Lab chicken: మార్కెట్లోకి ల్యాబ్‌లో తయారు చేసిన చికెన్.. ఎలా తయారు చేస్తారంటే.

|

Jun 26, 2023 | 3:23 PM

మనిషికి సృష్టికి ప్రతి సృష్టి చేస్తున్నాడు. ప్రకృతి నుంచి అందాల్సిన వస్తువులను సైతం కృత్రిమంగా తయారు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇవి కేవలం మొక్కలు, కూరగాయలకు మాత్రమే పరిమితమైంది. అయితే తాజాగా శాస్త్రవేత్తలు ఏకంగా కృత్రిమ చికెన్‌ను తయారు చేశారు. అవును మీరు చదివింది నిజమే. ప్రపంచంలోనే తొలిసారి..

Lab chicken: మార్కెట్లోకి ల్యాబ్‌లో తయారు చేసిన చికెన్.. ఎలా తయారు చేస్తారంటే.
Lab Chicken
Follow us on

మనిషికి సృష్టికి ప్రతి సృష్టి చేస్తున్నాడు. ప్రకృతి నుంచి అందాల్సిన వస్తువులను సైతం కృత్రిమంగా తయారు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇవి కేవలం మొక్కలు, కూరగాయలకు మాత్రమే పరిమితమైంది. అయితే తాజాగా శాస్త్రవేత్తలు ఏకంగా కృత్రిమ చికెన్‌ను తయారు చేశారు. అవును మీరు చదివింది నిజమే. ప్రపంచంలోనే తొలిసారి ల్యాబ్‌లో తయారు చేసిన చికెన్‌ అందుబాటులోకి వచ్చింది. ఇకపై చికెన్‌ తినాలంటే కోడిని కోయాల్సిన పనిలేదన్నమాట. ప్రపంచంలో తొలిసారి ల్యాబ్‌లో తయారు చేసిన చికెన్‌ను అమ్ముకోవడానికి అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్ అడ్మినిష్ట్రేషన్‌ అనుమతి ఇచ్చింది.

ఇందులో భాగంగా రెండు కంపెనీలు అనుమతులు దక్కించుకున్నాయి. దీంతో అమెరికాలో రెస్టరంట్‌లో ఈ ల్యాబ్‌లో తయారు చేసిన చికెన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. అనంతరం ఈ చికెన్‌ను సూపర్‌ మార్కెట్లలో అందుబాటులోకి తేనున్నారు. ఇంతకీ ఈ కృత్రిమ చికెన్‌ను ఎలా తయారు చేస్తారనేగా మీ సందేహం. ఇందుకోసం శాస్త్రవేత్తలు కోళ్ల కణ జాలాన్ని స్టీల్‌ ట్యాంకుల్లో అభివృద్ధి చేస్తారు. కోడి మూలకణాల నుంచి ఈ చికెన్‌ను తయారు చేస్తారు. కోడి నుంచి వచ్చే కణాలకు పోషకాలు అందిస్తారు. దీంతో నాలుగు నుంచి ఆరు వారాల తర్వాత ఈ కణాలు మాంసంగా మారుతాయి.

అయితే పోషకాల విషయంలో ఏమైనా తేడా ఉంటుందనుకుంటే మీరు పొరబడి నట్లే ఎందుకంటే జంతు మాంసంతో సమానంగా ఈ కృత్రిమ చికెన్‌లో పోషకాలు ఉంటాయి. అంతేకాదు అవసరమైతే పోషకాల మోతాదును పెంచుకోవచ్చు కూడా. ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా పోషకాలను మార్చుకోవచ్చు. కొవ్వు, కొలెస్ట్రాల్‌ను తగ్గించుకుంటూ మాంసాన్ని నచ్చిన విధంగా మార్చుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..