- Telugu News Photo Gallery Mangalsutra fashion by in hand you can also try mangalsutra style bracelet design in telugu
Fashion Tips: మంగళసూత్రానికి సరికొత్త రూపం.. ఈ స్టైలిష్ బ్రాస్‌లెట్స్ పై ఓ లుక్ వేయండి
నేటి కాలంలో మంగళసూత్రం కూడా సరికొత్త రూపాన్నిసంతరించుకుంది. మంగళసూత్రాన్ని మేడలో ధరించడానికి యువతులు ఇబ్బందిగా ఫీల్ అవుతుంటే.. అటువంటి అమ్మాయిలు డ్రెస్‌లకు మ్యాచ్ అయ్యేలా మంగళసూత్రాన్ని బ్రాస్‌లెట్ రూపంలో ప్రయత్నించవచ్చు.
Updated on: Sep 04, 2022 | 1:13 PM

హిందూమతంలో వివాహానికి ప్రత్యేక స్థానము ఉంది. సప్తపదితో యువతీయువకులు దంపతులుగా సరికొత్త జీవితంలోకి అడుగు పెడతారు. అయితే కాలానుగుణంగా వచ్చిన మార్పుల్లో భాగంగా ప్రస్తుతం జీవనశైలిలో కొంత మార్పు వచ్చింది. వివాహానంతరం స్త్రీలు ప్రత్యేకంగా మంగళసూత్రాన్ని ధరింస్తారు. మెడలో ధరించే మంగళసూత్రం చాలా అందమైన డిజైన్లతో ఉంటుంది. అయితే ప్రస్తుతం మంగళసూత్రాన్ని మెడ కంటే బ్రాస్‌లెట్ తరహాలో ధరించడానికి అమ్మాయిలు ఆసక్తిని చూపిస్తున్నారు.

మహిళలు ట్రెండీ బ్రాస్లెట్ స్టైల్ లో మంగళసూత్రాన్ని ధరించడానికి ఇష్టపడుతున్నారు. మీ మణికట్టుపై స్టైలిష్ మంగళసూత్రాన్ని ఎలా అలంకరించుకోవచ్చో ఈ రోజు మేము మీకు చెప్తాము. కొన్ని ట్రెండ్స్ తెలుసుకుందాం-

ప్రజలు జ్యోతిష్యాన్ని విశ్వస్తారు. రాశి ప్రకారం మహిళలు బ్రాస్లెట్ శైలిలో మంగళసూత్రాన్ని ధరించవచ్చు, ముఖ్యంగా రాశిచక్రం లేదా వారి అదృష్ట సంఖ్య రూపకల్పనతో మంగళసూత్రాన్ని ధరించవచ్చు. మీరు ఈ రకమైన మంగళసూత్రాన్ని లాకెట్టులో పొందవచ్చు .

స్త్రీలు భర్త పేరు ఉన్న మంగళసూత్రాన్ని ధరించడానికి ఇష్టపడుతున్నారు. అటువంటి పరిస్థితిలో, మీరు భర్త పేరును స్టైలిష్ ఫాంట్‌లో లాకెట్టుగా తయారు చేయించుకోవచ్చు. భర్త పేరులోని మొదటి అక్షరాన్ని లాకెట్టుగా తయారు చేయించుకోవచ్చు.

ప్రస్తుతం ఈవిల్ ఐ మంగళసూత్రాల ట్రెండ్ నడుస్తోంది.ఈ రకమైన మంగళసూత్ర బ్రాస్‌లెట్‌ను ధరించాలంటే..బంగారంతో నల్ల పూసలను ఎంపిక చేసుకోవాలి. లాకెట్ లో చిన్న ఏనుగు దంతాన్ని పెట్టి ప్రత్యేక టచ్‌తో మంగళసూత్రాన్ని తయారు చేసుకోవచ్చు.

నేటి కాలంలో, చేతిలో మంగళసూత్రాన్ని ధరించడానికి రకరకాల అప్షన్స్ ఉన్నాయి. కావాలంటే మీరు మల్టీ-చైన్ లుక్ మంగళసూత్రాన్ని, ఆపై లాకెట్టు ఉన్న బ్రాస్‌లెట్ ను ఎంపిక చేసుకోవచ్చు. అంతేకాదు పెళ్లి తేదీని కూడా లాకెట్ గా ఎంపిక చేసుకోవచ్చు. కొంతమంది స్త్రీలు సాదా చైన్ లుక్ ఉన్న బ్రాస్ లెట్ మంగళసూత్రాన్ని ధరించడానికి ఇష్టపడుతున్నారు.





























