Eye health: గంటల తరబడి డిజిటల్‌ స్క్రీన్‌తో గడిపేవారు 20 నిముషాలకోసారి ఇలా చెయ్యాలి.. లేదంటే..

|

Jul 06, 2022 | 12:24 PM

మన జీవన విధానంలో కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు అంతర్భాగమైపోతున్నాయి. ఇవిలేకుండ రోజు గడవలేని స్థితికి వచ్చేశాం. కార్పొరేట్ ప్రపంచంలో సాధారణంగా ఉద్యోగాలు చేసేవారు విరామం లేకుండా గంటల తరబడి..

Eye health: గంటల తరబడి డిజిటల్‌ స్క్రీన్‌తో గడిపేవారు 20 నిముషాలకోసారి ఇలా చెయ్యాలి.. లేదంటే..
Eye Strain Relief
Follow us on

ways to reduce screen time: మన జీవన విధానంలో కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు అంతర్భాగమైపోతున్నాయి. ఇవిలేకుండ రోజు గడవలేని స్థితికి వచ్చేశాం. కార్పొరేట్ ప్రపంచంలో సాధారణంగా ఉద్యోగాలు చేసేవారు విరామం లేకుండా గంటల తరబడి వీటి ముందు గడపవల్సి వస్తుంది. కరోనా పుణ్యమా అని ఆన్‌లైన్ తరగతులు వచ్చాక విద్యార్ధులకు ఈ తిప్పలు తప్పడం లేదు. ఇలా ఎక్కువ సమయం డిజిటల్ స్క్రీన్ చూడటం వల్ల కళ్లకు హాని చేసే ఎన్నో సమస్యలు చుట్టుముడుతున్నాయి. కళ్లు మసకబారడం, తలనొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నట్లైతే.. ఈ చిన్నపాటి జాగ్రత్తలతో ఉపశమనం పొందవచ్చు. అవేంటంటే..

ఎలక్ట్రిక్‌ గాడ్జెట్లను 8 నుంచి 9 గంటల పాటు వాడేవారు స్క్రీన్ గ్లాస్‌లను ధరించడం చాలా ముఖ్యం. వీటిని బ్లూ లైట్ బ్లాకింగ్ గ్లాసెస్ అని కూడా పిలుస్తారు. వీటిని ధరించడం వల్ల స్క్రీన్ నుంచి వచ్చే హానికరమైన కాంతిని అడ్డుకుని, కళ్ళను కాపాడుతాయి.

కంప్యూటర్‌ స్క్రీన్‌ ముందు కూర్చుని పనులు చేస్తున్నప్పుడు, సాధారణంగా కళ్లు రెప్పవేయడం మరచిపోతుంటాం.. అందువల్ల కళ్లు తరచూ పొడిబారడం, తలనొప్పి, చికాకు వంటివి తలెత్తుతాయి. ఎంత ముఖ్యమైన పనిచేస్తున్నప్పటికీ కళ్ళను అటుఇటు తిప్పడం, రెప్పవేయడం మర్చిపోకూడదు. ఈ విధానాలు మీ కళ్ళకు ఉపశమనం కలిగిస్తాయి.

ఇవి కూడా చదవండి

కంప్యూటర్‌ స్క్రీన్‌పై పెద్ద ఫాంట్ అక్షరాలు ఉపయోగించాలి. అలాగే బ్రైట్‌నెస్‌ను మీడియంకు మార్చుకోవాలి. దీనితోపాటు ప్రతి 20 నిమిషాలకు ఓసారి, 20 సెకన్ల పాటు 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును చూడటం ద్వారా మీ కళ్ళకు విరామం లభిస్తుంది. కళ్లు రిలాక్స్‌ అయ్యి, తేమగా ఉంటాయి.

25 అంగుళాల దూరంలో మానిటర్ స్క్రీన్‌ను ఉంచాలి. నిద్రకుపక్రమించే ముందు అంటే కనీసం ఒక గంట ముందు నుంచి ఫోన్‌, ల్యాప్‌టాప్‌లను ఉపయోగించకూడదు. లేదంటే మీ నిద్రపై వీటి ప్రభావం పడుతుంది. ఈ చిన్నపాటి జాగ్రత్తలతో మీ నయనారోగ్యాన్ని పదికాలాలపాటు పదిలంగా కాపాడుకోవచ్చు.