Health: భోజనం చేసిన తరువాత కడుపు ఉబ్బరంగా ఉందా? ఈ సింపుల్ చిట్కాతో స్పాట్ రిలీఫ్ పొందండి..

|

Mar 15, 2023 | 5:34 PM

తిన్న తర్వాత కడుపు ఉబ్బరం, ఇతర ఉదర సంబంధిత రుగ్మతలు తలెత్తుతాయి. అయితే, ఉదర సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ఇంట్లోనే సింపుల్ రెమెడీస్‌ని సూచిస్తున్నారు..

Health: భోజనం చేసిన తరువాత కడుపు ఉబ్బరంగా ఉందా? ఈ సింపుల్ చిట్కాతో స్పాట్ రిలీఫ్ పొందండి..
Kadupu Ubbaram
Follow us on

తిన్న తర్వాత కడుపు ఉబ్బరం, ఇతర ఉదర సంబంధిత రుగ్మతలు తలెత్తుతాయి. అయితే, ఉదర సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ఇంట్లోనే సింపుల్ రెమెడీస్‌ని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. చాలా మందికి తిన్న తర్వాత ఉబ్బరం లేదా గ్యాస్ సమస్య ఉంటుంది. సమయానికి తినలేకపోవడం, ఆహారం సరిగ్గా నమలకపోవడం వల్ల కూడా జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యలు మనకు అసౌకర్యాన్ని కలిగించడమే కాకుండా దీర్ఘకాలంలో ఇతర అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి. హోమ్ రెమెడీస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఉబ్బరాన్ని నివారించడంలో సహాయపడే 5 డ్రింక్స్:

జీలకర్ర, అజ్వాన్ నీరు: ఈ మిశ్రమంలో జీర్ణక్రియను పెంచే ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రేరేపించే సమ్మేళనాలు ఉన్నాయి. ఇది కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. అజీర్తి, అసిడిటీ నుంచి ఉపశమనం పొందడానికి పురాతన కాలం నుండి ఈ చిట్కా ఉపకరిస్తుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో 1-4 టీస్పూన్ల జీలకర్ర, 1-4 టీస్పూన్ల అజ్వానా త్రాగాలి.

సోంపు నీరు: ఈ డ్రింక్‌లో థైమోల్ ఉంటుంది. జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రేరేపించడంలో సహాయపడుతుంది. ఈ సోంపు గింజలు జీర్ణవ్యవస్థలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి. కొన్ని చెంచాల సోంపు గింజలను రుబ్బుకొని, తర్వాత 1-2 స్పూన్ల పొడిని ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో వేసి తాగితే ప్రయోజనం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

నిమ్మరసం, పసుపు: ఈ మిశ్రమంలోని సిట్రిక్ యాసిడ్ జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. కడుపు ఉబ్బరాన్ని తగ్గించడమే కాకుండా పేగుల ఇన్ఫెక్షన్లను కూడా నివారిస్తుంది. ఒక గ్లాసు వేడి నీటిలో 1 టీస్పూన్ నిమ్మరసం, చిటికెడు పసుపు వేసి త్రాగాలి.

యాపిల్ సైడర్ వెనిగర్, వాటర్ మిశ్రమం: ఈ మిశ్రమం పొట్టలోని pH స్థాయిని సమతుల్యం చేసి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో 1 టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ వేసి తీసుకోవాలి.

తరిగిన పుదీనా ఆకులు, నీటి మిశ్రమం: ఈ డ్రింక్ కడుపులోని కండరాలను సడలిస్తుంది. పిత్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. అందువలన ఈ డ్రింక్ గ్యాస్, ఉబ్బరం సమస్యను నిరోధిస్తుంది. పుదీనా జీర్ణాశయ ఆరోగ్యానికి గొప్ప క్రిమినాశక, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొన్ని తరిగిన పుదీనా ఆకులను కలుపుకుని తాగడం వల్ల కడుపు ఉబ్బరాన్ని నివారించవచ్చు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..