ఏ జంతువు పాలు గులాబీ రంగులో ఉంటాయో తెలుసా?

Samatha

29 september 2026

Pic credit - Pinterest

చాలా వరకు పాలు అంటే చాలు అవి తెలుపు రంగులోనే ఉంటాయి. ఎవరిని అడిగా పాలు తెలుపు రంగులో మాత్రమే ఉంటాయని చెబుతుంటారు.

పాలు

కానీ కొంత మంది మాత్రం ఒక జంతువు పాలు గులాబీ రంగులో ఉంటాయి అంటారు. మరి ఇది నిజమేనా? దీని గురించిన పూర్తి ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం.

గులాబీ రంగు

సోషల్ మీడియాలో హిప్పో పాలు గులాబీ రంగులో ఉంటాయని బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే. కానీ నిజాని దీని పాలు తెల్లగానే ఉంటాయంట.

హిప్పో పాలు

2013లో నేషనల్ జియోగ్రాఫిక్ ఫేస్ బుక్ పోస్ట్ తో ఈ పుకారు మొదలైంది, కానీ శాస్త్రవేత్తలు దీన్ని పూర్తిగా ఖండించారు.హిప్పోలు చర్మం నుండి రెండు రకాల ఆమ్లాలను విడుదల చేస్తాయి.

పుకారు

వాటిని హిప్పోసుడోరిక్ యాసిడ్ అని పిలుస్తారు.ఒకటి ఎర్రగా ఉంటుంది, రెండోది నారింజ రంగులో ఉంటుంది, వీటిని కలిపి బ్లడ్ స్వెట్ అని పిలుస్తారు.

హిప్పోసుడోరిక్ యాసిడ్

ఈ ద్రవం రక్తం కాదు, చెమట కాదు, ఇది చర్మ గ్రంథుల నుండి వచ్చే సహజ సన్ స్క్రీన్ లాంటిది. ఎండలో ఈ ద్రవం ఎరుపు రంగులోకి మారి చర్మాన్ని UV కిరణాల నుండి కాపాడుతుంది, యాంటీబయాటిక్ గా పనిచేస్తుంది.

సహజ సన్ స్క్రీన్

తెల్లటి పాలలో ఈ ఎర్రటి ద్రవం కలిస్తే గులాబీ రంగు వస్తుందనే ఊహతోనే ఈ అపోహ పుట్టింది. నిజానికి పాలు తెల్లగానే ఉంటాయి, చర్మంపై ఉన్న ద్రవం పాలతో కలిసినప్పుడు మాత్రమే తేలికపాటి గులాబీ ఛాయ కనిపిస్తాయంట.

తెలుపు రంగు పాలే

ప్రొఫెసర్ డేవిడ్ వైనిక్ వంటి నిపుణులు పాలలో పిగ్మెంట్ కలవదని, ఇది కేవలం ఇంటర్నెట్ లెజెండ్ అని చెప్పారు.

ఇంటర్నెట్ లెజెండ్