
ప్రతి రోజూ రాగిజావ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. మంచి పోషకాలను కలిగి ఉంటుంది. రాగులు అనేవి పోషకమైన ఆహారం. కాల్షియం, పొటాషియం సమృద్ధిగా ఉన్న మిల్లెట్ ఎముకలు, కీళ్లను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. రాగుల్లో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అవాంఛిత ఆహార కోరికలను అరికడుతుంది. ఆరోగ్యకరమైన బరువు తగ్గడంలో సహాయపడుతుంది. అయితే, రాగులతో లాభాలే కాదు కొన్ని నష్టాలు కూడా ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అవేంటో పూర్తి వివరాల్లోకి వెళితే…
ముఖ్యంగా రాగి జావను ఉదయం తీసుకుంటే చాలా మంచిది. రాత్రిపూట తీసుకోవడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. బరువు పెరగాలనుకునేవారు రాగులు లేదా రాగి జావను ఎక్కువగా తీసుకోవద్దు. కొంచెంగా తీసుకోవచ్చు. ఎందుకంటే రాగజావ వినియోగంతో బరువు తగ్గే అవకాశం ఉంటుంది. రాగి జావ అధిక వినియోగం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్, డయేరియా వచ్చే అవకాశముంది. ఇది అందరిలో ఉండకపోవచ్చు.
మూత్రపిండాల్లో రాళ్లు లేదా మూత్ర విసర్జన సమస్యలు ఉన్నవారు రాగిజావకు దూరంగా ఉంటేనే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఆహార సున్నితత్వం ఉన్న పిల్లలకు రాగులతో కూడిన ఆహారం పెట్టకపోవటం మంచిది. ఈ విషయంలో వైద్యుడి సలహాలు తీసుకోవటం ఉత్తమం.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..