Women Health: అమ్మ కావాలనుకునేవారికి తప్పనిసరి.. ఆ సమస్య బారిన పడకూడదంటే తినాల్సిన 5 ఆహారాలివే..

|

Apr 12, 2023 | 6:25 AM

అమ్మ అని పిలిపించుకోవాలని ప్రతి స్త్రీ కోరుకుంటుంది. అయితే కొన్ని రకాల ఆహార అలవాట్లు, జీవనశైలి కారణంగా కొందరు స్త్రీలు ఆ అదృష్టాన్ని చేజేతులా చేజార్చుకుంటున్నారు. అలాగే మహిళలకు అండాశయ లోపాలు ఉండడం కూడా ఇలా తల్లి కాలేకపోవడానికి గల మరో కారణం. మరికొందరు..

Women Health: అమ్మ కావాలనుకునేవారికి తప్పనిసరి.. ఆ సమస్య బారిన పడకూడదంటే తినాల్సిన 5 ఆహారాలివే..
Foods For Health Of Female Reproductive System
Follow us on

Women Health: అమ్మ అని పిలిపించుకోవాలని ప్రతి స్త్రీ కోరుకుంటుంది. అయితే కొన్ని రకాల ఆహార అలవాట్లు, జీవనశైలి కారణంగా కొందరు స్త్రీలు ఆ అదృష్టాన్ని చేజేతులా చేజార్చుకుంటున్నారు. అలాగే మహిళలకు అండాశయ లోపాలు ఉండడం కూడా ఇలా తల్లి కాలేకపోవడానికి గల మరో కారణం. మరికొందరు జన్యుపరమైన లోపాల కారణంతో గర్భం దాల్చలేకపోతుంటారు. అయితే ముందుగా చెప్పుకున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లే ఆడవారు అమ్మ కాలేకపోవడానికి ప్రధాన కారణం. అవును, సమయపాలన లేని ఆహారపు అలవాట్ల కారణంగా స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో సమస్యలు తలెత్తుతాయి. ఫలితంగా వారు తల్లి కాలేరు. అందువల్ల ప్రత్యుత్పత్తి సమస్యలకు దూరంగా ఉండేందుకు కొన్ని రకాల సలహాలను అందిస్తున్నారు వైద్య నిపుణులు. స్త్రీ  ప్రత్యుత్పత్తి వ్యవస్థను కాపాడుకోవడానికి కొన్ని రకాల ఆహారాలను తినాలని వాటిని తింటే ఆరోగ్యంగా కూడా ఉండవచ్చని వారు సూచిస్తున్నారు. మరి ప్రత్యుత్పత్తి వ్యవస్థ కోసం తీసుకోవలసిన ఆహారాలేమిటో ఇప్పుడు చూద్దాం..

  1. బెర్రీలు: మహిళల ప్రత్యుత్పత్తి వ్యవస్థను కాపాడుకోవడంలో బెర్రీలు ఎంతగానో ఉపకరిస్తాయి. గర్భం దాల్చేందుకు ప్రయత్నిస్తున్న మహిళలకు కూడా ఇవి ఉపయోగకరం. బెర్రీలలో పుష్కలంగా ఉండే యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫైటోన్యూట్రియెంట్స్, రాస్ప్బెర్రీస్, బ్లూబెర్రీస్ స్త్రీలలో సంతానోత్పత్తిని పెంచడంలో సహాయపడతాయి. స్త్రీ శరీరంలో పిండాభివృద్ధికి అవసరమైన ఫోలేట్, విటమిన్ సీ వంటి పోషకాలను బెర్రీలు కలిగి ఉంటాయి. అందువల్ల బెర్రీలు ప్రత్యుత్పత్తి వ్యవస్థను కాపాడుకోవడానికి సహాయపడతాయి.
  2. తృణధాన్యాలు: బ్రౌన్ రైస్, వోట్స్ వంటి తృణధాన్యాలలో జింక్, సెలీనియం, B విటమిన్లు వంటి సంతానోత్పత్తిని పెంచే అనేక రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి స్త్రీ శరీరంలోని హార్మోన్లను సమతుల్యం చేయడానికి కూడా సహాయపడతాయి. స్వీట్లు, కేకులు,పేస్ట్రీలు వంటి ఉత్పత్తులలో శుద్ధి చేసిన చక్కెరలు కలుపుతారు. వీటిని తీసుకోవడం వల్ల స్త్రీ శరీరంలో హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తుంది. కాబట్టి వీలైనంత వరకు ఈ రకం ఉత్పత్తులను తగ్గించాలి. ఇంకా తృణధాన్యాలను మీ ఆహారంలో ఉండేలా చూసుకోండి.
  3. పెరుగు: జీర్ణ రుగ్మతలకు సంబంధించిన సమస్యలను తగ్గించడంలో పెరుగు సహాయపడుతుంది. అదనంగా కడుపు పూతల, ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెరుగు తగ్గిస్తుంది. గర్భం దాల్చేందుకు ప్రయత్నించే ప్రతి స్త్రీ క్రమం తప్పకుండా కాల్షియం పోషకాలతో నిండిన పండ్లు లేదా పండ్ల గింజలతో  ఒక కప్పు పెరుగు తినాలి.
  4. గుడ్డు: గుడ్లు విటమిన్లకు, ప్రోటీన్లకు నిలయం. ఒమేగా 3, కోలిన్ కంటెంట్‌ను కూడా గుడ్లు కలిగి ఉన్నందున.. వీటితో గర్భాశయ సంబంధించిన ప్రమాదాలను తగ్గించుకోవచ్చు.
  5. చేప: చేపలలో ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సహాయపడటమే కాకుండా, పొడి చర్మం, పొడి జుట్టు, అలసట, చిరాకు, కీళ్లనొప్పులు, అధిక రక్తపోటు, జుట్టు రాలడం వంటి సమస్యల నుంచి రక్షించడంలో సహాయపడతాయి. కాబట్టి మీ ఆహారంలో చేపలు ఉండేలా చూసుకోండి..

నోట్: ఈ కథనంలో అందించిన సమాచారం పాఠకులలో అవగాహన కోసం రాసినది మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏదైనా సూచనను పాటించే ముందు వైద్యులను సంప్రదించండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి