AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TOP 9 ET: వివాదంలో రామ్‌ చరణ్ అయ్యప్ప ఐక్యవేదిక సీరియస్ | రికార్డుల వేట మొదలెట్టిన పుష్పరాజ్‌.

TOP 9 ET: వివాదంలో రామ్‌ చరణ్ అయ్యప్ప ఐక్యవేదిక సీరియస్ | రికార్డుల వేట మొదలెట్టిన పుష్పరాజ్‌.

Anil kumar poka
|

Updated on: Nov 22, 2024 | 8:58 AM

Share

ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉండే మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్ ఇప్పుడో వివాదంలో చిక్కుకున్నారు. రీసెంట్గా కడపలోని అజ్మీర్ దర్గాను సందర్శించిన చరణ్.. అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అయితే అయ్యప్ప మాల ధారణలోనే ఇదంతా చేయడం.. ఇప్పుడు తెలంగాణ అయ్యప్ప ఐక్యవేదికకు కోపం తెప్పించింది. తమ మనోబావాలు దెబ్బతిన్నాయని అది ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో చరణ్ 5 రోజుల్లోనే అయ్యప్ప స్వాములకు బహిరంగ క్షమాపణ చెప్పాలని.. లేకపోతే ఆందోళనకు దిగుతామని హెచ్చరించింది.

02.ram charan: వివాదంలో రామ్‌ చరణ్ అయ్యప్ప ఐక్యవేదిక సీరియస్. ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉండే మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్ ఇప్పుడో వివాదంలో చిక్కుకున్నారు. రీసెంట్గా కడపలోని అజ్మీర్ దర్గాను సందర్శించిన చరణ్.. అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అయితే అయ్యప్ప మాల ధారణలోనే ఇదంతా చేయడం.. ఇప్పుడు తెలంగాణ అయ్యప్ప ఐక్యవేదికకు కోపం తెప్పించింది. తమ మనోబావాలు దెబ్బతిన్నాయని అది ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో చరణ్ 5 రోజుల్లోనే అయ్యప్ప స్వాములకు బహిరంగ క్షమాపణ చెప్పాలని.. లేకపోతే ఆందోళనకు దిగుతామని హెచ్చరించింది. 03.Vishwak: అల్లు అర్జున్‌ను ఉద్దేశించే విశ్వక్ అలా విమర్శలు చేశాడా?.. క్లారిటీ. సినిమా.. విడుదలకు సిద్ధమవుతోందంటే చాలు కొందరు హీరోలు చేస్తున్న కామెంట్స్ కాంట్రవర్సీ అవుతున్నాయి. తాజాగా మెకానిక్ రాకీ సినిమా విషయంలో విశ్వక్ సేన్ చేసిన కామెంట్స్ కూడా అలాగే వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా ఆడకపోతే నేను జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర షర్టు విప్పి తిరుగుతా.. ఫిల్మ్ నగర్‌లో చొక్కా విప్పేస్తా లాంటి మాటలు మాట్లాడనంటూ ప్రీ రిలీజ్ వేడుకలో అన్నారు విశ్వక్. ఈయన చేసిన కామెంట్స్ అల్లు అర్జున్‌ను ఉద్దేశించి అంటూ కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి. ఎందుకంటే పుష్ప సినిమా విడుదల సమయంలో.. సుకుమార్ డైరెక్షన్ గురించి చెప్తూ.. పుష్ప రిలీజ్ అయ్యాక దర్శకులంతా సుకుమార్ దగ్గరికి వచ్చి క్లాస్ నేర్చుకుంటారు.. అలా జరక్కపోతే మైత్రి ఆఫీసులో షర్టు విప్పి తిరుగుతా...