Hair Care: సిల్కీ జుట్టు కావాలా…అయితే షాంపూలు కాదు..ఈ వంటింటి చిట్కా మీ కోసం..

మహిళల అందం జుట్టుతో ముడిపడి ఉంటుంది. ఒత్తైన, పొడవాటి జుట్టు ఉండాలని ప్రతి మహిళా కోరుకుంటుంది. పొడవాటి జుట్టుతో మహిళల అందం మరింత పెరగుతుంది.

Hair Care: సిల్కీ జుట్టు కావాలా...అయితే షాంపూలు కాదు..ఈ వంటింటి చిట్కా మీ కోసం..
Silky Hair

Edited By: Ravi Kiran

Updated on: May 23, 2023 | 7:45 AM

మహిళల అందం జుట్టుతో ముడిపడి ఉంటుంది. ఒత్తైన, పొడవాటి జుట్టు ఉండాలని ప్రతి మహిళా కోరుకుంటుంది. పొడవాటి జుట్టుతో మహిళల అందం మరింత పెరగుతుంది. కానీ, మారుతున్న ఈ సీజన్‌తో పాటు పెరుగుతున్న కాలుష్యం ప్రజల శరీరం, జుట్టును నేరుగా ప్రభావితం చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తరచూ జుట్టు రాలడం, జుట్టు త్వరగా నెరసిపోవడం, తలలో చుండ్రు పేరుకుపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. జుట్టు సంరక్షణ కోసం అనేక రకాల హెయిర్ ట్రీట్మెంట్లు తీసుకుంటారు. తద్వారా జుట్టు సిల్కీగా, షైనీగా మారుతుంది. అయితే మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్టులను వాడటం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. కొన్నిసార్లు జుట్టుకు హాని కూడా కలిగే ప్రమాదం ఉంటుంది.

అటువంటి పరిస్థితిలో, ఈ రోజు మనం వంటగదిలో ఉన్న వాటి గురించి తెలుసుకుందాం. వీటిని ఉపయోగించి మీ జుట్టు సిల్కీగా, మెరుస్తూ అలాగే మందంగా మారేలా చేసుకోవచ్చు. నిమ్మకాయతో మీ జుట్టులో చాలా మార్పులను చూడవచ్చు. నిమ్మకాయ వల్ల జుట్టుకు కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

నిమ్మకాయను ఇలా ఉపయోగించండి:

ఇవి కూడా చదవండి

మీ జుట్టు నిగనిగలాడేలా నిమ్మకాయను ఉపయోగించాలనుకుంటే ముందుగా మగ్ లో నిమ్మరసం తీసుకోవాలి. రసం తీసిన తర్వాత, దానికి కొద్దిగా నీరు కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ నుంచి జుట్టు చివర్ల వరకు అప్లై చేయాలి. స్కాల్ప్ ను సున్నితంగా మసాజ్ చేయండి. ఇలా పది నిమిషాల పాటు ఉంచిన తర్వాత నీళ్లతో కడిగేయాలి. ఇది సహజసిద్ధమైన కండీషనర్ గా పనిచేస్తుంది. దీంతో మీ జుట్టు మెరిసేలా, సిల్కీగా మారుతుంది.

జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది:

నిమ్మరసం మీ జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. ఇందులో ఉండే మూలకాలు రూట్ నుండి జుట్టును బలపరుస్తాయి. దీని వల్ల జుట్టు పెరుగుదల పెరుగుతుంది.

జుట్టు నిగనిగలాడేలా చేస్తుంది:

నిమ్మరసం మీ జుట్టును మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది. మీకు కావాలంటే క్రమం తప్పకుండా ఉపయోగించండి. దీన్ని ఉపయోగించడం వల్ల జుట్టు నిగనిగలాడుతుంది.

చుండ్రును తొలగిస్తుంది:

తలలో పేరుకుపోయిన చుండ్రును అంతం చేస్తుంది. ఇందుకోసం నిమ్మరసంతో తలకు బాగా మర్దన చేస్తే సరిపోతుంది. కొన్ని రోజుల్లో, మీరు దాని ప్రభావాన్ని చూస్తారు. తలపై పేరుకుపోయిన చుండ్రుకు నిమ్మతో ఈవిధంగా చెక్ పెట్టవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..