AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Red Wine Benefits: రెడ్ వైన్‌తో ఎన్ని ఉపయోగాలో.. రోజుకు ఒక్క పెగ్గు తాగితే చాలు.!

వైన్ ప్రేమికులకు గుడ్ న్యూస్. ఇన్నాళ్లు ఏదో తాగాలి కదా అని విస్కీ, బీర్ లాంటివి తాగుతున్నారా.! మద్యపానం ఆరోగ్యానికి హానికరం అన్నది ఎంత నిజమో.. పరిమితంగా తీసుకునే కొన్ని డ్రింక్స్‌‌తో ఆరోగ్యానికి మేలు కూడా ఉందంటున్నారు వైద్య నిపుణులు. మరి అదేంటో ఇప్పుడు తెలుసుకుందామా..

Red Wine Benefits: రెడ్ వైన్‌తో ఎన్ని ఉపయోగాలో.. రోజుకు ఒక్క పెగ్గు తాగితే చాలు.!
Red Wine
Sridhar Prasad
| Edited By: |

Updated on: Nov 07, 2023 | 4:20 PM

Share

వైన్ ప్రేమికులకు గుడ్ న్యూస్. ఇన్నాళ్లు ఏదో తాగాలి కదా అని విస్కీ, బీర్ లాంటివి తాగుతున్నారా.! మద్యపానం ఆరోగ్యానికి హానికరం అన్నది ఎంత నిజమో.. పరిమితంగా తీసుకునే కొన్ని డ్రింక్స్‌‌తో ఆరోగ్యానికి మేలు కూడా ఉందంటున్నారు వైద్య నిపుణులు. మరి అదేంటో ఇప్పుడు తెలుసుకుందామా..

ఆడా.. మగా అనే తేడా లేకుండా ఎంతోమంది వైన్‌ను బాగా లైక్ చేస్తారు. ఎందుకంటే మిగితా డ్రింక్స్‌తో పోలిస్తే.. వైన్‌లో ఆల్కహాల్ పర్సెంటేజ్ చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. అంతే కాకుండా వైన్ తాగుతుంటే తియ్య.. తియ్యని.. ఫ్లేవర్‌గా అనిపిస్తుంది. అయితే వైన్ ఆరోగ్యానికి చాలా మంచిదని.. దీనితో అనేక వ్యాధులను నియంత్రణలో ఉంచవచ్చునని వైద్యుల తాజా పరిశోధనలో తేలింది. రాత్రి కానీ.. మధ్యాహ్నం కానీ.. తినే ముందు ఒక్క పెగ్గు రెడ్ వైన్ తీసుకోవడం వల్ల మన బాడీ పూర్తిగా క్లీన్ అవుతుంది అంటున్నారు నిపుణులు. వైన్ తీసుకోవడం వల్ల బాడీలోని మలినాలు మలమూత్రం ద్వారా బయటకు వచ్చేస్తాయని చెబుతున్నారు. అయితే వైన్‌లో రెడ్ వైన్, వైట్ వైన్ అని ఇలా రెండు రకాలు ఉంటాయి.

రెడ్ వైన్‌లో ఫ్లెవనాయిడ్స్ ఎక్కువగా ఉండటంతో శరీర సంబంధిత వ్యాధులతో పాటు క్యాన్సర్, వైరల్ ఇన్ఫెక్షన్లు లాంటివి నియంత్రణలో ఉంటాయట. అదే విధంగా రెడ్ వైన్‌లో ఉండే యాంటీ-ఆక్సిడెంట్ల వల్ల చాలా రకాల క్యాన్సర్ వ్యాధులతో పాటు గుండె సంబంధిత వ్యాధులు కూడా కంట్రోల్‌లోకి వస్తాయి. రెడ్ వైన్ రక్తంలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఇలా జరగడం వల్ల హార్ట్ ఎటాక్‌ తగ్గుతుందని వైద్యుల పరిశోధనలో తేలింది.

అలాగే పళ్లపై ఉండే ఎనామిల్‌ను గట్టిపరచడంతో పాటు బ్యాక్టీరియాల నుంచి సాధారణంగా వచ్చే ఇన్ఫెక్షన్‌లను కూడా తగ్గిస్తుంది. వీటన్నింటి కన్నా నిద్ర సమస్యతో బాధపడుతున్న వారు ఒక్క పెగ్ వైన్ తాగితే నిద్రపోడానికి ఉపయోగపడుతుంది అని వైద్యుల సలహా. హాయిగా నిద్రపోవడం వల్ల ఒత్తిడి తగ్గి హార్ట్‌లోని ధమనుల్లో ఉండే కొవ్వును కంట్రోల్ చేసే రెస్వెరాట్రాల్ లాంటి పవర్‌పుల్ యాంటీ ఆక్సిడెంట్లు గుండెను కాపాడుతాయి అని తెలుస్తోంది. దీనికి తోడు తక్కువ మోతాదులో వైన్ తీసుకుంటే జలుబు కూడా దూరం అవుతుందని వైద్యులు అంటున్నారు.

గమనిక: ఇవి ఇంటర్నెట్ నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు నిపుణులను సంప్రదించండి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..