Car Driving Tips: పొగ మంచులో కారు నడపడం ఇబ్బందిగా మారిందా? ఈ టిప్స్‌ పాటిస్తే ఈజీ డ్రైవింగ్‌ సాధ్యం

| Edited By: Shaik Madar Saheb

Dec 22, 2023 | 8:32 PM

ముఖ్యంగా పొగమంచు వల్ల దృశ్యమానత విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రోడ్డుపై ఒకేసారి జంతువులు లాంటివి వచ్చినప్పుడు పొగమంచులో కారును కంట్రోల్‌ చేయడం సాధ్యం కాదు. అలాగే రోడ్లపై గుంతలు, టర్నింగ్‌ పాయింట్లు తెలియక తికమక పడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో శీతాకాలంలో కార్లను తోలే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో? ఓసారి తెలుసుకుందాం.

Car Driving Tips: పొగ మంచులో కారు నడపడం ఇబ్బందిగా మారిందా? ఈ టిప్స్‌ పాటిస్తే ఈజీ డ్రైవింగ్‌ సాధ్యం
Car Driving
Follow us on

భారతదేశంలో శీతాకాలం సీజన్‌ ప్రారంభమైంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే కార్తీకమాసం పూర్తయ్యాక పొగ మంచు ఎఫెక్ట్‌ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఈ సమయంలో రాత్రి వేళ్లల్లో, తెల్లవారుజామున కార్లు డ్రైవింగ్‌ చేసే వారు ఇబ్బందిపడుతున్నారు. కానీ అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో తప్పనిసరై ఆ సమయంలో బయటకు వెళ్లే వారు ఇబ్బందిపడుతున్నారు. ముఖ్యంగా పొగమంచు వల్ల దృశ్యమానత విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రోడ్డుపై ఒకేసారి జంతువులు లాంటివి వచ్చినప్పుడు పొగమంచులో కారును కంట్రోల్‌ చేయడం సాధ్యం కాదు. అలాగే రోడ్లపై గుంతలు, టర్నింగ్‌ పాయింట్లు తెలియక తికమక పడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో శీతాకాలంలో కార్లను తోలే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో? ఓసారి తెలుసుకుందాం.

లైటింగ్‌

దట్టమైన పొగమంచులో దృశ్యమానత సమస్య ఉంటుంది కాబట్టి మీ వాహనానికి సంబంధించిన అన్ని లైట్లు వర్కింగ్‌ కండిషన్‌లో ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా హెడ్‌ లైట్లు, టెయిల్‌ లైట్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పొగమంచులో వెళ్తున్నప్పుడు కచ్చితంగా తక్కువ బీమ్‌ లైట్లను ఉపయోగించాలి. ఎందుకంటే హై బీమ్‌ రిఫ్లెక్షన్‌ సృష్టించి, డ్రైవింగ్‌ను మరింత కష్టతరం చేస్తుంది. అలాగే మీ కారుకు ఫాగ్‌ లైట్లు ఉంటే మీ ఎదురుగా వచ్చే వాహనాల దృశ్యమానతను పెంచడానికి కచ్చితంగా వాటిని ఆన్‌చేసి ఉంచాలి.

వాహనాల మధ్య దూరం

పొగ మంచు సమయంలో డ్రైవింగ్‌ చేస్తున్నప్పుడు ప్రమాదాల నివారణకు కచ్చితంగా ఎదురుగా ఉన్న వాహనానికి మన వాహనానికి మధ్య నిర్ధిష్ట దూరం ఉండేలా చూసుకోవాలి. అలాగే మన వాహనం వెనుక వచ్చే వాహన స్పీడ్‌ను అంచనా వేసుకుని దూరాన్ని మెయిన్‌టెయిన్‌ చేయాలి.

ఇవి కూడా చదవండి

వేగం

మన భారతీయ రహదారులపై ప్రయాణిస్తున్నప్పుడు ప్రమాదాలకు అతి వేగం ప్రధాన కారణంగా ఉంటుంది. దీన్ని బట్టి పొగ మంచులో కూడా నియంత్రిత వేగంలో మాత్రమే వెళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా అత్యవసర సమయాల్లో కారును నియంత్రించడం చాలా సులువుగా ఉంటుంది.

రహదారి గుర్తులు

పొగ మంచు పరిస్థితుల్లో రహదారి గుర్తులు ముఖ్యమైన నావిగేషనల్‌ సాధనాలుగా మారతాయి. ఈ గుర్తులను విజువల్‌ గైడ్‌లుగా ఉపయోగించడం ద్వారా మీరు మీ లేన్‌లోనే ఉండాలి. ఈ సరళమైన సాంకేతిక అమరికను నిర్వహించడంలో సహాయపడుతుంది. రాబోయే ట్రాఫిక్‌కు దారితీసే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

హజార్డ్‌ లైట్లు

పొగ మంచుతో కూడిన పరిస్థితుల్లో డ్రైవింగ్‌ చేస్తున్నప్పుడు భారతదేశంలోని రోడ్లపై మెజార్టీ ప్రజలు తరచూగా హజార్డ్‌ లైట్లను దుర్వినియోగం చేస్తారు. కాబట్టి మీ వాహనం నిశ్చల వేగంతో ఉన్నప్పుడు మాత్రమే వాహనంలో హజార్డ్‌ లైట్లను ఆన్‌ చేయాలి. 

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం