Home remedies for long hair: జుట్టును చాలామంది భద్రంగా చూసుకుంటారు. నేటి జీవనశైలితో చాలామంది జుట్టు బలహీనంగా మారుతుంది. అయితే.. ఇలాంటి పరిస్థితుల్లో పొడవాటి జుట్టును ఎవరు కోరుకోరు? పొడవాటి జుట్టును ఇష్టపడే మహిళలు తమ జుట్టును జాగ్రత్తగా చూసుకోవడానికి ఎల్లప్పుడూ చిట్కాలను పాటిస్తుంటారు. అదే సమయంలో ప్రతి మహిళ తన జుట్టు నడుము భాగం వరకు పొడవుగా పెరగడానికి ఏం చేయాలో తెలుసుకోవాలనుకుంటుంది. అటువంటి పరిస్థితిలో మీరు కూడా అలాంటి చిట్కా కోసం చూస్తున్నట్లయితే ఈ పద్దతి పాటించండి. ఇలాంటి చిట్కాలను రెగ్యూలర్ గా పాటిస్తే మందపాటి, పొడవాటి జుట్టును సొంతం చేసుకోవచ్చు. ఆ హోంరెమెడీ ఏంటో ఇప్పుడు తెలుసుకోండి..
జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరగడానికి ఈ రెమెడీ పాటించండి.. పాలతో జుట్టుకు ప్రోటీన్ ట్రీట్మెంట్ ఇవ్వండి.. ఇలా చేయడం ద్వారా కేశాలు బలంగా మారుతాయి.
కావలసినవి..
ఒక గుడ్డు, ఒక కప్పు పచ్చి పాలు, ఒక పెద్ద చెంచా కొబ్బరి నూనె, అరకప్పు క్యారెట్ రసం, ఒక చిన్న చెంచా తేనె.
హెయిర్ మాస్క్ తయారు చేసే విధానం..
ప్రయోజనాలు..
1- ఈ హెయిర్ మాస్క్‌తో జుట్టుకు అధిక మొత్తంలో ప్రోటీన్ అందుతుంది, జుట్టు బాగా పెరుగుతుంది.
2- మీ జుట్టు డల్‌నెస్ తొలగిపోయి మెరిసిపోతుంది. అంతే కాదు జుట్టు ఒత్తుగా, దృఢంగా మారుతుంది.
3- ఈ హెయిర్ ప్యాక్ జుట్టును మృదువుగా చేయడంలో కూడా మేలు చేస్తుంది. అలాగే జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది.
4- మరోవైపు జుట్టు చిట్లిపోయి ఇబ్బంది పడుతుంటే ఈ సమస్యను అధిగమించడానికి ఈ హెయిర్ ప్యాక్ మీకు సహాయం చేస్తుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం చూడండి..