Viral Video: ద్యావుడా.. ఇదేం పకోడీ అక్కా..! చూస్తుంటేనే పొట్టంతా దేవేస్తోంది? వీడియో వైరల్
చల్లని సాయంకాలం వేళలో వేడివేడి టీతో ప్లేట్ పకోడీ తింటే ఆ మజానే వేరు. కారంగా కరకర లాడుతూ ఉండే పకోడి ఇష్టపడని వారు దాదాపు ఉండరు. బయట రెస్టారెంట్లలోనే కాకుండా ఇంట్లో కూడా చాలా మంది స్నాక్స్ తయారు చేసుకోవాలంటే తొలుత మదిలో మెదిలేది పకోడీనే. ఉల్లి పకోడి, బ్రెడ్ పకోడి, చికెన్ పకోడి.. ఇలా రకరకాల స్పెషల్స్ చేసుకుని ఆరగిస్తుంటారు. అయితే మీరెప్పుడైనా బిస్కెట్ పకోడీ ట్రై చేశారా? అదేంటి అని అనుకుంటున్నారా? మీరు సరిగ్గానే చదివారు.. బిస్కెట్ పకోడీ ఎలా తయారు..

చల్లని సాయంకాలం వేళలో వేడివేడి టీతో ప్లేట్ పకోడీ తింటే ఆ మజానే వేరు. కారంగా కరకర లాడుతూ ఉండే పకోడి ఇష్టపడని వారు దాదాపు ఉండరు. బయట రెస్టారెంట్లలోనే కాకుండా ఇంట్లో కూడా చాలా మంది స్నాక్స్ తయారు చేసుకోవాలంటే తొలుత మదిలో మెదిలేది పకోడీనే. ఉల్లి పకోడి, బ్రెడ్ పకోడి, చికెన్ పకోడి.. ఇలా రకరకాల స్పెషల్స్ చేసుకుని ఆరగిస్తుంటారు. అయితే మీరెప్పుడైనా బిస్కెట్ పకోడీ ట్రై చేశారా? అదేంటి అని అనుకుంటున్నారా? మీరు సరిగ్గానే చదివారు.. బిస్కెట్ పకోడీ ఎలా తయారు చేస్తారు.. అసలదేం బాగుంటుంది అని ముఖం వికారంగా పెట్టే ఉంటారు. అసలు విషయం ఏంటంటే.. ఓ గృహిణి నిజంగానే బిస్కెట్లతో పకోడీ తయారు చేసింది. అంతే ఆమె బిస్కెట్ల పకోడీ వీడియో సోషల్ మీడియాలో కరోనా వైరస్ కంటే వేగంగా వైరల్ అయ్యింది. మీరూ ఈ వింత వంటకం చూసి తరించండి..
సోషల్ మీడియాలో వెరైటీ వంటల ప్రయోగాలకు సంబంధించిన ఎన్నో వీడియోలు చాలానే చూసి ఉంటారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియో మాత్రం వాటికి భిన్నమైనది. ఈ వీడియోలో ఓ మహిళ ఉడికించిన బంగాళ దుంపలు, బిస్కెట్లు కలిపి వినూత్న రీతిలో పకోడీలు తయారు చేయడం కనిపిస్తుంది. ముందుగా ఉడికించిన బంగాళా దుంపలను మెత్తగా స్మాష్ చేసి, ఆ తర్వాత దానిని తాలింపు వేసి కలర్‌ఫుల్ మసాలా బంగాలా దుంపల ప్రై తయారు చేస్తుంది. అనంతరం ఒక బిస్కెట్ తీసుకుని దానిపై మసాలా బంగాళా దుంప ఫ్రైని స్టఫ్ చేసి దానిపై మరో బిస్కెట్ పడుతుంది. ఇలా అన్ని బిస్కెట్లు తయారు చేసుకున్న తర్వాత ఒకదాని తర్వాత ఒకటి శనగపిండిలో ముంచి వేడి నూనెలో వదులుతుంది.
Gujjus have gone INSANE. pic.twitter.com/7VXRZzjOcP
— 𝐌𝕒𝕟𝕥𝕠™ 𝚏𝚊𝚗 (@Shayarcasm) November 3, 2023
ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Shayarcasm అనే యూజర్ పేరిట షేర్ చేశారు. ఈ వీడియోకు లక్షల్లో వీక్షణలు, కామెంట్లు, లైకులు రావడంతో అదికాస్తా నెట్టింట వైరల్ అయ్యింది. నవంబర్ 3న షేర్ చేసిన ఈ 58 సెకన్ల నిడివి కలిగిన వీడియోలోని ఈ పకోడీ వంటకం చూసిన నెటిజన్లు కామెంట్ సెక్షన్‌లో రకరకాల కామెంట్స్ చేస్తూ, మీమ్స్ పంపుతూ హల్‌చల్ చేస్తున్నారు. పాపం ఈ పకోడీ ఎవరు తింటారో.. వారి ముఖం ఒకసారి చూడాలని ఉంది అంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు. ఇంతకీ మీరేమంటారు..
మరిన్ని వైరల్ వార్తల కోసం క్లిక్ చేయండి.




