Hair Care Tips: జుట్టు విపరీతంగా రాలుతోందా? ఉల్లిపాయ రసాన్ని ఈ విధంగా అప్లై చేయండి..

|

May 22, 2023 | 9:54 AM

ప్రస్తుత కాలంలో జుట్టు రాలడం సర్వసాధారణమైపోయింది. జుట్టు రాలడాన్ని ఆపడానికి.. అన్ని రకాల ఇంటి నివారణల నుండి ఖరీదైన చికిత్సలను సైతం ట్రై చేస్తున్నారు. అయినప్పటికీ చాలా మంది ఇంటి నివారణలలో ఉల్లిపాయలనే ఎక్కువగా నమ్ముతున్నారు. ఉల్లిపాయ రసాన్ని అప్లై చేయడం వల్ల జుట్టు పెరగడంతో పాటు చుండ్రు తొలగిపోతుందని చాలా మంది విశ్వాసం.

Hair Care Tips: జుట్టు విపరీతంగా రాలుతోందా? ఉల్లిపాయ రసాన్ని ఈ విధంగా అప్లై చేయండి..
Tips for Long Hair
Follow us on

ప్రస్తుత కాలంలో జుట్టు రాలడం సర్వసాధారణమైపోయింది. జుట్టు రాలడాన్ని ఆపడానికి.. అన్ని రకాల ఇంటి నివారణల నుండి ఖరీదైన చికిత్సలను సైతం ట్రై చేస్తున్నారు. అయినప్పటికీ చాలా మంది ఇంటి నివారణలలో ఉల్లిపాయలనే ఎక్కువగా నమ్ముతున్నారు. ఉల్లిపాయ రసాన్ని అప్లై చేయడం వల్ల జుట్టు పెరగడంతో పాటు చుండ్రు తొలగిపోతుందని చాలా మంది విశ్వాసం. అయితే, కొందరికి దీనివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఉల్లిపాయ రసాన్ని ఎలా అప్లై చేయాలో తెలియకపోవడం కూడా ఇందుకు కారణమై ఉంటుంది. మరి అసలు ఈ ఉల్లిపాయ రసాన్ని జుట్టుకు ఎలా అప్లై చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తద్వారా ఇది జుట్టుకు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.

ఎలా ఉపయోగించాలి..

1. ముందుగా ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

2. దానిని బ్లెండర్‌లో వేసి పేస్ట్‌లా చేయండి.

ఇవి కూడా చదవండి

3. ఈ ముద్దను ఒక గుడ్డలో వేసి దాని రసాన్ని తీయండి.

4. ఇప్పుడు ఆ ఉల్లిపాయ రసాన్ని తలకు, జుట్టు మూలాలకు అప్లై చేయండి.

5. ఉల్లిపాయ రసాన్ని అప్లై చేసిన తర్వాత కొన్ని నిమిషాల పాటు తేలికపాటి చేతులతో తలకు మసాజ్ చేయండి.

6. అరగంట తర్వాత తేలికపాటి షాంపూతో తలను కడగాలి.

ప్రయోజనాలు..

జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది: ఉల్లిపాయ రసంలో సల్ఫర్ ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలకు అవసరమైన కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది. జుట్టు మీద ఉల్లిపాయ రసాన్ని క్రమం తప్పకుండా అప్లై చేయడం వల్ల హెయిర్ ఫోలికల్స్ ఉత్తేజితమవుతాయి. ఇది వేగంగా జుట్టు పెరుగుదలకు దారితీస్తుంది.

చుండ్రుని తగ్గిస్తుంది: ఉల్లిపాయ రసంలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి చుండ్రు, స్కాల్ప్ ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో సహాయపడతాయి.

జుట్టును బలంగా మారుస్తుంది: ఉల్లిపాయ రసంలో సల్ఫర్ ఉంటుంది. ఇది జుట్టుకు ముఖ్యమైన ఖనిజం. సల్ఫర్ జుట్టు తంతువులను బలోపేతం చేయడానికి, విరిగిపోకుండా కాపాడుతంది.

రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది: ఉల్లిపాయ రసంలో స్కాల్ప్‌లో రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడే సమ్మేళనాలు ఉన్నాయి. మెరుగైన రక్త ప్రసరణ జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..