
వేళ ప్రకారం భోజనం చేయకుంటే కలిగే నష్టాలు అన్నీ ఇన్నీ కావు. కొన్నిసార్లు మధ్యాహ్న భోజనం 2 గంటలకు, మరికొన్నిసార్లు 4 గంటలకు కూడా భోజనం చేస్తుంటారు. ఇలా వేళలు తప్పి తినడం, తాగడం వల్ల శరీరంపై ఒత్తిడి పెరుగుతుంది. అనారోగ్యకరమైన ఆహారాన్ని తినడమే కాకుండా, సరైన సమయానికి తినడం, త్రాగకపోతే వివిధ రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. జీర్ణ రుగ్మతలు సర్వసాధారణం. పొత్తికడుపు నొప్పి, మూత్ర సమస్యలు, గురక వంటి లక్షణాలు వీరిలో కనిపిస్తాయి. చాలామంది దీనిని ప్రాథమిక స్థాయిలో గుర్తించకపోవచ్చు. కానీ పరీక్షలో పిత్తాశయ రాళ్లు అభివృద్ధి చెందినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం వివిధ వయసుల వారు ఈ గాల్ బ్లాడర్ స్టోన్ సమస్యలతో బాధపడుతున్నారు. పిత్తాశయంలో ఏర్పడే చిన్న రాళ్లను గాల్ బ్లాడర్ రాళ్లు అంటారు. ఈ రాళ్లు కాలేయం కింది భాగంలో ఉంటాయి. పిత్తాశయంలో కొలెస్ట్రాల్ చేరి గట్టిపడటం వల్ల, రాళ్లుగా మారుతాయి. ఇలా రాళ్లు ఏర్పడితే భరించలేని నొప్పి వస్తుంది. దానితో పాటు ఆహారం జీర్ణం కావడంలో సమస్య తలెత్తుతుంది.
ఖాళీ కడుపుతో ఎక్కువసేపు ఉండటం వల్ల పిత్తాశయంలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. అందుకే, వైద్యులు ప్రతి 2-3 గంటలకు కొద్ది మొత్తంలో భోజనం తినాలని సిఫార్సు చేస్తున్నారు. ఇది మంచి జీర్ణ ఆరోగ్యాన్ని కలిగే చేస్తుంది. అలాగే బరువు పెరిగినా గాల్ బ్లాడర్ పై ఒత్తిడి పడుతుంది. యువకులలో పిత్తాశయంలో రాళ్లు చాలా సాధారణం. మధుమేహం సమస్య ఉన్నవారిలో కూడా, పిత్తాశయ రాళ్లు ఏర్పడతాయి. పిత్తాశయ రాళ్ల ప్రమాదాన్ని నివారించడానికి సరైన సమయంలో తినడం, తాగడం చాలా అవసరం. దానితోపాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. అదనంగా, శరీరంలో నీటి లోపం తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు డయాబెటిస్ ఉన్నట్లయితే, అదనపు జాగ్రత్తలు తీసుకోవల్సి ఉంటుంది. అయితే గాల్ బ్లాడర్ స్టోన్ లక్షణాలు ఏమిటి? వీటిని సకాలంలో ఎలా గుర్తించాలి అనే విషయాలు నిపుణుల మాటల్లో..
మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్ చేయండి.