AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచంలోనే తీయటి మామిడి గురించి ఎప్పుడైనా విన్నారా..? దీని పేరు గిన్నిస్ బుక్‌ లో కూడా నమోదైంది..!

వేసవిలో మామిడి మధురం మనకు గుర్తొచ్చే మొదటి విషయం. కానీ ప్రపంచంలోనే అత్యంత తీయటిగా గుర్తింపు పొందిన కారాబావో మామిడి గురించి చాలా మందికి తెలియదు. ఫిలిప్పీన్స్‌ కి చెందిన ఈ మామిడి గిన్నిస్ బుక్‌ లో చోటు దక్కించుకుంది. దీని తీపి రుచి అంతగా ప్రసిద్ధి చెందింది.

ప్రపంచంలోనే తీయటి మామిడి గురించి ఎప్పుడైనా విన్నారా..? దీని పేరు గిన్నిస్ బుక్‌ లో కూడా నమోదైంది..!
World Sweetest Mango
Prashanthi V
|

Updated on: May 21, 2025 | 4:56 PM

Share

మామిడి పండ్లలో రారాజు.. ఎండాకాలం వచ్చిందంటే చాలు మామిడి కోసం అందరం ఎదురు చూస్తాం. మామిడి తీయటి వాసన, రుచి అందరినీ ఆకర్షిస్తుంది. జ్యూస్‌ గా తాగినా, ముక్కలుగా తిన్నా, మామిడి రుచి తేనెలా ఉంటుంది. అయితే ప్రపంచంలోనే అత్యంత తీయటి మామిడి ఒకటి ఉందని చాలా మందికి తెలీదు. దీనికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌ లో కూడా చోటు దక్కింది. ఆ మామిడి పేరే కారాబావో మామిడి.

ఈ కారాబావో మామిడి ఫిలిప్పీన్స్ దేశానికి చెందింది. అక్కడి ప్రజలు దీనిని ఫిలిపినో మామిడి లేదా మనీలా మామిడి అని కూడా పిలుస్తారు. ఫిలిప్పీన్స్‌లో ఈ మామిడిని చాలా ఎక్కువగా పండిస్తారు. దీని గొప్పతనం ఏంటంటే.. ఇది తీయదనంలో ప్రపంచంలోనే నంబర్ వన్. దాని రుచి అంత అద్భుతంగా ఉంటుంది.

ఈ మామిడికి 1995లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తింపు వచ్చింది. ఆ సంవత్సరంలో ఇది ప్రపంచంలోనే అత్యంత తీయటి మామిడి రకంగా అధికారికంగా గుర్తింపు పొందింది. ఈ మామిడిలో సగటున 15 గ్రాముల చక్కెర ఉంటుంది. ఇది ఇతర మామిడి పండ్లతో పోలిస్తే మూడు నుండి నాలుగు టీ స్పూన్ల చక్కెరతో సమానం. పూర్తిగా పండినప్పుడు, దీని తీయదనం రెట్టింపు కూడా అవుతుంది.

ఈ మామిడికి వచ్చిన ఈ గౌరవం ఫిలిప్పీన్స్ ప్రజలకు చాలా గర్వకారణం. అంతర్జాతీయంగా ఈ మామిడికి మంచి గుర్తింపు వచ్చింది. మామిడి ఇష్టపడేవారు దీని రుచి అసాధారణంగా ఉంటుందని అంటారు.

ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఇప్పుడు భారతదేశంలో కూడా కొందరు రైతులు ఈ కారాబావో మామిడిని పండించడం మొదలుపెడుతున్నారు. ఇది విదేశీ రకం అయినప్పటికీ దాని తీయదనాన్ని భారతీయ వినియోగదారులకు చూపించడానికి ప్రయత్నిస్తున్నారు. భారత మార్కెట్‌ లో కూడా ఈ మామిడికి నెమ్మదిగా డిమాండ్ పెరుగుతోంది.

మీకు ఎప్పుడైనా ఈ కారాబావో మామిడిని తినే అవకాశం వస్తే.. దానిని వదులుకోవద్దు. ఎందుకంటే ఇది మామూలు మామిడి కాదు.. గిన్నిస్ బుక్‌ లో చోటు సంపాదించిన మామిడి. దీని తీయదనం మీకు ఒక ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది.

తండ్రి గుండెపోటుతో మారిన జీవితం.. 16 ఏళ్లకే 'స్పీడ్ గన్'గా
తండ్రి గుండెపోటుతో మారిన జీవితం.. 16 ఏళ్లకే 'స్పీడ్ గన్'గా
మీ జీవితంలో ఏదైనా చెడు జరగడానికి ముందు కనిపించే సంకేతాలు ఇవే..
మీ జీవితంలో ఏదైనా చెడు జరగడానికి ముందు కనిపించే సంకేతాలు ఇవే..
ఒక రోజు మొత్తం ఏమీ తినకపోతే ఆరోగ్యానికి లాభమా.. నష్టమా?
ఒక రోజు మొత్తం ఏమీ తినకపోతే ఆరోగ్యానికి లాభమా.. నష్టమా?
2026లో శని-గురు అద్భుత కలయికతో వీరికి హ్యాపీడేస్ స్టార్ట్
2026లో శని-గురు అద్భుత కలయికతో వీరికి హ్యాపీడేస్ స్టార్ట్
కేవలం రోజుకు 333 డిపాజిట్‌తో చేతికి రూ.17 లక్షలు..బెస్ట్ స్కీమ్
కేవలం రోజుకు 333 డిపాజిట్‌తో చేతికి రూ.17 లక్షలు..బెస్ట్ స్కీమ్
పాతకాలం నాటి ప్రేమే ముద్దు అంటున్న బాలీవుడ్ బ్యూటీ
పాతకాలం నాటి ప్రేమే ముద్దు అంటున్న బాలీవుడ్ బ్యూటీ
రవీంద్ర భారతిలో ఆటా సందడి.. తెలుగు మూలాలను మర్చిపోవద్దన్న గవర్నర్
రవీంద్ర భారతిలో ఆటా సందడి.. తెలుగు మూలాలను మర్చిపోవద్దన్న గవర్నర్
ఫ్రీగా సినిమా టికెట్స్.. రెస్టారెంట్‌లో భోజనం.. మీకు కూడా..
ఫ్రీగా సినిమా టికెట్స్.. రెస్టారెంట్‌లో భోజనం.. మీకు కూడా..
15 రోజుల ముందే చెప్పేసిన హిట్‌మ్యాన్..
15 రోజుల ముందే చెప్పేసిన హిట్‌మ్యాన్..
'నేనూ భారతీయుడినే..' డెహ్రాడూన్ జాత్యహంకార దాడిలో విద్యార్ధి మృతి
'నేనూ భారతీయుడినే..' డెహ్రాడూన్ జాత్యహంకార దాడిలో విద్యార్ధి మృతి