విటమిన్లు, ఖనిజాల గని.. చుండ్రును నివారించి జుట్టు రాలడాన్ని తగ్గించే దివ్యాస్త్రం..
తోటకూరలో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్లు, పీచుపదార్థాలు వంటి పోషకాలు ఉంటాయి. దీన్ని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల జీర్ణక్రియ, ఎముకల ఆరోగ్యం, రోగనిరోధక శక్తికి మేలు కలగొచ్చు. అయితే ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.

పచ్చని ఆకు కూరల్లో ఎన్నో రకాల పోషకాలు, ఖనిజాలు దాగున్నాయి.. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే, ఆకు కూరలను తప్పనిసరిగా ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. అలాంటి అద్భుతమైన ఆకు కూరల్లో తోటకూర ఒకటి.. ఇది అత్యంత పోషకమైనది. ఇందులోని పోషకాలు శరీరానికి చాలా మేలు చేస్తాయి.. వాస్తవానికి మార్కెట్‌లో ఎప్పుడూ అందుబాటులో ఉండే ఈ ఆకుకూరలో లెక్కలేనన్ని పోషకాలు ఉన్నాయి. తరచుగా తోటకూరను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.. నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం..
పోషకాలకు నిలయం..
ఈ కూర కాల్షియం, ఇనుము, మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్, కాపర్, మాంగనీస్, సెలీనియం వంటి ముఖ్యమైన ఖనిజాలకు నిలయం. అంతేకాకుండా.. విటమిన్లు పుష్కలంగా ఉంటాయి..
విటమిన్ ఎ, సి, డి, ఇ, కె, బి12, బి6 వంటి అనేక విటమిన్లు తోటకూరలో ఒకేసారి లభించడం విశేషం. కేవలం వంద గ్రాముల తోటకూర తినడం వల్ల సుమారు 716 క్యాలరీల శక్తితో పాటు కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు, పీచుపదార్థాలు శరీరానికి అందుతాయి.
ఆరోగ్య ప్రయోజనాలు..
ఇది రక్తహీనతను తగ్గించి, శరీరంలో కొత్త రక్తకణాలు తయారవ్వడానికి సహాయపడుతుంది. ఎముకలను, దంతాలను దృఢంగా మారుస్తాయి. ఇది మలబద్దకాన్ని నివారించి, జీర్ణక్రియ సక్రమంగా జరిగేలా చూస్తుంది. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. తోటకూరలోని పోషకాలు కంటిచూపును మెరుగుపరుస్తాయి..
బరువు తగ్గాలనుకునే వారికి తోటకూర ఒక అద్భుతమైన ఎంపిక. ఇందులో పీచుపదార్థం అధికంగా ఉండటం వల్ల జీర్ణశక్తి మెరుగుపడి, శరీరంలోని కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది తక్షణ శక్తిని అందిస్తూనే, అధిక రక్తపోటును నియంత్రించడంలో తోడ్పడుతుంది.
హైపర్‌టెన్షన్‌తో బాధపడే వారికి ఇది చాలా మేలు చేస్తుంది. అలాగే రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచి గుండెకు మేలు చేసే సోడియం, పొటాషియం కూడా ఇందులో ఉంటాయి.
తోటకూరలో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వాతావరణ మార్పుల వల్ల వచ్చే సీజనల్ వ్యాధుల నుండి శరీరాన్ని రక్షించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.
జుట్టు రాలడాన్ని తగ్గించడానికి, చుండ్రును నివారించడానికి తాజా తోటకూర ఆకులను మిక్సీలో రుబ్బి తలకు పట్టించుకోవడం మంచిది.. అయితే, అలర్జీ లాంటివి ఉంటే ముందుగా నిపుణులను సంప్రదించాలి..
అయితే, ఏమైనా ఆరోగ్య సమస్యలుంటే నేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
