జుట్టు తెల్లబడిందని చింతిస్తున్నారా..? డోంట్ వర్రీ… బంగాళా దుంప తొక్కలతో ఇలా చెయ్యండి.. కేశ సౌందర్యం మీ సొంతం..!

|

Apr 15, 2024 | 1:02 PM

జుట్టు సమస్యలకు బంగాళదుంప బాగా ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు. నీరు పూర్తిగా చిక్కబడే వరకు బాగా మరిగించాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని చిక్కటి పేస్ట్‌లా తయారు చేసుకుని దీన్ని మీ జుట్టుకు పట్టించి సుమారు 30 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తరువాత షాంపూతో తలస్నానం చేయాలి. మరోక పద్దతిలో ఒక కప్పు బంగాళదుంప తొక్కలను ఉడికించిన తర్వాత ఆ గుజ్జులో

జుట్టు తెల్లబడిందని చింతిస్తున్నారా..? డోంట్ వర్రీ... బంగాళా దుంప తొక్కలతో ఇలా చెయ్యండి.. కేశ సౌందర్యం మీ సొంతం..!
Potato Peel
Follow us on

ప్రస్తుత కాలంలో చాలా మంది జుట్టు సమస్యలతో సతమతమవుతున్నారు. చిన్న వయసులోనే జుట్టు నెరిసిపోవటం, రాలిపోవడం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కేశ సంరక్షణ కోసం పార్లర్ల చుట్టూ పరిగెడుతూ వేలకు వేలు ఖర్చు పెడుతున్నారు. వాటితో సమస్య పరిష్కారం కాకపోగా, మరిన్ని సైడ్‌ఎఫెక్ట్స్‌ వెంటపడుతున్నాయి. ఈ క్రమంలోనే ఇంటి నివారణలు జుట్టు సమస్యలకు చక్కటి పరిష్కారం అవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. జుట్టు సమస్యలకు బంగాళదుంప బాగా ఉపయోగపడుతుందని అంటున్నారు. జుట్టు సంరక్షణ, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు ఆలు తొక్కలు అద్భుతంగా సహాయపడుతుంది. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..

నేటి జీవనశైలి, ఆహారపు అలవాట్లు, వాతావరణంలో కాలుష్యం కారణంగా జుట్టు త్వరగా తెల్లగా మారుతుంది. అయితే, నెరిసిన జుట్టును వదిలించుకోవడానికి ఆలు రెమిడీ అద్భుతంగా పనిచేస్తుంది. జుట్టు సమస్యలకు ఉత్తమమైన ఇంటి నివారణలలో బంగాళదుంపల తొక్కతో ఇంట్లోనే మీ జుట్టును నల్లగా తయారు చేసుకోవచ్చు. ఎందుకంటే బంగాళదుంపలో ఉండే స్టార్చ్ జుట్టును నల్లగా మార్చడంలో సహాయపడుతుంది. ఆలూ తొక్క నుండి తీసిన రసం జుట్టుకు పట్టిస్తే చక్కటి ఫలితం ఉంటుందని చెబుతారు ఆరోగ్య నిపుణులు. ఇది జుట్టు వేగంగా పెరగడానికి సహాయపడుతుంది. బంగాళాదుంప తొక్కల నుండి వచ్చే నీటిలో ఇనుము, జింక్, రాగి, కాల్షియం, పొటాషియం, నియాసిన్, మెగ్నీషియం వంటి పోషకాలు లభిస్తాయి. ఇవన్నీంటి ఫలితంగా నెరిసిన జుట్టుకే కాదు జుట్టు రాలడాన్ని కూడా తగ్గిస్తుంది.

అకాలంగా నెరిసిన జుట్టును నల్లగా మార్చేందుకు గానూ…ఆలూ తొక్కలను ఒక కప్పు వరకు తీసుకోవాలి. అందులో మరో కప్పు నీళ్లు పోసి ఉడికించాలి. నీరు పూర్తిగా చిక్కబడే వరకు బాగా మరిగించాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని చిక్కటి పేస్ట్‌లా తయారు చేసుకుని దీన్ని మీ జుట్టుకు పట్టించి సుమారు 30 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తరువాత షాంపూతో తలస్నానం చేయాలి. మరోక పద్దతిలో ఒక కప్పు బంగాళదుంప తొక్కలను ఉడికించిన తర్వాత ఆ గుజ్జులో కాఫీ పౌడర్‌, కలబంద, రోజ్ వాటర్ యాడ్‌ చేసుకోవాలి. దీంతో చక్కటి హెయిర్ ప్యాక్ తయారవుతుంది..దాన్ని మీ జుట్టుకు బాగా పట్టించాలి. సుమారు అరగంట తర్వాత శుభ్రమైన నీటితో హెయిర్‌ వాష్‌ చేసుకోవాలి.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..