AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Holi 2025: హోలీ రోజున ఈ పరిహారాలు చేయండి.. గ్రహ దోషాలు తొలగి సుఖ సంతోషాలు మీ సొంతం..

హిందువులు జరుపుకునే ప్రధాన పండుగలలో హోలీ పండుగ ఒకటి. పిల్లలు పెద్దలు ఇష్టంగా జరుపుకునే రంగుల కేళి హోలీ. ఈ రోజున ఎక్కడ చూసినా రంగులు వర్షంగా కురుస్తూనే ఉంటాయి. అయితే హోలీ రోజున కొన్ని చర్యలు చేపడితే.. అవి ఇంట్లో సంపద, శ్రేయస్సు పెరిగేలా చేస్తాయని వాస్తు శాస్త్రం పేర్కొంది. కనుక ఈ రోజు హోలీ రోజున చేయాల్సిన చర్యల గురించి తెలుసుకుందాం..

Holi 2025: హోలీ రోజున ఈ పరిహారాలు చేయండి.. గ్రహ దోషాలు తొలగి సుఖ సంతోషాలు మీ సొంతం..
Holi 2025 Vastu Tips
Surya Kala
|

Updated on: Mar 05, 2025 | 11:59 AM

Share

ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజుని హోలీ పండగగా జరుపుకుంటారు. ఈ హోలీ హోలీ హిందూ మతంలో ఒక ప్రధాన పండుగ. హోలీ పండుగను చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా భావిస్తారు. దేశవ్యాప్తంగా హోలీ పండుగను ఎంతో సంతోషంగా, ఉత్సాహంగా జరుపుకుంటారు. హోలీ రోజున ప్రజలు ఒకరిపై ఒకరు రంగులు పూసుకుని ఆలింగనం చేసుకుంటారు. హోలీ రోజున వాస్తు శాస్త్రంలో కొన్ని నివారణలు కూడా సూచించబడ్డాయి. ఈ పరిహారాలను పాటించడం ద్వారా గ్రహ దోషాల నుంచి ఉపశమనం లభిస్తుంది. అదే విధంగా ఇంట్లో ఆనందం, శ్రేయస్సు పెరుగుతుంది. కనుక హోలీ రోజున చేయాల్సిన చర్యల గురించి ఈ రోజు తెలుసుకుందాం..

2025 లో హోలీ ఎప్పుడంటే

పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం ఫాల్గుణ మాసం పౌర్ణమి తిధి మార్చి 13న ఉదయం 10:35 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తిధి మార్చి 4న మధ్యాహ్నం 12:23 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో హోలికా దహనం మార్చి 13న చేయనున్నారు. మార్చి 14న హోలీ పండుగ జరుపుకోనున్నారు.

హోలీ రోజున గ్రహ దోష నిర్వరణ కోసం చేయాల్సిన పరిహారాలు..

తులసి మొక్క నాటండి

లక్ష్మీ దేవి తులసి మొక్కలో నివసిస్తుందని నమ్ముతారు. అందువల్ల హిందూ మతంలో తులసి మొక్కకి చాలా ముఖ్యమైనది స్థానం ఉంది. హోలీ రోజున తులసి మొక్కను నాటాలి. వాస్తు శాస్త్రం ప్రకారం హోలీ రోజున తులసి మొక్కను నాటడం వల్ల లక్ష్మీ దేవి ఆశీస్సులు లభిస్తాయి. లక్ష్మీ దేవి అనుగ్రహం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయి. ఈ రోజున తులసి మొక్కను నాటడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయి.

ఇవి కూడా చదవండి

ఉదయించే సూర్యుని ఫోటో

వాస్తు శాస్త్రం ప్రకారం హోలీ రోజున, ఇల్లు లేదా ఆఫీసులో తూర్పు దిశలో ఉదయించే సూర్యుని చిత్రాన్ని ఉంచాలి. ఇలా చేయడం వలన వ్యక్తి జీవితంలో అదృష్టం కలుగుతుంది. ఇలా చేయడం ద్వారా వ్యాపారంలో పురోభివృద్ధి కలుగుతుంది. అంతేకాదు ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉంది.

లక్ష్మీ దేవి ముందు వెండి నాణెం ఉంచండి

హోలీ రోజున ఇంటికి వెండి నాణెం లేదా వెండి వస్తువులు తీసుకుని రండి. తర్వాత ఆ వెండి నాణెంను లక్ష్మీ దేవి ముందు ఉంచి పూజించాలి. అప్పుడు వెండి నాణెం మీ పర్సులో లేదా డబ్బులు పెట్టే సేఫ్‌లో ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

రాధాకృష్ణల చిత్రం

హోలీ రోజున బెడ్ రూమ్ లో శ్రీ కృష్ణుడు రాధా ఫోటోని ఉంచాలని వాస్తు శాస్త్రం చెబుతుంది. ఇలా చేయడం వల్ల వైవాహిక జీవితంలో ఆనందం కలుగుతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Follow Us
యువతలో గుండెపోటు మరణాలు పెరగడానికి అసలు కారణం ఇదే
యువతలో గుండెపోటు మరణాలు పెరగడానికి అసలు కారణం ఇదే
ధోనీ అభిమానులకు గుడ్‌న్యూస్.. రీఎంట్రీ డేట్ ఫిక్స్
ధోనీ అభిమానులకు గుడ్‌న్యూస్.. రీఎంట్రీ డేట్ ఫిక్స్
నకిలీ టూత్‌పేస్ట్‌ను చిటికెలో కనిపెట్టే 'స్మార్ట్' టిప్స్ ఇవే!
నకిలీ టూత్‌పేస్ట్‌ను చిటికెలో కనిపెట్టే 'స్మార్ట్' టిప్స్ ఇవే!
ముల్లును ముల్లుతో తీసేందుకు పుట్టిన పాకిస్థాన్‌ బ్రెయిన్ వైరస్..!
ముల్లును ముల్లుతో తీసేందుకు పుట్టిన పాకిస్థాన్‌ బ్రెయిన్ వైరస్..!
ఆర్టీసీలో ఉద్యోగాల రాత పరీక్ష 2026 ఫలితాలు విడుదల.. లింక్ ఇదే
ఆర్టీసీలో ఉద్యోగాల రాత పరీక్ష 2026 ఫలితాలు విడుదల.. లింక్ ఇదే
ఫ్లైట్‌లో నల్ల సాక్సులు ఎందుకు వద్దంటారో తెలుసా?
ఫ్లైట్‌లో నల్ల సాక్సులు ఎందుకు వద్దంటారో తెలుసా?
రాత్రిళ్లు పదే పదే మూత్రవిసర్జన అవుతోందా? లైట్ తీసుకోకండి
రాత్రిళ్లు పదే పదే మూత్రవిసర్జన అవుతోందా? లైట్ తీసుకోకండి
వాట్సాప్‌లో ఈ 5 రహస్య ఫీచర్లు మీకు తెలుసా? 90% మందికి తెలియని ఈ ట
వాట్సాప్‌లో ఈ 5 రహస్య ఫీచర్లు మీకు తెలుసా? 90% మందికి తెలియని ఈ ట
నా ప్రతి సినిమాతో వారు హ్యాపీగా ఉండేలా చూసుకుంటాను: నిహారిక
నా ప్రతి సినిమాతో వారు హ్యాపీగా ఉండేలా చూసుకుంటాను: నిహారిక
శ్రీవారి భక్తులకు హెచ్చరిక! వీఐపీ దర్శనం పేరుతో మోసపోకండి
శ్రీవారి భక్తులకు హెచ్చరిక! వీఐపీ దర్శనం పేరుతో మోసపోకండి