Strawberry: స్ట్రాబెర్రీలతో బోలెడన్ని లాభాలు.. రెగ్యులర్‌గా తింటే క్యాన్సర్ సహా ఆ జబ్బులకు చెక్ పెట్టొచ్చు..

|

Sep 04, 2022 | 12:58 PM

స్ట్రాబెర్రీలను రెగ్యులర్‌గా తీసుకుంటే ఆరోగ్యానికి చాలామంచిదని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. వీటి రుచి పుల్లగా, తీయ్యగా ఉంటుంది.

Strawberry: స్ట్రాబెర్రీలతో బోలెడన్ని లాభాలు.. రెగ్యులర్‌గా తింటే క్యాన్సర్ సహా ఆ జబ్బులకు చెక్ పెట్టొచ్చు..
Strawberry
Follow us on

Strawberry Health Benefits: స్ట్రాబెర్రీల్లో ఎన్నో పోషకాలు దాగున్నాయి. ఈ రుచికర పండ్లను పిల్లలతో పాటు పెద్దలు కూడా ఇష్టంతో తింటారు. అయితే, స్ట్రాబెర్రీలను రెగ్యులర్‌గా తీసుకుంటే ఆరోగ్యానికి చాలామంచిదని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. దీని రుచి పుల్లగా, తీయ్యగా ఉంటుంది. అలాగే, స్ట్రాబెర్రీ వాసన ఇతర పండ్ల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఈ పండు తినడం వల్ల అనేక సమస్యలను అధిగమించవచ్చు. స్ట్రాబెర్రీ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

స్ట్రాబెర్రీ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

స్ట్రాబెర్రీలలో యాంటీఆక్సిడెంట్, పాలీఫెనోలిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది అనేక ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడంలో ప్రభావవంతంగా ఉంటుంది. ఇందులో ఉండే విటమిన్ సి బరువు తగ్గించడంతోపాటు క్యాన్సర్‌ను నివారిస్తుంది.

ఇవి కూడా చదవండి

బరువు తగ్గిస్తాయి: స్ట్రాబెర్రీలో కేలరీల పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. ఇది మీ పెరుగుతున్న బరువును తగ్గిస్తుంది. దీనితో పాటు ఇది ఫైబర్‌కు మంచి మూలం. ఇది చాలా కాలం పాటు కడుపు నిండుగా ఉంచుతుంది. దీన్ని తీసుకోవడం ద్వారా పెరుగుతున్న బరువును తగ్గించుకోవచ్చు.

హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి: స్ట్రాబెర్రీలలో యాంటీఆక్సిడెంట్లు, పాలీఫెనాల్ సమ్మేళనాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ప్రభావవంతంగా ఉంటాయి. గుండె సమస్యలను దూరం చేయాలనుకుంటే స్ట్రాబెర్రీలను తినండి. దీనితో కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడంతోపాటు గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

దంతాలను ఆరోగ్యంగా ఉంచుతాయి: దంతాలకు సంబంధించిన సమస్యలను దూరం చేయడానికి స్ట్రాబెర్రీలను తినండి. ఇది దంతాలు, చిగుళ్ల బలాన్ని పెంచుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి దంతాల పసుపును దూరం చేస్తుంది.

ఎముకల బలాన్ని పెంచుతాయి: స్ట్రాబెర్రీలను తీసుకోవడం వల్ల ఎముకల పటుత్వం పెరుగుతుంది. ఇందులో ఉండే గుణాలు ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. మెగ్నీషియం ఎముకల సాంద్రతను పెంచి దృఢంగా మార్చుతుంది.