World Chocolate Day 2021 : ప్రపంచ చాక్లెట్ డే ఎందుకు జరుపుకుంటారు..! దీని వెనకున్న చరిత్ర ఏమిటీ..?

| Edited By: Rajitha Chanti

Jul 06, 2021 | 8:51 AM

World Chocolate Day 2021 : మంచి పని ప్రారంభిస్తున్నప్పుడు నోరు తీపి చేసుకోవాలని మన పెద్దలు చెప్పిన మాట. అందుకోసం చాక్లెట్లు పంచితే సరిపోతుంది. మానసిక స్థితిని

World Chocolate Day 2021 : ప్రపంచ చాక్లెట్ డే ఎందుకు జరుపుకుంటారు..! దీని వెనకున్న చరిత్ర ఏమిటీ..?
World Chocolate Day 2021
Follow us on

World Chocolate Day 2021 : మంచి పని ప్రారంభిస్తున్నప్పుడు నోరు తీపి చేసుకోవాలని మన పెద్దలు చెప్పిన మాట. అందుకోసం చాక్లెట్లు పంచితే సరిపోతుంది. మానసిక స్థితిని పెంచడానికి చాక్లెట్లు చక్కగా ఉపయోగపడతాయి. అయినా చాక్లెట్లను ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి.. చిన్నపిల్లల నుంచి పెద్దవారి దాకా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఎవరికి కావలసిన ధరలో వారికి అందుబాటులో దొరికేవి చాక్లెట్లు మాత్రమే. అందుకే ప్రతి సంవత్సరం జూలై 7 న ప్రపంచ చాక్లెట్ రోజును జరుపుకుంటారు.

ప్రపంచ చాక్లెట్ డే 2021..
మొదటిసారి ప్రపంచ చాక్లెట్ డేను 2009 సంవత్సరంలో నిర్వహించారు. ఘనా, యునైటెడ్ స్టేట్స్ వంటి ఇతర దేశాలు ఈ తేదీన చాక్లెట్ దినోత్సవాన్ని జరుపుకోవు. ఎందుకంటే అవి సొంత తేదీలను నిర్ణయించుకున్నాయి. ఘనా ఫిబ్రవరి 14 న జరుపుకుంటుంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అక్టోబర్ 28 న చాక్లెట్ డేను జరుపుకుంటుంది. ఈ ప్రత్యేక రోజును జరుపుకోవడానికి కారణం తెలియకపోయినా 16 వ శతాబ్దంలో మొదటిసారిగా చాక్లెట్‌ను యూరప్‌కు తీసుకువచ్చినట్లు చెబుతారు. దీనిని కనుగొనడానికి యూరోపియన్లకు చాలా సమయం పట్టిందని చెబుతారు.

7 జూలై 1550 మొదటిసారి ఖండానికి చాక్లెట్ తెచ్చిన రోజుగా పరిగణిస్తారు. చాక్లెట్‌లో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కనుక ఈ ప్రత్యేక రోజును చాక్లెట్ తినడం ద్వారా జరుపుకుంటారు. మార్కెట్‌లో కోకో పౌడర్, చాక్లెట్ మిల్క్, చోకో సిరప్, వంటి రకరకాల చాక్లెట్ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి.

మానసిక ఒత్తిళ్లను తగ్గించే అద్భుత గుణాలు చాక్లెట్‌ సొంతం అంటున్నారు నిపుణులు. మన మెదడులో సెరటోనిన్‌ హార్మోన్‌ స్థాయులను పెంచి మనసులోని ఆందోళనలను తగ్గించడంలో ఇది సహకరిస్తుంది. చాక్లెట్‌లో ‘ఎల్‌-ఆర్జినైన్‌’ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది స్త్రీ, పురుషుల శరీరంలోని లైంగిక అవయవాలకు రక్తాన్ని సరఫరా చేసి లైంగిక కోరికలు పెరిగేందుకు సహకరిస్తుంది. అందుకే చాక్లెట్‌ను న్యాచురల్‌ సెక్స్‌ బూస్టర్‌గా పరిగణిస్తారు.

చాక్లెట్‌లోని ఫ్లేవనాల్స్‌ అతినీలలోహిత కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. అలాగే చర్మానికి రక్తప్రసరణను మెరుగుపరిచి చర్మ ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. గర్భిణిగా ఉన్నప్పుడు రోజూ 30 గ్రాముల చాక్లెట్‌ తీసుకోవడం వల్ల పిండం ఆరోగ్యంగా ఎదుగుతుందట..ఎప్పుడూ ఏదో ఒక చిరుతిండి తినాలని మనసు కోరుకుంటే ఒక చిన్న చాక్లెట్‌ ముక్క నోట్లో వేసుకోండి.. ఇక అలాంటి పదార్థాల పైకి మనసు మళ్లదు. తద్వారా అధిక బరువు పెరగకుండా జాగ్రత్తపడచ్చు.

 

Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ పదార్థాలకు దూరంగా ఉండండి.. తిన్నారో ఇక అంతే సంగతులు..

Hiccups : తరచూ ఎక్కిళ్లతో ఇబ్బంది పడుతున్నారా..! అయితే ఇంట్లోనే ఈ నివారణ చర్యలు పాటించండి..

MILK : పాలతో కలిపి ఈ పదార్థాలు అస్సలు తినకూడదు..! చాలా డేంజర్.. అవేంటో తెలుసుకోండి..