Life Style: ఆ రోజు హెయిర్ కట్ చేసుకుంటే అది తగ్గిపోతుందట.. ఎందుకో తెలుసా..

జుట్టు పెరిగితే సాధారణంగా హెయిర్ కట్ చేసుకుంటాం. నేటి యువత చాలామంది ఎప్పుడు హెయిర్ కట్ చయించుకోవాలంటే అప్పుడు సెలూన్ కు వెళ్లి మనకు కావల్సిన ఆకృతిలో హెయిర్ కట్ చేయించుకుంటాం. కాని చాలా ఇళ్లలో పలనా రోజు అయితే హెయిర్ కట్ చేయించుకోకూడదని..

Life Style: ఆ రోజు హెయిర్ కట్ చేసుకుంటే అది తగ్గిపోతుందట.. ఎందుకో తెలుసా..
Hair Cut
Follow us

|

Updated on: Sep 23, 2022 | 11:32 AM

Life Style: జుట్టు పెరిగితే సాధారణంగా హెయిర్ కట్ చేసుకుంటాం. నేటి యువత చాలామంది ఎప్పుడు హెయిర్ కట్ చయించుకోవాలంటే అప్పుడు సెలూన్ కు వెళ్లి మనకు కావల్సిన ఆకృతిలో హెయిర్ కట్ చేయించుకుంటాం. కాని చాలా ఇళ్లలో పలనా రోజు అయితే హెయిర్ కట్ చేయించుకోకూడదని చెబుతుంటారు. ఇంట్లో వారి మాట కాదని చేయించుకున్నామో ఆరోజంతా సుప్రభాతమే.. హెయిర్ కట్ చేయించుకునేటప్పుడు రోజును చూస్తాం. అలాగే క్షవరం చేయించుకున్న తర్వా నేరుగా ఇంట్లోకి కూడా రానీవ్వరు ఇళ్లలో చాలామంది. అసలు కానీ క్షురకర్మలకు శాస్త్ర రీత్య కొన్ని సూచనలు ఉన్నాయి వారంలో ఏ రోజు మనం కటింగ్ చేయించు కుంటే శాస్త్ర పరంగా వాటి ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం. అయితే వీటిని తప్పకుండా ఆచరించాలి. లేకపోతే ఇలా అవుతుందనే దానికి ఎటువంటి ఆధారాలు లేకపోయినా, ఆచారాలను, శాస్త్రాలను నమ్మేవారు ఈపద్ధతులను విశ్వసిస్తూ ఉంటారు. సాధారణంగా ఉదయం 12 గంటల లోపు హెయిర్ కట్ చేయించుకుంటే శుభం కలుగుతుందని శాస్త్రం చెబుతోంది. రాత్రి సమయంలో కటింగ్ చేసుకోకూడదు. తండ్రి కొడుకులు, అన్నదమ్ములు ఒకే రోజు హెయిర్ కట్ చేసుకో కూడదని శాస్త్రం చెబుతుంది.

ఆదివారము: చాలా మంది హెయిర్ కట్ చేయించుకోవడానికి ఆదివారాన్ని ఎంచుకుంటారు. ఎందుకంటే ఆరోజు విద్యాసంస్థలకు, ఆఫీసులకు వెళ్లేవారికి చాలా మందికి సెలవు రోజు. అయితే ఆదివారం హెయిర్ కట్ చేయించుకుంటే ఒక మాసము ఆయువు తగ్గిపోతుంది. ఫలితంగా శరీరం అధిక వేడి పొందుతుందని శాస్త్రం చెబుతోంది.

సోమవారం: సోమవారం హెయిర్ కట్ చేయించుకుంటే ఏడు మాసములు ఆయువు వృద్ధి చెందుతుందని, సౌఖ్యం కలుగ జేస్తుందని పురాణాలు చెబుతున్నాయి. పుత్రులు కోరుకునే గృహస్థులు, ఒకే ఒక పుత్రుడు గలవారు క్షవరము చేయించుకోకూడదని శాస్త్రం చెప్తోంది.

ఇవి కూడా చదవండి

మంగళవారముము: సాధారణంగా చాలా మంది మంగళవారం హెయిర్ కట్ చేసుకోవద్దని చెబుతూ ఉంటారు. ఈరోజు కటింగ్ చేయించుకుంటే ఏనిమిది మాసములు ఆయువు తగ్గిపోతుంది. ఫలితంగా దు:ఖం కలుగుతుందని శాస్త్రం చెబుతోంది.

బుధవారముము: ఈరోజు హెయిర్ కటింగ్ చేయించుకుంటే ఐదు మాసములు ఆయువు వృద్ధి చెందుతుందని విశ్వాసం.

గురువారముము: ఈరోజున క్షవరము చేయించుకుంటే పది మాసములు ఆయువు వృద్ధి చెందుతుందని, ధనము కోరుకునేవారు గురువారము రోజు క్షవరము చేయించుకోకూడదని పురణాలు చెబుతున్నాయి. కాదని చేయించుకుంటే ధన నాశనం కలుగజేయునని శాస్త్రం చెబుతోంది.

శుక్రవారముము: శుక్రవారం రోజున కూడా హెయిర్ కట్ చేయించుకోరు చాలామంది. ఈరోజు కూడా సెంటిమెంట్ గా ఫీలవుతారు. కాని శుక్రవారం రోజు కటింగ్ చేయించుకుంటే 11 మాసాలు ఆయువు వృద్ధి చెందుతుందని శాస్త్రం చెబుతోంది.

శనివారముము: శనివారం రోజు హెయిర్ కట్ చేయించుకుంటే ఏడు మాసములు ఆయుక్షీణమ్ కలిగించునని, ఫలితంగా రోగ వృద్ధిని కలుగజేయునని శాస్త్రాన్ని నమ్మేవారు విశ్వసిస్తారు. ఇప్పటివరకు ఏ రోజుల్లో హెయిర్ కట్ చేయించుకోవాలి, ఏ రోజు చేయించుకోకూడదో తెలుసుకున్నాం. అలాగే క్షురకర్మకు అనుకూలమైన తిధులు కొన్ని ఉన్నాయి. అవెంటో తెలుసుకుందాం.

విదియ, తదియ, పంచమి, సప్తమి, త్రయోదశి, తిధులు క్షవరం చేయించుకోవడానికి శుభ తిధులుగా పేర్కొంటారు. అలాగే హస్త , చిత్త , స్వాతి , పునర్వసు, పుష్యమీ, మృగశిర , ధనిష్ఠ , శతభిషం, అశ్విని , రేవతి, నక్షత్రాలలో హెయిర్ కట్ చేయించుకుంటే శుభం అని విశ్వసిస్తారు శాస్త్రాలను నమ్మేవారు. మఖ , కృత్తిక , ఉత్తర, అనురాధ నక్షత్రాలు క్షురకర్మకు ప్రతికూలమైన నక్షత్రాలని.. ఈరోజుల్లో క్షవరం చేయించుకోవద్దని శాస్త్రం చెబుతోంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం చూడండి..