపై నల్లని మచ్చలు ఏర్పడుతున్నాయా? మచ్చలు, బ్లాక్‌హెడ్స్‌ను తొలగించడానికి మార్కెట్లో దొరికే క్రీమ్‌లకు బదులుగా ఈ సహజ పదార్ధాన్ని ఉపయోగించండి. అదే కలబంద. చర్మంలోని మచ్చలను తొలగించడంలో కలబంద ఏ మాత్రం తీసిపోదు. కలబంద జెల్ వడదెబ్బ తగిలిన చర్మాన్ని నయం చేయడానికి బలేగా ఉపయోగపడుతుంది..
Updated on: Mar 11, 2024 | 8:58 PM

మొటిమల మచ్చలతో నలుగురిలోకి వెళ్లలేకపోతున్నారా? ఎండ వల్ల చర్మంపై నల్లని మచ్చలు ఏర్పడుతున్నాయా? మచ్చలు, బ్లాక్‌హెడ్స్‌ను తొలగించడానికి మార్కెట్లో దొరికే క్రీమ్‌లకు బదులుగా ఈ సహజ పదార్ధాన్ని ఉపయోగించండి. అదే కలబంద. చర్మంలోని మచ్చలను తొలగించడంలో కలబంద ఏ మాత్రం తీసిపోదు. కలబంద జెల్ వడదెబ్బ తగిలిన చర్మాన్ని నయం చేయడానికి బలేగా ఉపయోగపడుతుంది.

అలోవెరా జెల్ చర్మాన్ని తాజాగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. కలబందలో ఉండే వివిధ విటమిన్లు, మినరల్స్, ఫోలిక్ యాసిడ్ చర్మానికి పోషణనిస్తాయి. ఫలితంగా చర్మం తాజాగా మారుతుంది. ఎండ వల్ల చర్మంపై ఏర్పడే పిగ్మెంటేషన్ కూడా మాయం అవుతుంది.

అలోవెరా జెల్ చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో మాత్రమే కాకుండా, గాయాలను నయం చేయడంలో, మంటను తగ్గించడంలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది. అలోవెరా నుదురు, బుగ్గలపై మొటిమల వల్ల ఏర్పడిన మచ్చలను త్వరగా నయం చేయడంలో సహాయపడుతుంది.

యాంటీఆక్సిడెంట్-రిచ్ అలోవెరా జెల్, విటమిన్ ఇ క్యాప్సూల్స్ కళ్ల కింద నల్లటి వలయాలను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఈ రెండింటినీ మిక్స్ చేసి ఇంట్లోనే ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. దీన్ని రోజూ ముఖానికి రాసుకుంటే చర్మానికి ఎంతో మేలు కలుగుతుంది.

షేవింగ్ తర్వాత చర్మం గరుకుగా మారకుండా ఉండేందుకు.. అలోవెరా జెల్, విటమిన్-ఇ క్యాప్సూల్స్‌తో తయారు చేసిన ఫేస్ ప్యాక్‌ని షేవింగ్ చేసిన తర్వాత ముఖానికి అప్లై చేసుకోవచ్చు. ఈ ప్యాక్ చర్మం కరుకుదనాన్ని తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.




