Shah Rukh Khan: శంకర్‌తో గొడవకు పోయి.. హిట్టు సినిమా వదులుకున్న షారుఖ్.!
విభేదాలు.. గొడవలు.. మనస్పర్థలు.. పేరు ఏదైనా.. ఈ ఇద్దరు స్టార్స్ మధ్య పుట్టి.. ఓ క్రేజీ సినిమాను ఆగేలా చేశాయి. ఎవర్ గ్రీన్ గా నిలిచే సినిమాను అడ్డకున్నాయి. ఆ సినిమా మరేదో కాదు.. రోబో! ఎస్! శంకర్ డైరెక్షన్లో రజినీ కాంత్ చేసిన ఈసినిమా.. మొదట రజీని కాంత్ కాకుండా మరో స్టార్ హీరో చేయాల్సింది! అప్పట్లో ఈసినిమా వేరే లెవల్లో తెరకెక్కాల్సింది.
తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈరోజుకి 15 ఏళ్ల ముందే వీఎఫ్ ఎక్స్‌తో మ్యాజిక్ చేశారు. 2010లో విడుదలైన రోబో సినిమానుఅత్యుత్తమ హై క్వాలిటీ VFX తో తెరకెక్కించారు. అప్పట్లో సినిమా రంగంలో అందుబాటులో ఉన్న కొత్త టెక్నాలజీని వాడుకున్నారు. ఆ సినిమా కోసం 100 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టారు. సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయింది. అయితే నిజానికి ఆ సినిమాలో నటించాల్సింది రజనీకాంత్ కాదు బాలీవుడ్ బాద్ షా కింగ్ ఖాన్ షారుక్ ఖాన్.
మొదట.. షారుక్ ఖాన్‌కి కూడా రోబో కథ నచ్చడంతో ఈ సినిమాకు ఓకే చెప్పారట. ఆ సినిమాను తానే నిర్మిస్తానని ముందుకొచ్చారట. అందుకు తగ్గట్టే అప్పట్లో షారుఖ్ ఆఫీస్లో.. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కూడా మొదలైంది. సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక చోప్రా డేట్స్ కూడా తీసుకున్నారు. అయితే ఆ తర్వాత షారుక్ ఖాన్ సడెన్ గా ఈ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అందుకు కారణం శంకర్‌కు తనకు మధ్య వచ్చిన అభిప్రాయబేధాలే అని ఓ ఇంటర్వ్యూలో షారుఖ్ చెప్పారు కూడా..! అయితే ఆ మాటలు మరో సారి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరో సారి ఈ టాపిక్ గురించి అందరూ మాట్లాడుకునేలా చేస్తున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

