AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉదయాన్నే టీ, కాఫీలు వద్దు..చియాసీడ్‌ వాటర్‌తో మీ రోజును ప్రారంభించండి..ఈ సమస్యలన్నీ దూరం!

చియా సీడ్స్ వాటర్ బరువు తగ్గడంలో సహాయపడుతుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అధిక ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యం, ఎముకల బలానికి తోడ్పడతాయి. కొలెస్ట్రాల్ తగ్గించి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. మెదడు పనితీరును పెంచి, కొన్ని రకాల క్యాన్సర్‌లను నిరోధించడంలో చియా సీడ్స్ అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తాయి.

ఉదయాన్నే టీ, కాఫీలు వద్దు..చియాసీడ్‌ వాటర్‌తో మీ రోజును ప్రారంభించండి..ఈ సమస్యలన్నీ దూరం!
Chia Seeds Water
Jyothi Gadda
|

Updated on: Dec 07, 2025 | 1:44 PM

Share

శీతాకాలంలో మన శరీరాలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, మనం వివిధ రకాల ఆహారాలను తీసుకుంటాం.. ఆరోగ్యకరమైన ఆహారాలతో ఉదయం ప్రారంభించడం వల్ల రోజు మాత్రమే కాకుండా మన ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని చెబుతారు. అయితే, చాలా మంది తమ రోజును టీ, కాఫీతో ప్రారంభించడానికి ఇష్టపడతారు. ఇవి వారి ఆరోగ్యానికి హానికరం. మీరు మీ రోజును ప్రారంభించడానికి ఆరోగ్యకరమైన పానీయం కోసం చూస్తున్నట్లయితే, మీరు చియా గింజల నీటిని తీసుకోవడం మంచిది. ఇవి ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. వాటిలో ఫైబర్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్, యాంటీఆక్సిడెంట్లు, కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం వంటి లక్షణాలు ఉన్నాయి. ఇవి శరీరాన్ని అనేక ఆరోగ్య సమస్యల నుండి రక్షించడంలో సహాయపడతాయి. కాబట్టి ప్రతి రోజూ చియాసీడ్స్‌ నానబెట్టిన నీటిని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ చూద్దాం..

బరువు తగ్గాలని చూసేవారు ప్రతిరోజూ చియా సీడ్స్‌ వాటర్ తాగడం చాలా మంచిది. వీటిలోని ఫైబర్ కడుపు నిండిన ఫీలింగ్ కలిగించి ఆకలి తగ్గిస్తుంది. దీంతో బరువు తగ్గవచ్చు. చియా సీడ్స్‌లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ చియా సీడ్స్‌ నానబెట్టిన నీళ్లు తాగడం వల్ల పేగులు శుభ్రంగా మారతాయి. మలబద్ధకం, గ్యాస్ వంటి జీర్ణ సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు. చియా సీడ్స్‌లోని ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు బాడీలో ఇంఫ్లమేషన్ తగ్గిస్తాయి. అలాగే రక్తపోటు అదుపులో ఉంచి గుండెపై ఒత్తిడి పెరగకుండా కాపాడుతాయి. తద్వారా గుండె బలంగా ఉంటుంది.

చియా సీడ్స్‌లో కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియంతో పాటు ప్రోటీన్ కూడా ఉంటుంది. ఇవి ఎముకల సాంద్రత పెంచి బలంగా ఉంచుతాయి. దీంతో ఆస్టియోపోరోసిస్ వంటి ఎముక సంబంధ సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు. చియా సీడ్స్‌లో ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందులో అమైనో యాసిడ్స్ కూడా ఉంటాయి. ఇవి కండరాల బలాన్ని పెంచుతాయి. తద్వారా కండరాల బలహీనత నుంచి కాపాడుకోవచ్చు. చియా సీడ్స్‌లో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. ఇది మెదడు పనితీరును చురుకుగా ఉంచుతుంది. ఒత్తిడిని నివారిస్తుంది. తద్వారా జ్ఞాపకశక్తి కూడా బాగుంటుంది.

ఇవి కూడా చదవండి

చియా సీడ్స్‌లోని ఫైబర్, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ బాడీలోని చెడు కొలెస్ట్రాల్ కరిగించడంలో సహాయపడుతాయి. అలాగే హెల్తీ ఫ్యాట్ పెంచుతాయి. అందుకే చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు ఈ చియా సీడ్స్‌ వాటర్ తాగడం మేలు. చియా సీడ్స్‌లోని ఫైబర్ వల్ల రక్తంలో గ్లూకోజ్ నెమ్మదిగా రిలీజ్ అవుతుంది. దీంతో షుగర్ పెరగదు. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. షుగర్ పెరగకుండా ఉండాలంటే ఈ చియా సీడ్స్‌ వాటర్ తాగడం ఉత్తమం. చియా సీడ్స్‌లో యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి శరీరంలో క్యాన్సర్ కణాలు పెరగకుండా అడ్డుకుంటాయి. అందుకే చియా సీడ్స్‌ వాటర్ తాగితే కొన్ని రకాల క్యాన్సర్‌లు రాకుండా కాపాడుకోవచ్చు.

మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us