చెన్నంగి ఆకులతో చెప్పలేనన్నీ లాభాలు.. ఇలా వాడారంటే ఆ సమస్యలన్నీ పరార్..
మన చుట్టూ ఉండే ప్రకృతిలో లభించే ఔషధ గుణాలు కలిగిన ఆకు కూరలు ఉన్నాయి. వాటిలో కసివింద చెట్టు కూడ ఒకటి. దీనిలో చిన్న కసివింద, పెద్ద కసివింద అని రెండు రకాల చెట్లు ఉంటాయి. దీనిని చిన్న చెన్నంగి, పెద్ద చెన్నంగి అని కూడా పిలుస్తారు. చిన్న చెన్నంగిని ఉపయోగించి కడుపులో ఉండే వ్యర్థాలను బయటకు పంపించవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ చెట్టు ప్రతిభాగం ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉండి మనకు వచ్చే అనేక రకాల వ్యాధులను నయం చేయడంలో ఉపయోగపడుతుంది. చిన్న చెన్నంగిని ఉపయోగించి కడుపులో ఉండే వ్యర్థాలను బయటకు పంపించవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

కసివింద చెట్టు రసం చేదుగా ఉండి వేడిని కలిగిస్తుంది. దీనిలోని గుణాలు వాతాన్ని, విషాన్ని హరించే శక్తి ఈ కసివింద చెట్టుకు ఉంది. గాయాలను, వ్రణాలను, చర్మ రోగాలను నయం చేయడంలో ఈ మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది. కసివింద చెట్టు ఆకులను వెన్నతో నూరి చచ్చుబడిన పక్షవాత భాగాలపైన ప్రతిరోజూ మర్దనా చేయడం వల్ల అవి పూర్వ స్థితికి చేరుకుంటాయి. కసివింద ఆకులను, వేరు బెరడును ఎండబెట్టి పొడిలా చేసుకుని నిల్వ చేసుకోవాలి. ఈ పొడికి తేనెను కలిపి లేపనంగా రాసుకోవడం వల్ల అనేక రకాల చర్మ వ్యాధులు, గాయాలు, వ్రణాలు తగ్గుతాయి.
కసివింద గింజలను దోరగా వేయించి పొడిలా చేసుకోవాలి. ఈ పొడిని కషాయంలా చేసుకుని అందులో తగినన్ని పాలు, కండచక్కెర కలిపి కాఫీ లా తాగుతూ ఉంటే సమస్త మూత్ర రోగాలు తగ్గుతాయి. రక్తం కూడా శుద్ధి అవుతుంది. కసివింద గింజల పొడిని అర టీ స్పూన్ లేదా ఒక టీ స్పూన్ పరిమాణంలో తీసుకుని దానికి ఒక టీ స్పూన్ తేనెను కలిపి రెండు పూటలా భోజనానికి గంట ముందు తీసుకుంటూ ఉండడం వల్ల అతిమూత్ర వ్యాధి తగ్గుతుంది.
కసివింద వేర్ల బెరడును పొడిగా చేసి జల్లించి నిల్వ చేసుకోవాలి. తీవ్రతను బట్టి 2 గ్రా. నుండి 5 గ్రా. మోతాదులో ఈ పొడిని తీసుకుని 2 టీ స్పూన్ల ఆవు పాలతో కలిపి రెండు పూటలా భోజనానికి గంట ముందు తీసుకుంటూ ఉండడం వల్ల బోద వాపులు తగ్గుతాయి. ఈ చిట్కాను పాటించేటప్పుడు విరేచనాలు అయ్యే అవకాశం ఉంటుంది . కనుక మొదటిగా కొద్ది మోతాదులో తీసుకుని తరువాత మోతాదును పెంచాలి. ఉబ్బు రోగాన్ని తగ్గించడంలో కూడా కసివింద చెట్టు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పొడిని 2 నుండి 3 గ్రాముల మోతాదులో తీసుకుని దానికి ఒక టీ స్పూన్ తేనెను కలిపి రెండు పూటలా భోజనానికి గంట ముందు తీసుకుంటూ ఉండడం వల్ల శరీరంలో ఉండే చెడు నీరు అంతా పోయి ఉబ్బు రోగం తగ్గుతుంది.
గాయాల నుండి ఆగకుండా రక్తం కారుతూ ఉంటే, ఈ చెట్టు ఆకులను దంచి కట్టుగా కట్టడం వల్ల గాయాల నుండి రక్తం కారడం తగ్గుతుంది. ఈ మొక్క పువ్వులను దంచి వస్త్రంలో వేసి రసాన్ని తీయాలి. ఈ రసాన్ని ఒకటి లేదా రెండు చుక్కల పరిమాణంలో కంటిలో వేసుకుంటూ ఉంటే ఏడు రోజులల్లో రేచీకటి తగ్గుతుంది.
పచ్చి కసివింద ఆకులు 20 గ్రా. చొప్పున తీసుకుని వాటిని 12 మిరియాలతో కలిపి మెత్తగా నూరి రసాన్ని తీయాలి. ఈ రసానికి కొద్దిగా నీటిని కలిపి పాము కరిచిన వారికి తాగించాలి. అలాగే ఈ మొక్క ఆకులను నూరి పాము కరిచిన చోట ఉంచి కట్టుగా కట్టాలి. ఇలా చేయడం వల్ల పాము విషం హరించుకుపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా కసివింద చెట్టుతో మనం బోలెడు ప్రయోజనాలను పొందవచ్చు. కనుక ఈ మొక్క ఎక్కడ కనిపించినా వదలకుండా ఇంటికి తెచ్చుకోండి.
మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








