చలి కాలం వచ్చేసింది.. వాతావరణంలోనే కాకుండా శరీరంలో కూడా మార్పులు వస్తాయి. చర్మం డ్రైగా, పొలుసు బారినట్టు మారిపోతుంది. అలాగే తేమ కూడా తగ్గిపోయి.. నిర్జీవంగా మారుతుంది. వర్షకాలం, వేసవి కాలంలో చర్మంపై శ్రద్ధ చూపకపోయినా.. చలి కాలంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. లేదంటే చర్మం అందవిహీనంగా తయారవుతుంది. చలి గాలుల వల్ల పగలటం, పొడి బారటం, చిట పటలాడం, మంట పెట్టడం, దురద పెట్టడం వంటి సమస్యలు వస్తాయి. ఈ కాలంలో డ్రై స్కిన్ ఉన్న వారికి ఇబ్బందులు మరీ ఎక్కువగా వస్తాయి. అలాంటి వారు ఖచ్చితంగా చర్మానికి కేర్ తీసుకోవాలి. కాబట్టి వింటర్ సీజన్ లో మాయిశ్చ రైజింగ్ క్రీములు వాడాలి. చలి కాలంలో ఇంటి వద్దే కొన్ని రకాల టిప్స్ పాటిస్తే మీ ఫేస్ గ్లోయింగ్ గా ఉంటుంది. మరి ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నీరు ఎక్కువగా తీసుకోవాలి:
ఈ సీజన్ లో చలి కారణంగా అంతగా నీరు తాగాలని అనిపించదు. కానీ శీతా కాలంలో చర్మం డ్రైగా మారిపోతుంది. కాబట్టి తగినంత నీరు తాగుతూ ఉండాలి. దీంతో చర్మం సాఫ్ట్ గా, తేమను కోల్పోకుండా గ్లోగా ఉంటుంది. అంతే కాకుండా బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా జరుగుతుంది.
మాయిశ్చరైజర్ ను మార్చాలి:
సాధారణంగా వర్షా కాలం, వేసవి కాలంలో రాసుకునే మాయిశ్చరైజర్స్ కంటే చలి కాలంలో ఇంకా రిచ్ గా, ఆయిల్ బేస్ ఉండే క్రీములు రాసుకోవాలి. వీలైనంత వరకూ ఆర్గానిక ప్రాడెక్ట్స్ వాడటం బెటర్.
ఈ కూరగాయలు తినాలి:
ఈ సీజన్ లో చర్మానికి మేలు చేసే కూరగాయాలు తింటే స్కిన్ కూడా బాగుంటుంది. చిలగడ దుంపలు, క్యాప్సికం, క్యారెట్, గుమ్మడి కాయ వంటి వాటిలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్లు, ఏ, బీ, ఈ, ఐరన్ వంటి ఉంటాయి. ఇవి తీసుకుంటే చర్మం తేమగా ఉంటుంది.
ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్:
చలి కాలంలో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారం తీసుకోవాలి. వీటివల్ల స్కిన్ సాఫ్ట్ గా ఉంటాయి. సాల్మన్ ఫిష్, ఆలీవ్ ఆయిల్, వాల్ నట్స్ లో ఈ ఫ్యాటీ యాసిడ్స్ మెండుగా ఉంటాయి.
కొబ్బరి నూనె:
కొబ్బరి నూనె అనేది స్కిన్ కేర్ లో కీ రోల్ పోషిస్తుంది. ఫ్రీ రాడికల్స్ వల్ల జరిగిన డ్యామేజ్ ను తగ్గిస్తుంది. అలాగే స్కిన్ యంగ్ గా కనిపించేలా చేస్తుంది. కాబట్టి చలి కాలంలో రాత్రి పడుకునే ముందు కొద్దిగా కొబ్బరి నూనె మసాజ్ చేసుకుని.. ఉదయాన్నే స్నానం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
దానిమ్మ పండు:
అన్ని రకాల పండ్ల కంటే దానిమ్మ పండు చాలా బెటర్. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్స్.. సెల్ ఏజీయింగ్ ను అడ్డుకుంటాయని పలు పరిశోధనల్లో తేలాయి. కాబట్టి చలి కాలంలో దానిమ్మ పండు తిన్నా, జ్యూస్ తాగినా మంచిదే. కాబట్టి వింటర్ సీజన్ లో వీలైనంత వరకూ దానిమ్మ పండు తింటే స్కిన్ బావుంటుంది.