Parenting Tips: మీ పిల్లలు పెద్దవాళ్లు అవుతున్నా పక్క తడిపేస్తున్నారా? అయితే ఈ చిట్కాలు పాటించి చూడండి..
2-3 సంవత్సరాల మధ్య పిల్లవాడు మూత్రం వచ్చిన తర్వాతే తల్లిదండ్రులకు చెప్పడం ప్రారంభిస్తాడు. కానీ కొంతమంది పిల్లలు 5-6 సంవత్సరాల వయస్సులో కూడా మంచం మీద మూత్ర విసర్జన చేస్తారు. నిద్రలో తెలియక మంచంపైనే మూత్ర విసర్జన చేయడం తరచూ పిల్లల్లో చూస్తుంటాం.

చిన్నపిల్లలు ఏడాది నుంచి రెండేళ్ల వరకు నిద్రలో మంచంపైనే మూత్ర విసర్జన చేయడం సహజమే. క్రమంగా, పిల్లల వయస్సు పెరిగే కొద్దీ పిల్లలు మూత్రాన్ని ఎక్కడ పోయాలో అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. 2-3 సంవత్సరాల మధ్య పిల్లవాడు మూత్రం వచ్చిన తర్వాతే తల్లిదండ్రులకు చెప్పడం ప్రారంభిస్తాడు. కానీ కొంతమంది పిల్లలు 5-6 సంవత్సరాల వయస్సులో కూడా మంచం మీద మూత్ర విసర్జన చేస్తారు. నిద్రలో తెలియక మంచంపైనే మూత్ర విసర్జన చేయడం తరచూ పిల్లల్లో చూస్తుంటాం.
పిల్లలు పెద్దయ్యాక మంచంపై మూత్ర విసర్జన చేయడం మంచిది కాదు. కొంతమంది పిల్లలు 8-10 సంవత్సరాల వయస్సు వరకు కూడా మంచం మీద మూత్ర విసర్జన చేస్తారు. దీన్నే బెడ్‌వెట్టింగ్ సమస్య అని కూడా అంటారు. ముఖ్యంగా పిల్లలు రాత్రి పడుకునేటప్పుడు బెడ్‌ను తడిపుతారు. అయితే నిద్రలో మూత్రం పోయడం ద్వారా వారు తడిలోనే పడుకుంటారు. తద్వారా నుమోనియా లాంటి జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది.
పిల్లల బెడ్‌పై మూత్ర విసర్జనకు కారణాలు: పిల్లలు తరచుగా రాత్రిపూట మంచంపై మూత్ర విసర్జన చేస్తుంటే, మూత్రాశయం తగినంతగా అభివృద్ధి చెందకపోవడమే కారణం. మూత్రాన్ని నియంత్రించే నరాలు పరిపక్వం చెందక పోవడం వల్ల పిల్లలు, మూత్ర విసర్జన చేస్తుంటారు. అందుకే వారికి నిద్రలో మూత్రం పోకూడదని తెలియదు. ముఖ్యంగా పిల్లవాడు గాఢ నిద్రలో ఉన్నప్పుడు, మంచం మీద మూత్ర విసర్జన చేస్తాడు. పిల్లవాడు నిద్రలో మూత్ర విసర్జన చేస్తే కొన్ని ఇంటి చిట్కాలు పాటించడం ద్వారా ఆ అలవాటు మాన్పించవచ్చు.




చిట్కాలు ఇవే..
- మీ పిల్లల వయస్సు 5-6 సంవత్సరాలు అయినప్పటికీ మంచం తడిపితే, రాత్రి నిద్రిస్తున్నప్పుడు పిల్లల చిటికెన వేలును నొక్కండి. వేలును నొక్కడం ద్వారా, పిల్లవాడు మూత్రవిసర్జనను నియంత్రించడం నేర్చుకుంటాడు.
- మూత్ర సమస్య ఎక్కువగా ఉంటే రాత్రి పడుకునే ముందు పటిక బెల్లం ముక్కను పిల్లలకు తినిపించండి. దీంతో వారికి మూత్ర సమస్య ఉండదు.
- పిల్లలకి మూత్ర విసర్జన సమస్య ఉంటే, అప్పుడు ఖర్జూరం పాలు త్రాగించాలి. ఖర్జూరాలను పాలల్లో వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయం నిద్రలేవగానే ఆ పాలను మరిగించి, పాలు చల్లారిన తర్వాత అందులోని ఖర్జూరాలను పిల్లలకు తినిపించాలి.
- అలారం పెట్టుకొని పిల్లలను మధ్య రాత్రి నిద్ర లేపి టాయిలెట్ వెళ్లమని చెప్పాలి. తద్వారా పిల్లలు మూత్రం వస్తే నిద్ర లేవడం నెమ్మదిగా అలవాటు చేసుకుంటారు.
మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ చదవండి..



