Hair Comb: ఒకరి దువ్వెన మరొకరు ఉపయోగిస్తున్నారా? పరిశోధకులు చెప్పింది తెలిస్తే హడలే..

|

Jun 15, 2023 | 7:45 PM

ఇంట్లో ఉన్నా.. ఇంటి నుంచి బయటకు వెళ్తున్నా.. పార్టీకి వెళ్లినా.. ఫంక్షన్‌కు వెళ్లినా.. సాధారణ సమయంలోనైనా.. ప్రతి ఒక్కరు తప్పక తమ జుట్టును దువ్వుకుంటారు. చాలా వరకు ఇళ్లలో ఒకరి దువ్వెనను మరొకరు వినియోగిస్తుంటారు.

Hair Comb: ఒకరి దువ్వెన మరొకరు ఉపయోగిస్తున్నారా? పరిశోధకులు చెప్పింది తెలిస్తే హడలే..
Comb
Follow us on

ఇంట్లో ఉన్నా.. ఇంటి నుంచి బయటకు వెళ్తున్నా.. పార్టీకి వెళ్లినా.. ఫంక్షన్‌కు వెళ్లినా.. సాధారణ సమయంలోనైనా.. ప్రతి ఒక్కరు తప్పక తమ జుట్టును దువ్వుకుంటారు. చాలా వరకు ఇళ్లలో ఒకరి దువ్వెనను మరొకరు వినియోగిస్తుంటారు. ఇక బయటకు వెళ్లిన సందర్భాల్లోనూ.. ఒకరి దువ్వెనను మరొకరు అడుక్కుని వినియోగించుకుంటారు. మీరు కూడా ఇలా చేస్తున్నారా? పరిశోధకులు చెప్పిన షాకింగ్ నిజాలు తెలిస్తే ఇంకెప్పుడూ అలా చేయరు. మరి ఒకరు వినియోగించిన దువ్వెనను ఇంకొకరు వినియోగిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

ఒకరి దువ్వెనను ఒకరు ఉపయోగిస్తే ఏం జరుగుంది?

ఒకరు ఉపయోగించిన దువ్వెనను మరొకరు ఉపయోగించడం వల్ల ప్రధానంగా పేన్ల సమస్య పెరుగుతుంది. అదే హెయిర్ బ్రష్‌ని, దువ్వెనను ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు ఉపయోగిస్తే.. అది రింగ్ వార్మ్, ఫంగస్, గజ్జి, కొన్నిసార్లు స్టాఫ్ ఇన్‌ఫెక్షన్ వ్యాప్తి చెందుతుంది. రింగ్ వార్మ్ శిరోజాలను దెబ్బతీస్తుంది. రింగ్‌వార్మ్ సమస్య ఉన్న వారి దువ్వెనను ఉపయోగించొద్దు. ఇలా చేయడం వల్ల దద్దుర్లు వస్తాయి. బట్టతల బారిన పడే ప్రమాదం ఉంది. చర్మం పొడిబారి.. జుట్టు పగలడం, జుట్టు రాలడం జరుగుతుంది. ఒకవేళ ఇతరుల దువ్వెన ఉపగించాల్సి వస్తే.. ముందుగా దానిని శుభ్రం చేసుకోవాలి.

సరైన దువ్వెన రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది..

చిక్కుబడ్డ జుట్టును విడదీయడానికి, జుట్టును క్రమబద్ధంగా ఉంచేందుకు దువ్వడం చేస్తారు. సరిగ్గా దువ్వెన ఉపయోగిస్తే.. చాలా ప్రయోజనాలు ఉంటాయి. రోజుకు రెండు మూడు సార్లు దువ్వెనతో దువ్వుకోవాలి. జుట్టు మెరుస్తూ మృదువుగా మారుతుంది.

ఇవి కూడా చదవండి

జుట్టు సంరక్షణకు ముఖ్యమైన చిట్కాలు..

1. తడి జుట్టు దువ్వుకోవద్దు.

2. హెయిర్ సీరమ్ వాడకం ప్రయోజనకరంగా ఉంటుంది.

3. జుట్టును మధ్యలో వేరు చేసి దువ్వాలి.

4. జుట్టును బలంగా దువ్వొద్దు.

5. ఒకరు వినియోగించిన దువ్వెనను వినియోగించొద్దు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..