Glue Berry: డయాబెటీస్‌తో పాటు వందల సమస్యలకు చెక్ పెట్టే.. గ్లూబెర్రీ పండ్లు..

మన చుట్టూ ఎన్నో రకాల ఔషధ గుణాలు కలిగిన మొక్కలు ఉంటాయి. కానీ వాటి గురించి మీకు పెద్దగా తెలియకపోవచ్చు. పిచ్చి మొక్కలు అని కూడా అనుకుంటారు. కానీ వాటి వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. వాటిల్లో ఒకటే గ్లూబెర్రీ పండ్ల చెట్టు. వీటినే నక్కెర పండు అని కూడా అంటారు. వీటిని ఆయుర్వేదంలో కూడా వివిధ రకాల అనారోగ్య సమస్యలను తగ్గించడానికి ఉపయోగిస్తూ ఉంటారు. కొందరు ఈ పండ్లతో ఊరగాయలు..

Glue Berry: డయాబెటీస్‌తో పాటు వందల సమస్యలకు చెక్ పెట్టే.. గ్లూబెర్రీ పండ్లు..
Glue Berry (1)

Updated on: May 30, 2024 | 4:31 PM

మన చుట్టూ ఎన్నో రకాల ఔషధ గుణాలు కలిగిన మొక్కలు ఉంటాయి. కానీ వాటి గురించి మీకు పెద్దగా తెలియకపోవచ్చు. పిచ్చి మొక్కలు అని కూడా అనుకుంటారు. కానీ వాటి వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. వాటిల్లో ఒకటే గ్లూబెర్రీ పండ్ల చెట్టు. వీటినే నక్కెర పండు అని కూడా అంటారు. వీటిని ఆయుర్వేదంలో కూడా వివిధ రకాల అనారోగ్య సమస్యలను తగ్గించడానికి ఉపయోగిస్తూ ఉంటారు. కొందరు ఈ పండ్లతో ఊరగాయలు, కూరలు కూడా తయారు చేసుకుంటూ ఉంటారు. ఇవి ఎంతో రుచిగా కూడా ఉంటాయి. ఈ పండ్లు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఈ పండులో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. క్యాల్షియం, ఫైబర్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, కొవ్వు, ఫాస్పరస్, క్రూడ్ ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు వంటివి లభ్యమవుతాయి. ఈ పండ్లు చూడటానికి ఆకు పచ్చ, ఎరుపు రంగులో ఉంటాయి. మరి ఈ పండ్లు తింటే ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

డయాబెటీస్ కంట్రోల్:

ప్రస్తుత కాలంలో డయాబెటీస్ సమస్యతో చాలా మంది బాధ పడుతున్నారు. డయాబెటీస్‌ను కంట్రోల్ చేయాలంటే చాలా కష్టం. మధుమేహం ఉన్నవారికి ఈ పండ్లు ఎంతో మేలు చేస్తాయి. షుగర్ ఉన్నవారు ఈ పండ్లు తినడం వల్ల.. రక్తంలో షుగర్ లెవల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి, ఈ పండు రక్తంలోని గ్లూకోజ్ లెవల్స్‌ను అదుపు చేస్తుంది.

జీర్ణ సమస్యలు మాయం:

ఈ పండ్లు తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు అన్నీ తగ్గుతాయి. చాలా మంది తిన్న ఆహారం అరగక అనేక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి వారు ఈ పండ్లు తినడం వల్ల అజీర్తి, గ్యాస్, కడుపులో నొప్పి, ఉబ్బరం, మలబద్ధకం అన్నీ కంట్రోల్ అవుతాయి.

ఇవి కూడా చదవండి

చర్మ సమస్యలు తగ్గుతాయి:

నక్కెర పండ్లు తినడం వల్ల చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి. వర్షాకాలంలో చాలా మంది చర్మం పొడిబారిపోయి.. చికాకు పెడుతూ ఉంటాయి. అలాంటి సమయంలో ఈ పండ్లు తింటే చర్మ సమస్యలు అనేవి తగ్గుతాయి.

దురద – అలర్జీకి చెక్:

చాలా మంది దురద, అలర్జీ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి వారు ఈ పండు ఆకులను పేస్టులా చేసి.. పెట్టుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

పీరియడ్స్ నొప్పులు తగ్గుతాయి:

గ్లూబెర్రీ పండ్ల చెట్టు బెరడు తీసుకోవడం వల్ల మహిళల్లో వచ్చే పీరియడ్స్ సమస్యలు తగ్గుతాయి. నెలసరి సమయంలో కడుపులో నొప్పి, చికాకు, నడుము నొప్పి వంటి రకరకాల నొప్పులు ఉంటాయి. ఈ చెట్టు బెరడును నీటిలో మరిగించి తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇంకా ఎన్నో సమస్యలను అదుపు చేయవచ్చు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..