రక్తంలో పేరుకుపోయే చెడు కొలెస్ట్రాల్ మన శరీరానికి తీవ్ర హాని తలపెడుతుంది. రక్త నాళాలలో చెడు కొలెస్ట్రాల్ అడ్డుపడి రక్త ప్రసరనకు ఆటంకం కలిగిస్తుంది. దీంతో గుండెతోపాటు శరీరంలోని మిగిలిన భాగాలకు రక్తం సరఫరా చేయడంలో తీవ్ర ఇబ్బంది తలెత్తుతుంది. దీని కారణంగా అధిక రక్తపోటు, హార్ట్ ఎటాక్, మధుమేహం వంటి ఇతర ప్రమాదకర వ్యాధులు ఎదుర్కోవలసి ఉంటుంది. అందుకే చెడు కొలెస్ట్రాల్ లక్షణాలను సకాలంలో గుర్తించడం చాలా ముఖ్యం. నిజానికి శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరిగినప్పుడు కొన్ని రకాల హెచ్చరిక సంకేతాలను ఇస్తుంది. ముఖ్యంగా కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు మన పాదాలలో కొన్ని ముఖ్యమైన లక్షణాలు కనిపించడం ప్రారంభమవుతుంది. ఇలాంటి లక్షణాలు కనబడిన వెంటనే వైద్యులను సంప్రదించి సరైన చికిత్స తీసుకోవడం మంచింది.
రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పరిమాణం పెరిగినప్పుడు పాదాలకు రక్త ప్రసరణలో అవరోధం ఏర్పడుతుంది. దీని కారణంగా తరచుగా పాదాలు తిమ్మిరి పట్టినట్లు అనిపిస్తుంది.
కొలెస్ట్రాల్ వల్ల ధమనుల్లో అడ్డు ఏర్పడుతుంది. ఫలితంగా పాదాలలో రక్త సరపరా సజావుగా ఉండదు. దీంతో పాదాలు చల్లగా అయిపోతుంటాయి.
కొలెస్ట్రాల్ అడ్డుపడటం వల్ల రక్తప్రసరణ సరిగా జరగక ఆక్సిజన్ సరపరా కూడా పాదాలకు సరిగ్గా చేరదు. అటువంటి పరిస్థితిలో పాదాలలో తీవ్రమైన నొప్పి తలెత్తుతుంది.
అధిక కొలెస్ట్రాల్ లక్షణాలను మన పాదాల గోళ్ల వల్ల కూడా గుర్తించవచ్చు. సాధారణంగా మన గోళ్లు గులాబీ రంగులో కనిపిస్తాయి. కానీ అధిక కొలెస్ట్రాల్ కారణంగా రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోతే గోర్లు పసుపు రంగులోకి మారడం లేదా గోర్లలో చారలు కనిపిస్తాయి.
మరిన్ని ఆరోగ్య సమాచారం కోసం క్లిక్ చేయండి.