ఈ రోజుల్లో అన్ని రకాల పార్టీలలో కనిపించే పానీయం బీర్. ఈ బీర్ తాగడం వల్ల కలిగే లాభనష్టాల గురించి తరచూ వింటూనే వింటాం. చాలా వాదనలు ఉన్నాయి. కానీ, బీర్ తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుందని ఓ పరిశోధనలో తేలింది. ఇది ఎలా జరుగుతుంది..? ఇది నిజంగా నిజమేనా..? అన్నది ఇక్కడ తెలుసుకుందాం..
ఆల్కహాల్‌లో బీర్ ఎక్కువగా వినియోగించబడే మద్యం. ఇది ఇతర హార్డ్ మద్యం కంటే తక్కువ ఆల్కహాల్ కలిగి ఉంటుంది. అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. విటమిన్ బి, ప్రొటీన్, ఫైబర్ వంటి కొన్ని పోషకాలు బీరులో ఉంటాయి. ఒక పరిశోధన ప్రకారం, పరిమిత పరిమాణంలో బీర్ తీసుకుంటే అది కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రిస్తుంది.
బీర్‌లో 125 కేలరీలు మాత్రమే ఉన్నాయి. బీర్ శరీరంలో ఎల్‌డిఎల్‌కు బదులుగా హెచ్‌డిఎల్ స్థాయిని పెంచుతుంది. ఇది సిరలను ఆరోగ్యంగా ఉంచుతుంది. బీర్‌లో ఫోలిక్ యాసిడ్‌తో సహా బి విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇది గుండెపోటును నివారించడంలో సహాయపడుతుంది. డయాబెటిక్ పేషెంట్లు బీరు ఎక్కువగా తాగితే శరీరంలో ఇన్సులిన్ స్థాయి క్షీణించే అవకాశం ఉంది.
ఇంకా బీర్ ఇతర ఆరోగ్య ప్రయోజనాలు పరిశీలించినట్టయితే, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడం, మధుమేహం నియంత్రణ, మూత్రపిండాల్లో రాళ్లను నివారించడం నుండి కొలెస్ట్రాల్, రక్తంలో గడ్డలు వంటివి తగ్గించడం చేస్తుంది. ఇది జీర్ణక్రియ, బోలు ఎముకల వ్యాధి, ఎముకల ఆరోగ్యం, అధిక రక్తపోటుకు కూడా సహాయపడుతుంది.
బీర్‌లో హిమోగ్లోబిన్‌ను నిర్వహించడానికి, రక్తహీనత చికిత్సకు సహాయపడే విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇది గుండెను రక్షిస్తుంది. వివిధ హృదయ సంబంధ వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. బీర్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఎందుకంటే ఇందులో కరిగే ఫైబర్ ఉంటుంది. బీరును ఎక్కువగా తీసుకుంటే ఫ్యాటీ లివర్, లివర్ సిర్రోసిస్ వంటి వ్యాధులు రావచ్చు.
బీర్ అనేది మాల్టెడ్ బార్లీ, గోధుమలు లేదా మొక్కజొన్నతో తయారు చేస్తారు. ఇది బ్రూయింగ్ ప్రక్రియలో పులియబెట్టి తయారు చేస్తారు. దీనిని లిక్విడ్ బ్రెడ్ అని కూడా పిలుస్తారు. దీనిని పానీయంగా కాకుండా ఆహారంగా పరిగణిస్తారు. బీర్ వినియోగం ప్రతికూల ఆరోగ్య పరిణామాలను కలిగి ఉన్నప్పటికీ, అధికంగా తీసుకోవటం వల్ల వాటిలో బ్లడ్ షుగర్ అసమతుల్యత, ఆల్కహాల్ డిపెండెన్స్, డిప్రెషన్, లివర్ సమస్యలు, క్యాన్సర్ లేదా అకాల మరణం వంటి ప్రమాదాలు పొంచివున్నాయి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..