NCERT Recruitment 2022: ఎన్సీఈఆర్టీలో ప్రొఫెషనల్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలు.. రూ.36,000ల జీతం..

కేంద్ర ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్ (NCERT)కు చెందిన లైబ్రరీ అండ్‌ డాక్యుమెంటేషన్‌ డివిజన్‌లో.. ఒప్పంద ప్రాతిపదికన..

NCERT Recruitment 2022: ఎన్సీఈఆర్టీలో ప్రొఫెషనల్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలు.. రూ.36,000ల జీతం..
Ncert
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 06, 2022 | 8:27 AM

NCERT Professional Assistant Recruitment 2022: కేంద్ర ప్రభుత్వ విద్యామంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్ (NCERT)కు చెందిన లైబ్రరీ అండ్‌ డాక్యుమెంటేషన్‌ డివిజన్‌లో.. ఒప్పంద ప్రాతిపదికన ప్రొఫెషనల్‌ అసిస్టెంట్‌ పోస్టుల (Professional Assistant Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీలు: 4

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: ప్రొఫెషనల్‌ అసిస్టెంట్‌ పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 30 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్‌: నెలకు రూ.39,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: లైబ్రరీ సైన్స్‌లో పీజీ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

అడ్రస్‌: Office of the Haed, LDD, GB Pant Block, NIE, NCERT, New Delhi-110 016.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరుకావచ్చు.

ఇంటర్వ్యూ తేదీ: జులై 20, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.