మధుమేహం అనేది నేటి కాలంలో అనేక మందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్య. జీవనశైలి, ఆహారపు అలవాట్లు ఈ వ్యాధి బారిన పడడానికి గల ప్రధాన కారణాలు. ఇక ఈ వ్యాధి బారిన పడినవారు నిత్యం ఆహార నియమాలను తప్పనిసరిగా పాటించితీరాలి. లేకపోతే శరీరంలోని బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణ కోల్పోయి, సమస్యను తీవ్రతరం చేస్తాయి. అందువల్ల డయాబెటీస్ సమస్యతో బాధపడేవారు విధిగా డైట్ ఫాలో అవ్వాలని, బ్లడ్ షుగర్‌ను నియంత్రించాలని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలు రక్తంలోని చక్కెర స్థాయిలను అమాంతం పెంచేస్తాయి. అలాగే మరికొన్ని ఆహారాలు మధుమేహంతో బాధపడేవారికి ఎంతో సహాయంగా ఉంటాయి. మరి శరీరంలోని షుగర్‌ను నియంత్రణలో పెట్టగలిగే టాప్ 10 సూపర్ ఫుడ్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
1. తృణధాన్యాలు: వోట్స్, బార్లీ, క్వినోవా వంటి తృణధాన్యాలు రక్తంలో చక్కెర స్థాయిలను తగినంతగా నియంత్రించడానికి సహాయపడతాయి.
2. చియా గింజలు: చియా గింజల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో జీర్ణమయ్యే కార్బోహైడ్రేట్‌లు తక్కువగా ఉంటాయి. చియా గింజలను ఆహారంగా తీసుకోవడం వల్ల పేగుల పనితీరును మెరుగుపడుతుంది. ఆహారం శోషించుకునే రేటును కూడా డౌన్ చేస్తాయి. తద్వారా మీ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి.
3. పండ్లు: పండ్లు, ముఖ్యంగా స్ట్రాబెర్రీలు, ద్రాక్ష , యాపిల్స్ ఎక్కువగా తీసుకోవడం వలన టైప్ 2 మధుమేహం వచ్చే ముప్పు గణనీయంగా తగ్గుతుంది.
4. కూరగాయలు: కూరగాయలు తక్కువ కేలరీలు, అధిక ఫైబర్‌ను కలిగి ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడే ఆహారం. పొట్లకాయ, వంకాయ, గుమ్మడికాయ, టమోటాలు, పచ్చి బఠాణీలు, క్యారెట్‌లు, రంగురంగుల మిరియాలు, బచ్చలికూర, బ్రోకలీ, కాలీఫ్లవర్ వంటి ఆకుకూరలు ఆరోగ్యకరమైన ఎంపికలలో ఉన్నాయి.
5. వెల్లుల్లి:వెల్లుల్లి మధుమేహం ఉన్నవారిలో బ్లడ్ షుగర్, ఇన్ఫ్లమేషన్, ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్, రక్తపోటును తగ్గిస్తుంది.
6. ధనియాలు: ధనియాలు రక్తం నుంచి చక్కెరను తొలగించడానికి బాధ్యత వహించే ఎంజైమ్‌లను యాక్టివేట్ చేస్తాయి. తద్వారా రక్తంలో గ్లూకోజ్ స్థాయిని క్రమబద్ధీకరించడంలో సహాయపడుతాయి.
7. పనీర్ కా ఫూల్: పనీర్ కే ఫూల్ గ్లూకోజ్ స్థాయిలను కంట్రోల్‌లోకి తెస్తుంది. మూత్రపిండ సమస్యలను కూడా ఇది నియంత్రిస్తుంది.
8. బుక్ వీట్ టీ: బుక్ వీట్ టీలో కరిగే స్వభావం కలిగిన ఫైబర్ ఉంటుంది. ఇది భోజనం తర్వాత రక్తంలో చక్కెర పెరుగుదలను తగ్గిస్తుంది. మధుమేహం నిర్వహణలో సమర్థవంతంగా సహాయపడుతుంది.
9. చేదు పొట్లకాయ రసం: లైకోపీన్ వంటి బలమైన యాంటీ ఆక్సిడెంట్‌తో పాటు బీటా కెరోటిన్ పొట్లకాయ రసంలో ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి ఇది సహాయపడుతుంది.
10. ఆపిల్ సిడెర్ వెనిగర్: పులియబెట్టిన ఎసిటిక్ యాసిడ్ ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. పరకడుపున(ఉదయం లేవగానే) రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉండేలా చేస్తుంది. శరీరంలో బ్లడ్ షుగర్ రెస్పాన్స్‌ని 20 శాతానికి తగ్గించడానికి ఇది సహాయపడుతుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..