Holi 2025 Hair Care: హోలీ రంగులతో జుట్టు నిర్జీవంగా మారకుండా.. జుట్టుని ఇలా సంరక్షించుకోండి..

హోలీ రోజున రకరకాల రంగులతో హోలీని ఆడుకుంటారు. అయితే ప్రస్తుతం రకరకాల రసాయన రంగులను ఉపయోగిస్తున్నారు. ఈ కారణంగా రంగులను జల్లుకునే సమయంలో చర్మం మాత్రమే కాదు.. జుట్టు కూడా నిర్జీవంగా మారుతుంది. అంతేకాదు జుట్టు కెమికల్స్ వలన పాడవుతుంది. దీంతో జుట్టు సంరక్షణ పట్ల జాగ్రత్త వహించండి. మార్కెట్లో లభించే చాలా రంగులలో చర్మాన్ని మాత్రమే కాదు జుట్టును కూడా నిర్జీవంగా చేసే రసాయనాలు ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో హోలీ రోజున జుట్టును రక్షించుకోవడానికి కొన్ని చిట్కాలను పాటించాలి.

Holi 2025 Hair Care: హోలీ రంగులతో జుట్టు నిర్జీవంగా మారకుండా.. జుట్టుని ఇలా సంరక్షించుకోండి..
Holi 2025 Hair Care

Updated on: Mar 05, 2025 | 1:23 PM

చాలా మంది రంగులతో ఆడుకోకపోతే హోలీ వేడుక అసంపూర్ణమని భావిస్తారు. మరికొందరు రంగులకు దూరంగా ఉండాలని కోరుకుంటారు. అయితే ఎక్కువ మంది వయసుని మరచి మరీ హోలీ రోజున రంగులతో ఆడుకుంటారు. అయితే ఈ రంగుల వలన హాని కలగకుండా చర్మంతో పాటు జుట్టును కూడా జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. చాలా మంది తమ చర్మాన్ని రంగుల వల్ల కలిగే నష్టం నుంచి రక్షించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. అయితే రసాయన రంగులు మీ జుట్టుకు చాలా నష్టాన్ని కలిగిస్తాయి. దీని కారణంగా సిల్కీ-మృదువైన జుట్టు కూడా నిర్జీవంగా మారుతుంది. చిక్కులు పడుతుంది. కొన్ని చిట్కాల సహాయంతో హోలీ రోజున జుట్టును రసాయన రంగుల నుంచి రక్షణ కోసం కొన్ని సహజమైన చిట్కాలను పాటించవచ్చు.

అబ్బాయిలు అయినా అమ్మాయిలైనా జుట్టు విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే అమ్మాయిలు తమ జుట్టు సంరక్షణ పట్ల మరింత ఎక్కువ శ్రద్ధ పెడతారు. ముఖ్యంగా తమ జుట్టును సిల్కీగా ఉంచుకోవడానికి ఖరీదైన ఉత్పత్తులతో పాటు ఇంట్లోని ఉండే వస్తువులతో ఇంటి నివారణల చిట్కాల వరకు ప్రతిదీ ప్రయత్నిస్తారు. హోలీ రోజున కొంచెం అజాగ్రత్తగా ఉన్నా.. మీ అందమైన జుట్టు చెడిపోతుంది. కొన్ని సార్లు జుట్టు ఊడిపోయే సమస్య కూడా పెరుగుతుంది. ఈ నేపధ్యంలో హోలీ రోజున జుట్టును రంగుల నుంచి రక్షించుకోవడానికి కొన్ని చిట్కాలను తెలుసుకుందాం.

జుట్టును విరబోసుకుని ఉంచొద్దు

ప్రస్తుతం ట్రెండీ రీల్స్ యుగం నడుస్తోంది. దీని కారణంగా చాలా మంది హోలీ రోజున కూడా రీల్స్ కోసం.. తమ జుట్టును విరబోసుకుంటారు. అయితే ఇలా చేయడం వలన రంగులతో ఆడుకుంటే జుట్టుకు ఎక్కువ నష్టం జరుగుతుంది. కనుక జుట్టుని హోలీ ఆడే సమయంలో గట్టగా కట్టుకోండి. హోలీ రోజున తలపై టోపీ ధరించడం మర్చిపోవద్దు. ఇలా చేయడం వలన జుట్టు రంగుల నుంచి చాలా వరకు సురక్షితంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

జుట్టుకు నూనె రాసుకోండి

హోలీ ఆడే ముందు జుట్టుకు నూనె రాసి గట్టిగా జడ వేసుకోండి. లేదా ముడి వేసుకోండి. రంగుల నుంచి రక్షణ కోసం నూనెలో నిమ్మరసం కలిపి జుట్టుకు రాసుకోవడం మంచిది. ఇందు కోసం ఆవాలు, బాదం, కొబ్బరి లేదా ఆలివ్ నూనెను ఉపయోగించవచ్చు. రంగులతో ఆడుకునేటప్పుడు నీటి రంగులు తలపై పడకుండా చూసుకోండి.

జుట్టుకి రక్షణ పొరను ఏర్పాటు చేసుకోండి

హోలీ రోజున జుట్టును రంగుల నుంచి రక్షించుకోవడానికి ఉత్తమ మార్గం.. జుట్టుకు రక్షణ పొరను ఏర్పాటు చేసుకోవడం. హోలీ పండుగకు ముందు రోజు రాత్రి జుట్టుకు కండిషనర్ రాసి.. అనంతరం సీరం రాసుకోండి. ఇది జుట్టు మీద ఒక పొరను సృష్టిస్తుంది. అప్పుడు రంగుల వలన జుట్టుకు పెద్దగా నష్టం కలగదు. జుట్టు సిల్కీగా ఉంటుంది.

హోలీ అనంతరం ఎలా శుభ్రం చేసుకోవాలంటే

హోలీ ఆడిన తర్వాత కఠినమైన షాంపూలను ఉపయోగించవద్దు. జుట్టును శుభ్రం చేసిన తర్వాత.. బాగా కండిషన్ చేయండి. జుట్టు చాలా చిక్కులు పడితే పండిన అరటిపండు గుజ్జుని, పెరుగు, కలబంద జెల్‌ను కలిపి పేస్ట్ లా చేసి ఆ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేయండి. తర్వాత 20 నుంచి 25 నిమిషాల పాటు ఉంచి తర్వాత జుట్టును గోరు వెచ్చని నీటితో శుభ్రం చేయండి. దీనివల్ల జుట్టు మృదువుగా మారుతుంది.

 

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..