జామ ఆకులతో కళ్లు చెదిరే ఆరోగ్య ప్రయోజనాలు.. ఇలా వాడారంటే డయాబెటిస్ దూరం, బరువు తగ్గుతారు

జామ ఆకుల టీ తో జీర్ణ వ్యవస్థలో ఉన్న చెడు బ్యాక్టీరియా తొలగుతుంది. ఇందులోని డైటరీ ఫైబరీ జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. జామ ఆకులను తీసుకోవడంతో డెంగ్యూ నుంచి వేగంగా కోలుకోవచ్చు. జామ ఆకుల ఎక్స్‌ట్రాక్ట్‌ను తీసుకుంటే రక్తంలో ప్లేట్‌లెట్స్‌ సంఖ్య వేగంగా పెరుగుతుంది. జ్వరం తీవ్రత సైతం తగ్గుతుంది. జామ ఆకులను క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉంటే మగవారికి మేలు చేస్తుంది. సంతాన లేమి సమస్య దూరం చేస్తుంది.

జామ ఆకులతో కళ్లు చెదిరే ఆరోగ్య ప్రయోజనాలు.. ఇలా వాడారంటే డయాబెటిస్ దూరం, బరువు తగ్గుతారు
Guava Leave
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Jul 08, 2024 | 8:06 PM

ఈ రోజుల్లో పర్ఫెక్ట్ ఫిట్‌గా ఉన్నవారు చాలా తక్కువ. చెడు జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల బరువు పెరగడం సాధారణం. అటువంటి పరిస్థితిలో ప్రతి ఒక్కరూ బరువు తగ్గాలని కోరుకుంటారు. ఈ కారణంగా వారు జిమ్, వ్యాయామం, ఆహారం పట్ల నియంత్రణ పాటిస్తున్నారు. కానీ, బరువు తగ్గడానికి సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. నేటి వాతావరణంలో బరువు తగ్గడం చాలా కష్టమైన పని. కానీ, మీరు ఈ సమస్యను సులభంగా పరిష్కరించుకోవాలనుకుంటే మీకు జామ ఆకులు అద్భుత ఔషధంగా పనిచేస్తాయి. ఈ ఆకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు కూడా నయమవుతాయంటున్నారు నిపుణులు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం…

జామ పండుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో జామ ఆకులతో కూడా అంతకు మించి ప్రయోజనాలు పొందవచ్చునని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. జామ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ మైక్రోబయిల్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. జామ ఆకులు క్యాలరీ ఫ్రీ. ఇది బరువు తగ్గడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. జామ ఆకులను అలాగే పచ్చిగా కూడా తింటే రుచిగా ఉంటుంది. కావాలనుకుంటే నీటిలో కలిపి జ్యూస్‌గా చేసుకోవచ్చు. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. జామ ఆకులలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉన్నాయి. ఇది కడుపు పూతల నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది.

దగ్గు, దురద మొదలైన వాటితో బాధపడుతున్నవారు జామ ఆకులను తినాలి. ఎందుకంటే వీటిలో శరీరానికి ఉపశమనాన్ని అందించే యాంటీ అలర్జీ లక్షణాలు ఉంటాయి. అంతేకాదు..జామ ఆకులను వివిధ రూపాల్లో తీసుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది. జామ ఆకులలో కొలెస్ట్రాల్ తగ్గించడానికి శరీరానికి సహాయపడే అనేక అంశాలు ఉన్నాయి. జామ ఆకుల టీ తాగితే రక్తంలో కొలెస్ట్రాల్‌ స్థాయిలు తగ్గుతాయి. జామ ఆకుల టీ తాగితే చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలు తగ్గి, మంచి కొలెస్ట్రాల్‌ పెరుగుతుంది. అంతే కాదు శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరిచి గుండె జబ్బుల సమస్యలను దూరం చేస్తుంది.

జామ ఆకులను తీసుకుంటే సులభంగా బరువు తగ్గవచ్చు. పిండి పదార్థాలు చక్కెరలుగా మారడాన్ని జామ ఆకుల సారం నియంత్రిస్తుంది. ఊబకాయంతో బాధపడేవారు జామ ఆకుల టీ తీసుకోవాలి. జామ ఆకులతో తయారు చేసిన టీ తాగడంతో జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా మారుతుంది. జామ ఆకుల టీ తో జీర్ణ వ్యవస్థలో ఉన్న చెడు బ్యాక్టీరియా తొలగుతుంది. ఇందులోని డైటరీ ఫైబరీ జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. జామ ఆకులను తీసుకోవడంతో డెంగ్యూ నుంచి వేగంగా కోలుకోవచ్చు. జామ ఆకుల ఎక్స్‌ట్రాక్ట్‌ను తీసుకుంటే రక్తంలో ప్లేట్‌లెట్స్‌ సంఖ్య వేగంగా పెరుగుతుంది. జ్వరం తీవ్రత సైతం తగ్గుతుంది.

జామ ఆకులను క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉంటే మగవారికి మేలు చేస్తుంది. సంతాన లేమి సమస్య దూరం చేస్తుంది. జామ ఆకుల సారాన్ని తీసుకుంటే స్మెర్మ్ నాణ్యత, కౌంట్‌ పెరుగుతుంది. జామ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌ నుంచి ఉపశమనం అందిస్తాయి. జామ ఆకులను రెగ్యులర్‌గా తింటే ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది.

చర్మం ముడతలు మాయం అవుతాయి. మొటిమలు, నల్ల మచ్చలను తొలగించడంతో జామ ఆకులు సహాయపడతాయి. జామ ఆకులు హైపర్‌ పిగ్మెంటేషన్‌ను తగ్గిస్తాయి. జామ ఆకుల పేస్ట్‌ను అప్లై చేసుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు. జుట్టును ఒత్తుగా మార్చడంలో జామ ఆకుల సారం సహాయపడుతుంది. ఈ రసం తీసుకుంటే జుట్టు మూలాల నుంచి దృఢంగా మారుతుంది. జామ ఆకుల పేస్ట్‌ను తలకు రాసుకుంటే జుట్టు ఆరోగ్యంగా మారుతుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

మళ్లీ అమ్మవుతోన్న బాపు బొమ్మ.. బేబీ బంప్ ఫొటోస్ షేర్ చేసిన ప్రణీత
మళ్లీ అమ్మవుతోన్న బాపు బొమ్మ.. బేబీ బంప్ ఫొటోస్ షేర్ చేసిన ప్రణీత
జులై 26, 27 తేదీల్లో గురుకుల విద్యాలయాల్లో స్పాట్‌ అడ్మిషన్లు
జులై 26, 27 తేదీల్లో గురుకుల విద్యాలయాల్లో స్పాట్‌ అడ్మిషన్లు
రైతన్నలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. రూ. 500 బోనస్‌తో పాటు..
రైతన్నలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. రూ. 500 బోనస్‌తో పాటు..
వాడేసిన టీ పొడిని పడేస్తున్నారా.. ఈ విషయం తెలిస్తే అస్సలు పడేయరు
వాడేసిన టీ పొడిని పడేస్తున్నారా.. ఈ విషయం తెలిస్తే అస్సలు పడేయరు
మెట్రో ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌..
మెట్రో ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌..
బాదం తింటే కొలెస్ట్రాల్‌ పెరుగుతుందా ?? నిపుణులు ఏమంటున్నారు ??
బాదం తింటే కొలెస్ట్రాల్‌ పెరుగుతుందా ?? నిపుణులు ఏమంటున్నారు ??
‘అతిగా తిని’ ప్రాణం పోగొట్టుకున్న ఇన్‌ఫ్లుయెన్సర్
‘అతిగా తిని’ ప్రాణం పోగొట్టుకున్న ఇన్‌ఫ్లుయెన్సర్
రాజ్‌ తరుణ్‌ ఇష్యూపై సీరియల్ నటి షాకింగ్ కామెంట్స్
రాజ్‌ తరుణ్‌ ఇష్యూపై సీరియల్ నటి షాకింగ్ కామెంట్స్
OTTలో రికార్డులు క్రియేట్ చేస్తోన్న అంజలి 'బహిష్కరణ' వెబ్ సిరీస్
OTTలో రికార్డులు క్రియేట్ చేస్తోన్న అంజలి 'బహిష్కరణ' వెబ్ సిరీస్
సూపర్ గేమ్ ఛేంజర్ కానున్న రీజనల్ రింగ్ రోడ్డు..!
సూపర్ గేమ్ ఛేంజర్ కానున్న రీజనల్ రింగ్ రోడ్డు..!