Milk: మీరూ పాలల్లో చక్కెర కలుపుకుని తాగుతున్నారా..? ఐతే ఈ విషయం తెలుసుకోవాల్సిందే..

|

Sep 03, 2023 | 7:28 PM

పాలు తాగడం ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలుసు. పాలలో ఆరోగ్యానికి అవసరమైన అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే ప్రతి ఒక్కరూ రోజుకు గ్లాసుడు పాలు తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. పాల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ, చాలామంది పాలు తాగడానికి ఇష్టపడరు. పాలు రుచిగా ఉండటానికి అందులో చక్కెర, బెల్లం, తేనే వంటివి కలుపుకుని..

Milk: మీరూ పాలల్లో చక్కెర కలుపుకుని తాగుతున్నారా..? ఐతే ఈ విషయం తెలుసుకోవాల్సిందే..
Do Not Mix These 4 Ingredients In Milk
Follow us on

పాలు తాగడం ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలుసు. పాలలో ఆరోగ్యానికి అవసరమైన అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే ప్రతి ఒక్కరూ రోజుకు గ్లాసుడు పాలు తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. పాల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ, చాలామంది పాలు తాగడానికి ఇష్టపడరు. పాలు రుచిగా ఉండటానికి అందులో చక్కెర, బెల్లం, తేనే వంటివి కలుపుకుని తాగుతారు. ఇవేకాకుండా కొందరు రుచి కోసం పాలల్లో రకరకాల పొడులు కూడా కలుపుకుని తాగుతారు. ఐతే పాలల్లో ఈ నాలుగు రకాల పదార్ధాలు మాత్రం మరచిపోయికూడా అస్సలు కలపకూడదట. వాటిని కలిపితే మేలుకి బదులు కీడే ఎక్కువ జరుగుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం..

చాక్లెట్ సిరప్

పాలకు మంచి రుచి రావడానికి కొందరు చాక్లెట్ సిరప్‌ని కలుపుతుంటారు. కానీ పాలల్లో చాక్లెట్ సిరప్ కలిపి తాగడం వల్ల శరీరంలో రిఫైన్ చేయని కొవ్వులు పేరుకుపోతాయి. ఇది బరువు పెరగడం నుంచి రక్తంలో చక్కెర వరకు పలు రకాల సమస్యలకు కారణం అవుతుంది.

కెఫిన్

చాలామంది పాలతో టీ లేదా కాఫీ తాగుతారు. అలా చేయడం సరికాదు. పాలలో కెఫిన్ కలిపితే పాలలోని పోషకాలు శరీరానికి అందవు. కెఫిన్ పాలు తాగడం వల్ల నిద్రలేమి, హృదయ స్పందన రేటు పెరగడం, జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.

ఇవి కూడా చదవండి

చక్కెర

మనలో అధికమంది పాలల్లో పంచదార కలిపి తాగుతుంటారు. ముఖ్యంగా పిల్లలకు పాలల్లో చక్కెర కలిపి ఇస్తుంటారు. అయితే పాలలో పంచదార కలిపితే క్యాలరీలు పెరిగి బరువు పెరుగుతారనే విషయం చాలా మందికి తెలిసుండదు. ఇది మధుమేహం వంటి అనేక వ్యాధులకు దారి తీస్తుంది.

కృత్రిమ స్వీటెనర్లు

కొంతమంది పాలకు తీపిని జోడించడానికి కృత్రిమ స్వీటెనర్లను ఉపయోగిస్తారు. కానీ ఈ రకమైన స్వీటెనర్లు చక్కెర కంటే హానికరం అని ఇప్పటికే పలు అధ్యయనాలు వెల్లడించాయి. కృత్రిమ తీపి కలిపిన పాలు తాగడం వల్ల వేగంగా బరువు పెరుగుతారు.

నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్ చేయండి.