Health Tips: వీటిని పచ్చిగా తినడం చాలా ప్రమాదం.. అవేంటంటే?

|

Jun 23, 2022 | 8:33 PM

కొన్ని కూరగాయలను పచ్చిగా తినడం వల్ల తీవ్రమైన హాని కలుగుతుంది. ఈ కూరగాయలను తినడానికి ముందు ఆవిరి లేదా ఉడికించి మాత్రమే తినాలి.

Health Tips: వీటిని పచ్చిగా తినడం చాలా ప్రమాదం.. అవేంటంటే?
Vegetable
Follow us on

చాలా పచ్చి కూరగాయలను సలాడ్‌గా తీసుకుంటుంటాం. కీరదోసకాయ, టొమాటో, క్యాబేజీ వంటి వెజిటబుల్ సలాడ్‌లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే కొన్ని కూరగాయలను మరచిపోయి కూడా పచ్చిగా తినకూడదు. ఇది తీవ్రమైన నష్టాలను కలిగిస్తుంది. కూరగాయలు పచ్చిగా ఉండడం వల్ల అందులో ఉండే విటమిన్లు, మినరల్స్ పూర్తి ప్రయోజనాలు లభించవు. ఈ కూరగాయలను ఎల్లప్పుడూ ఉడకబెట్టడం, ఆవిరి చేయడం లేదా కాల్చడం ద్వారా తినొచ్చు. అప్పుడే అందులోని ప్రయోజనాలు మనకు అందుతాయి.

  1. బెండకాయ: పచ్చి బెండకాయ తింటే అది మీ జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. బెండకాయను పచ్చిగా తినడం వల్ల వాంతులు, కడుపులో తిమ్మిర్లు వస్తాయి. బెండకాయలో కనిపించే సోలనిన్ నరాల, జీర్ణశయాంతర సమస్యల లక్షణాలను కలిగిస్తుంది. మీరు ఎప్పుడు బెండకాయ తినాలనుకున్నా.. వాటిని బాగా ఉడికించాలి.
  2. పాలకూర: పాలకూరలో ఫోలేట్ ఉంటుంది. దీన్ని ఎప్పుడూ పచ్చిగా తినకండి. ఎల్లప్పుడూ ఆవిరి మీద ఉడికించి తినాలి. ఇది ఫోలేట్ స్థాయిని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.
  3. పుట్టగొడుగులు: ఎల్లప్పుడూ పుట్టగొడుగులను ఉడికించి తినండి. దీన్ని ఉడికించి తింటే దానిలోని పోషకాలన్నీ అందుతాయి. పుట్టగొడుగులను గ్రిల్ చేయడం లేదా ఉడకబెట్టడం ద్వారా తినాలి. గ్రిల్లింగ్ పుట్టగొడుగులలో పొటాషియం మొత్తాన్ని పెంచుతుంది.
  4. బంగాళదుంప: పచ్చి బంగాళదుంపలలో సోలనిన్ అనే టాక్సిన్ ఉంటుంది. పచ్చిగా తినడం వల్ల గ్యాస్, వాంతులు, జీర్ణ సమస్యలు వస్తాయి. బంగాళదుంపలను ఉడికించి లేదా వేయించి తినాలి.
  5. ఇవి కూడా చదవండి

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం కేవలం అవగాహన కోసమే. ఈ పద్ధతులు, చిట్కాలు, సూచనలు పాటించాలనుకుంటే, ముందుగా డాక్టర్‌ని సంప్రదించి సరైన నిర్ణయం తీసుకోవడం చాలా మంచింది.