AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీక్ అయిందా..? వెంటనే ఇలా చేయండి.. టెన్షన్ వద్దు.. చాలా సింపుల్..

ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీక్ అయితే భయపడాల్సిన అవసరం లేదు.. సరైన సమయంలో సరైన చర్యలు తీసుకుంటే పెద్ద ప్రమాదాలను నివారించవచ్చు. గ్యాస్ రెగ్యులేటర్‌ను వెంటనే ఆఫ్ చేయడం, విద్యుత్ స్విచ్‌లను ఉపయోగించకపోవడం, తలుపులు, కిటికీలు తెరవడం వంటి జాగ్రత్తలు ప్రాణాలను కాపాడగలవు. గ్యాస్ లీక్‌లు, వంటగది అగ్ని ప్రమాదాల నుంచి ఎలా రక్షించుకోవాలో తెలుసుకోవడం ప్రతి కుటుంబానికి అత్యవసరం.

ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీక్ అయిందా..? వెంటనే ఇలా చేయండి.. టెన్షన్ వద్దు.. చాలా సింపుల్..
Gas Cylinder Safety
Shaik Madar Saheb
|

Updated on: Jul 15, 2026 | 1:37 PM

Share

నిర్లక్ష్యం, విద్యుత్ లోపాలు, సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి.. అంతేకాకుండా ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు లేదా ఏమైనా అనుకోని ఘటనలు జరిగినప్పుడు.. కూడా అగ్ని ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ ప్రమాదాలు సర్వసాధారణం. వీటిలో వంటగదిలో గ్యాస్ లీక్‌లు, విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌లు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ ప్రమాదాల నుంచి ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అత్యవసరం అంటున్నారు నిపుణులు.. ముఖ్యంగా.. గ్యాస్ సిలిండర్ లీక్ ఘటనలు తరచూ సంభవిస్తుంటాయి.. స్టవ్ మీద నూనె వేడెక్కుతున్నప్పుడు గమనించకపోవడం, మంటలను ఆర్పకుండా వదిలేయడం, గ్యాస్ రెగ్యులేటర్ లేదా పైపులు లీక్ అవ్వడం ప్రధాన కారణాలుగా నిపుణులు చెబుతుంటాయి.

గ్యాస్ లీక్ ప్రమాదాలను నివారించడానికి కీలక సూత్రాలు

రెగ్యులేటర్ పైపు మార్పు: ప్రతి ఏడాది లేదా ఏడాదిన్నర వ్యవధిలో గ్యాస్ సిలిండర్ రెగ్యులేటర్ పైపును తప్పనిసరిగా మార్చాలి. దీనికి అయ్యే ఖర్చు చాలా తక్కువ.. అయినప్పటికీ, చాలా మంది దీనిని నిర్లక్ష్యం చేస్తారు. పాత పైపులు పగుళ్లు రావడం వల్ల లీకేజీలు సంభవించి ప్రమాదాలకు దారితీస్తాయి.

రెగ్యులేటర్ ఆఫ్ చేయడం: వంట పూర్తయిన వెంటనే స్టవ్ బంద్ చేయడంతో పాటు, సిలిండర్ వద్ద రెగ్యులేటర్‌ను కూడా ఆఫ్ చేయాలి. కేవలం స్టవ్ ఆఫ్ చేయడం వల్ల పైపులో గ్యాస్ నిండి ఉండి, లీకేజీ కారణంగా ఉదయం పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.

సిలిండర్ వాషర్ తనిఖీ: కొత్త సిలిండర్ వచ్చినప్పుడు దాని వాషర్‌ను సరిగ్గా తనిఖీ చేయాలి. వాషర్ సరిగ్గా లేకపోతే లేదా తయారీ లోపం ఉంటే, సిలిండర్ బిగించగానే గ్యాస్ లీక్ కావచ్చు.

అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు తీసుకోవాల్సిన చర్యలు:

గ్యాస్ సిలిండర్ మంటలు: గ్యాస్ సిలిండర్‌కు మంటలు అంటుకుంటే, వెంటనే తడిసిన, దళసరి వస్త్రాన్ని దానిపై వేసి మంటలను ఆర్పడానికి ప్రయత్నించాలి. ఇది ఆక్సిజన్ సరఫరాను నిలిపివేసి మంటలను అదుపు చేస్తుంది.

శరీరానికి మంటలు: శరీరానికి మంటలు అంటుకుంటే, పరిగెత్తకుండా కింద పడి అటూ ఇటూ దొర్లాలి. ఇది ఆక్సిజన్ సరఫరాను తగ్గించి మంటలను ఆర్పడానికి సహాయపడుతుంది.

నూనె మంటలు: వంట చేస్తున్నప్పుడు నూనెకు మంటలు అంటుకుంటే, దానిపై వెంటనే గోధుమ పిండి, వరి పిండి లేదా ఇసుకను వేయాలి. ఇది మంటలను తక్షణమే ఆర్పేస్తుంది. నీటిని ఎప్పుడూ ఉపయోగించకూడదు.

ఇతర ముఖ్యమైన జాగ్రత్తలు:

వంటగదిలో ఫ్రిజ్ వద్దు: వంటగదిలో ఫ్రిజ్‌ను ఉంచకూడదు. వంట చేసేటప్పుడు వెలువడే వేడి కారణంగా ఫ్రిజ్‌లోని ఫ్రియాన్ గ్యాస్ లీక్ అయ్యి అగ్ని ప్రమాదాలకు దారితీయవచ్చు. ఫ్రిజ్ ఎల్లప్పుడూ చల్లని వాతావరణంలో ఉండాలి.

విద్యుత్ ఉపకరణాల వినియోగం: ఏసీలు, టీవీలు, ఫ్యాన్‌లను 8 గంటల కంటే ఎక్కువ నిరంతరం ఆపరేట్ చేయకూడదు. వాటికి కనీసం ఒకటి లేదా రెండు గంటలు విశ్రాంతి ఇవ్వాలి. నిరంతర ఆపరేషన్ వల్ల అవి వేడెక్కి షార్ట్ సర్క్యూట్‌లు, అగ్ని ప్రమాదాలకు కారణం కావచ్చు.

పిల్లలకు అవగాహన: చిన్న పిల్లలకు అగ్ని ప్రమాదాల గురించి, గ్యాస్ లీక్‌లు, రోడ్డు ప్రమాదాలు, వరదల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చిన్నతనం నుండే అవగాహన కల్పించాలి. ఇది భవిష్యత్తులో వారు తమను తాము, ఇతరులను కాపాడుకోవడానికి సహాయపడుతుంది.

ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా అనేక అగ్ని ప్రమాదాలను నివారించి, ప్రాణాలను, ఆస్తులను కాపాడుకోవచ్చు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us