Isha Ambani: నెట్టింట వైరల్‌గా మారిన ఈషా అంబానీ సౌందర్య రహస్యం..! తెలిస్తే..
ఇషా అంబానీ.. మిలియనీర్ అయినప్పటికీ, ఆమె తన చర్మ సంరక్షణ కోసం హోం రెమిడీస్‌నే ఫాలో అవుతారట. తాను ఎలాంటి మాయిశ్చరైజర్ లేదా ఫేస్ వాష్ ఉపయోగించనని ఇషా అంబానీ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
ఇషా అంబానీ..ఇటీవల తన సోదరుడి పెళ్లిలో స్పెషల్ అట్రాక్షన్ నిలిచారు. చంద్రబింబంలాంటి మెరిసిపోతున్న ముఖంతో అందరి దృష్టిని ఆకర్షించారు. దాంతో ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం ఆమె అందంపైనే చర్చించుకుంటున్నారు. అంత అందమైన చర్మం కోసం వారు ఏం చేస్తారనే దానిపై ఇంటర్‌నెట్‌లో చాలా మంది సర్చ్ చేస్తున్నారు. ఇషా అంబానీ తన అందం కోసం మేకప్, ఎలాంటి బ్యూటీ ప్రొడక్ట్స్ వినియోగిస్తారోనని చాలా మంది అనుకుంటున్నారు. కానీ, కొంతమంది అమ్మాయిల మాదిరిగా ఇషా మేకప్ వేసుకోదట. లక్షలు ఖర్చు చేసే బ్యూటీప్రొడక్ట్స్ కూడా వినియోగించరట.. చర్మ సంరక్షణ కోసం తను ఇంటి చిట్కాలను పాటిస్తారట..! ఇంతకీ ఇషా అందాల రహస్యం ఏంటో రండి చూద్దాం..
ఇషా అంబానీ ముఖేష్ అంబానీ, నీతా అంబానీల ముద్దుల కూతురు. కుటుంబ వ్యవహారాలను కూడా ఇషా చూసుకుంటుంది. ఆమె అందం, వ్యాపార చతురత ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇషా అంబానీ తన చర్మ సంరక్షణ కోసం ఖరీదైన ఉత్పత్తులను ఉపయోగిస్తుందని చాలా మంది నమ్ముతారు. అయితే మిలియనీర్ అయినప్పటికీ, ఆమె తన చర్మ సంరక్షణ కోసం హోం రెమిడీస్‌నే ఫాలో అవుతారట. తాను ఎలాంటి మాయిశ్చరైజర్ లేదా ఫేస్ వాష్ ఉపయోగించనని ఇషా అంబానీ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
ఇషా.. తన చర్మం మెరిసిపోయేలా ఉండేందుకు సహజసిద్ధమైన ఉత్పత్తులను మాత్రమే నమ్ముతానని, వాటినే ఉపయోగిస్తానని చెప్పారు. అంతే కాకుండా చర్మసౌందర్యం కోసం ప్రత్యేక ఉత్పత్తులను ఉపయోగించనని ఇషా అంబానీ తెలిపింది. ప్రత్యేక ఈవెంట్ సమయాల్లో ఇషా.. స్మోకీ లుక్‌లో కనిపించేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంది. దాని కోసం కొద్దిగా మేకప్ వేసుకుంటారట.. ఈ రకమైన మేకప్ ఆమె అందాన్ని పెంచుతుంది. ఆమె మేకప్‌లో హైలైటర్‌ను ఇష్టపడుతుంది. ఇది బుగ్గలకు మెరుపునిస్తుంది.
ఇషా అంబానీ తన ముఖ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి హోం రెమెడీస్, హెర్బ్స్‌ని ఉపయోగిస్తానని చెప్పారు. ఈ ఫేస్ ప్యాక్‌ని అప్లై చేయడం వల్ల తన ముఖం కాంతివంతంగా మారుతుంది. ఇది చర్మాన్ని డిటాక్సిఫై చేస్తుందని చెప్పారు. అయితే, సాధారణంగా అందరూ శెనగపిండి ఫేస్ ప్యాక్ వాడుతుంటారు. కానీ ఇషా అంబానీ గోధుమ పిండితో ఫేస్ ప్యాక్ తయారు చేసి వాడుతుంటారు. గోధుమ పిండిలో కలబంద, తేనె, నిమ్మ, పసుపు కలిపి ముఖానికి అప్లై చేస్తుంటారు.
అలాగే, ఇషా అంబానీ ఆరోగ్యకరమైన చర్మం రహస్యంలో భాగంగా తాను ఎక్కువగా బీట్‌రూట్ జ్యూస్ తీసుకుంటానని చెప్పారు. అలాగే, చర్మం తేమగా ఉండేందుకు గానూ తగినంత నీరు తాగుతానని చెప్పారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి