మీ ఇంటి పెరట్లో ఈ మొక్క ఉంటే చాలు.. షుగర్, కీళ్ల నొప్పులకు చెక్‌ పెట్టొచ్చు..!

పారిజాత మొక్క చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఈ మొక్కకు పూసే పూల సువాసన గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. తెలుపు, నారింజ రంగుల్లో ఉండే ఈ పూలు ఎంతో అందంగా కనిపిస్తాయి. వీటిని వాసన మనసుకు ఆహ్వానిస్తుంది. ఇలాంటి మొక్క ఇంటికి అందం పెంచడమే కాకుండా అనారోగ్యాన్ని కూడా దూరం చేస్తుంది. ఈ మొక్క వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాము..

మీ ఇంటి పెరట్లో ఈ మొక్క ఉంటే చాలు.. షుగర్, కీళ్ల నొప్పులకు చెక్‌ పెట్టొచ్చు..!
Parijat Flower
Follow us
Peddaprolu Jyothi

| Edited By: Jyothi Gadda

Updated on: Nov 22, 2024 | 11:51 AM

ఈ రోజులో చాలామంది గార్డెన్ మీద ఆసక్తి చూపుతున్నారు. చిన్న స్థలం ఉన్నా సరే వదిలిపెట్టడం లేదు. అక్కడ మొక్కను పెంచుతున్నారు. నగరాల్లో అపార్ట్‌మెంట్లలో నివసించే ప్రజలు కుండీల్లో మొక్కలను పెంచుతున్నారు. చాలామంది తమ గార్డెన్‌లో పూలు పండ్లతో పాటు ఇతర ఆకర్షణీయ మొక్కలను పెంచుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అయితే ఇంటి పెరట్లో లేదా బాల్కనీలో కొన్ని రకాల మొక్కలను పెంచడం ద్వారా శారీరక మానసిక ఆరోగ్యపరమైన లాభాలను పొందవచ్చు. ఇప్పుడు మనం అలాంటి ఒక మొక్క గురించి మాట్లాడుకుంటున్నాం.. ఇంతకీ ఆ మొక్క ఏంటి అనుకుంటున్నారా..? అదే పారిజాతం.. నైట్ జాస్మిన్ అని కూడా అంటారు.

పారిజాతం మొక్క పూలు మధుమేహరోగులకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. టైప్ 2 డయాబెటిస్ చికిత్సలో వీటిని వాడతారని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ పూలు రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రిస్తాయి. ఇందుకోసం రాత్రిపూట పారిజాత పూలను నీళ్లలో వేసి బాగా ఉడకబెట్టాలి. మరిగిన నీటిని వడకట్టి తర్వాత రోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం తాగాలి. ఇలా తాగితే షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

అలాగే, పారిజాత చెట్టు కొమ్మని ముక్కలు చేసి ఎండబెట్టుకుని మెత్తటి పొడిలా చేసుకోవాలి. దీన్ని గాలి చొరబడని డబ్బాలో పెట్టుకుని మూత పెట్టి నిల్వచేసుకోవాలి.. అర టీ స్పూను పొడిని ఒక గ్లాసు నీటితో కలిపి తాగడం వల్ల మలేరియా, కీళ్ల నొప్పుల్లాంటివి తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

చలికాలంలో సాధారణంగా చాలా మంది జలుబు, దగ్గు, గొంతు నొప్పి లాంటి సమస్యలతో తరచుగా ఇబ్బందులు పడుతుంటారు. అలాగే కొంత మందికి ఆస్తమా సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి శ్వాస కోశ సమస్యలు ఉన్న వారు ఈ ఆకులు, పూలతో టీని చేసుకుని తేనె కలుపుకుని పరగడుపున రోజూ తాగడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫాన్ని ఇది పలుచన చేసి బయటకు తోసి వేస్తుంది. అందువల్ల ఈ ఇబ్బందులన్నీ తగ్గుముఖం పడతాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

అల్లు అర్జున్‌పై సెటైరికల్ కామెంట్ ఇది.. విశ్వక్ క్లారిటీ.!
అల్లు అర్జున్‌పై సెటైరికల్ కామెంట్ ఇది.. విశ్వక్ క్లారిటీ.!
అంతరించిపోతున్న ఇండియన్‌ వైల్డ్‌ డాగ్స్..కెమెరాకు చిక్కినదృశ్యాలు
అంతరించిపోతున్న ఇండియన్‌ వైల్డ్‌ డాగ్స్..కెమెరాకు చిక్కినదృశ్యాలు
కన్నడ బిగ్ బాస్‌లోనూ.. ఓవర్‌ యాక్షన్.! ఇక మారవా శోభ షెట్టి.!
కన్నడ బిగ్ బాస్‌లోనూ.. ఓవర్‌ యాక్షన్.! ఇక మారవా శోభ షెట్టి.!
అది.. అదుంటే.. నిందించిన వారికి సమాధానం చెప్పొచ్చు.! సమంత పోస్ట్!
అది.. అదుంటే.. నిందించిన వారికి సమాధానం చెప్పొచ్చు.! సమంత పోస్ట్!
అందవిహీనంగా మారే రోగంతో బాధపడుతున్న హీరోయిన్.! వీడియో..
అందవిహీనంగా మారే రోగంతో బాధపడుతున్న హీరోయిన్.! వీడియో..
వైల్డ్ ఫైర్‌ పుష్ప రాజ్ కి బెస్ట్ విషెస్.. నంద్యాల వైసీపీ Ex-MLA
వైల్డ్ ఫైర్‌ పుష్ప రాజ్ కి బెస్ట్ విషెస్.. నంద్యాల వైసీపీ Ex-MLA
శంకర్‌తో గొడవకు పోయి.. హిట్టు సినిమా వదులుకున్న షారుఖ్.!
శంకర్‌తో గొడవకు పోయి.. హిట్టు సినిమా వదులుకున్న షారుఖ్.!
అక్కడి పురాతన గుడిలో సినిమా మొదలు.? రామ్ చరణ్ సెంటిమెంట్ ఆ.!
అక్కడి పురాతన గుడిలో సినిమా మొదలు.? రామ్ చరణ్ సెంటిమెంట్ ఆ.!
54 ఏళ్ల వయసులో.. హాట్ నటితో ఘాటు ప్రేమాయణం.! నెక్స్ట్ పెళ్లా.?
54 ఏళ్ల వయసులో.. హాట్ నటితో ఘాటు ప్రేమాయణం.! నెక్స్ట్ పెళ్లా.?
వివాదంలో రామ్‌ చరణ్ అయ్యప్ప ఐక్యవేదిక సీరియస్| రికార్డుల వేటమొదలు
వివాదంలో రామ్‌ చరణ్ అయ్యప్ప ఐక్యవేదిక సీరియస్| రికార్డుల వేటమొదలు