AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Moral Story: గుడ్డిగా ఎవరినీ నమ్మకూడదు.. మొసలి కన్నీరు కథ

ఆపద సమయంలో భయపడితే మన ఆలోచనా శక్తిని కోల్పోయే ప్రమాదం ఉంది. కానీ ప్రశాంతంగా ఉండి పరిస్థితిని గమనించి, సమయస్ఫూర్తితో ఆలోచిస్తే ఎంతటి ప్రమాదం నుంచైనా బయటపడే అవకాశం ఉంటుంది. ఇతరులు చెప్పిన మాటలను గుడ్డిగా నమ్మకుండా, మన విచక్షణతో నిజానిజాలను పరిశీలించాలి. ఈ విషయాన్ని ఈ కింది కథ ద్వారా పిల్లలకు అర్ధమయ్యేలా చెప్పండి..

Moral Story: గుడ్డిగా ఎవరినీ నమ్మకూడదు.. మొసలి కన్నీరు కథ
Crocodile Tears Story
Srilakshmi C
|

Updated on: Sep 29, 2026 | 2:42 PM

Share

ఒక దట్టమైన అడవిలో పెద్ద నది ఉండేది. ఆ నదిలో ఒక మొసలి నివసించేది. నది దగ్గరకు నీళ్లు తాగడానికి వచ్చే జంతువులను పట్టుకుని తినడం దానికి అలవాటు. మొసలి సంగతి తెలిసిన తర్వాత అడవిలోని జంతువులన్నీ నది దగ్గరకు రావడం మానేశాయి. దాంతో మొసలికి ఆహారం దొరకడం కష్టమైపోయింది. ఒకరోజు ఈ విషయం తెలియని ఒక జింక నది దగ్గరకు వచ్చి నీళ్లు తాగసాగింది. అది కనిపించగానే మొసలి ఒక్కసారిగా నీటిలోంచి దూకి జింక కాలును గట్టిగా పట్టుకుంది. అయితే జింక భయపడలేదు. వెంటనే ఒక ఉపాయం ఆలోచించింది.

‘మొసలి మామా! నా కాలనుకున్నావా? నువ్వు పట్టుకున్నది కర్ర. నా కాలు ఇంకా నీటికి బయటే ఉంది!’ అని నవ్వుతూ అంది. మొసలి గందరగోళానికి గురైంది. తాను నిజంగానే జింక కాలుకు బదులు కర్రను పట్టుకున్నానేమో అనుకుని వెంటనే దాన్ని వదిలేసింది. అంతే! జింక ఒక్కసారిగా ఒడ్డుకు చేరుకుని అక్కడి నుంచి పరుగెత్తి తప్పించుకుంది. తనను మోసం చేసిన జింకపై మొసలికి చాలా కోపం వచ్చింది. ఇంతలో దాని స్నేహితుడైన నక్క అక్కడికి వచ్చింది. మొసలి జరిగిన విషయమంతా నక్కకు చెప్పింది. ‘నువ్వు బాధపడకు. ఆ జింకను మాయమాటలు చెప్పి మళ్లీ ఇక్కడికి తీసుకొస్తాను’ అని నక్క చెప్పింది. కొద్దిసేపటి తర్వాత నక్క జింకను కలిసింది. ‘మన దగ్గర్లోనే ఒక మంచి నది ఉంది. అక్కడికి వెళ్లి నీళ్లు తాగుదాం రా!’ అని చెప్పింది. జింకకు వెంటనే మొసలి గుర్తొచ్చింది. ‘ఆ నదిలో మొసలి ఉంది కదా?’ అని అడిగింది.

నక్క ఏమాత్రం తడబడకుండా, “ఉండేది. కానీ అది చనిపోయింది. నేను స్వయంగా చూశాను” అని అబద్ధం చెప్పింది. జింక నక్క మాటలు నమ్మినట్టుగా నటిస్తూ దాని వెంట నదివైపు వెళ్లింది. కొంత దూరం వెళ్లగానే నదిలో మొసలి కదలకుండా పడుకుని ఉండటాన్ని చూసింది. అయినా జింకకు అనుమానం వచ్చింది. ‘మొసలి నిజంగానే చనిపోయి ఉంటే… దాని నోటి నుంచి ఏదైనా శబ్దం రావాలి కదా?’ అని జింక అంది. జింక తనను నమ్మడం లేదని గ్రహించిన మొసలి వెంటనే కళ్లు మూసుకుని ‘ఉఫ్… ఉఫ్…’ అంటూ శబ్దం చేసింది. అది విన్న జింక పగలబడి నవ్వింది. ‘చనిపోయిన మొసలి శబ్దం చేస్తుందా? మీ నాటకాన్ని నేను నమ్మను!’ అంటూ వెనక్కి తిరిగి పరుగెత్తింది. జింక మరోసారి తమ చేతికి చిక్కకుండా తప్పించుకోవడంతో మొసలి, నక్క ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉండిపోయాయి.

ఇవి కూడా చదవండి

నీతి

ఆపదలో భయపడకుండా ప్రశాంతంగా ఆలోచిస్తే, తెలివితో ప్రమాదం నుంచి బయటపడవచ్చు. ఈ కథలో జింకకు మొసలి వల్ల ప్రాణాపాయం ఎదురైంది. మొదటిసారి మొసలి దాని కాలును పట్టుకున్నప్పుడు జింక భయంతో కంగారుపడకుండా వెంటనే సమయస్ఫూర్తితో ఆలోచించి ‘నువ్వు పట్టుకున్నది నా కాలు కాదు.. కర్ర’ అని మొసలిని నమ్మించింది. దాంతో మొసలి జింక కాలును వదిలేయడంతో అది తప్పించుకుంది. మరోసారి నక్క మాటలు నమ్మి నది దగ్గరకు వెళ్లినప్పటికీ, జింక తొందరపడలేదు. మొసలి చనిపోయినట్లు నటిస్తున్నా దాని ప్రవర్తనను గమనించి అనుమానం వ్యక్తం చేసింది. చివరకు ‘చనిపోయిన మొసలి శబ్దం చేస్తుందా?’ అని ప్రశ్నించి, మొసలి బతికే ఉందని గుర్తించింది.

ఈ కథ మనకు చెప్పే ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఆపద సమయంలో భయపడితే మన ఆలోచనా శక్తిని కోల్పోయే ప్రమాదం ఉంది. కానీ ప్రశాంతంగా ఉండి పరిస్థితిని గమనించి, సమయస్ఫూర్తితో ఆలోచిస్తే ఎంతటి ప్రమాదం నుంచైనా బయటపడే అవకాశం ఉంటుంది. ఇతరులు చెప్పిన మాటలను గుడ్డిగా నమ్మకుండా, మన విచక్షణతో నిజానిజాలను పరిశీలించాలి. అందుకే.. ఆపదలో భయం కాదు, తెలివి మరియు సమయస్ఫూర్తే మనకు రక్షణ.

Follow Us
గుడ్డిగా ఎవరినీ నమ్మకూడదు.. మొసలి కన్నీరు కథ
గుడ్డిగా ఎవరినీ నమ్మకూడదు.. మొసలి కన్నీరు కథ
సచిన్, ధోనీ కాదు..కింగ్ కోహ్లీ దృష్టిలో బెస్ట్ వన్డే బ్యాటర్ ఇతడే
సచిన్, ధోనీ కాదు..కింగ్ కోహ్లీ దృష్టిలో బెస్ట్ వన్డే బ్యాటర్ ఇతడే
జుట్టు విపరీతంగా రాలిపోతోందా? ఈజీ ఇంటి చిట్కాలు ట్రై చేయండి!
జుట్టు విపరీతంగా రాలిపోతోందా? ఈజీ ఇంటి చిట్కాలు ట్రై చేయండి!
రూ.60తో మొదలై జాతీయ అవార్డు వరకు.. సుమన్ గోయల్ ఉపాధ్యాయ ప్రస్థానం
రూ.60తో మొదలై జాతీయ అవార్డు వరకు.. సుమన్ గోయల్ ఉపాధ్యాయ ప్రస్థానం
కూతురు వేలకోట్లకు యువరాణి.. తల్లి మాత్రం పల్లెటూరిలో..!
కూతురు వేలకోట్లకు యువరాణి.. తల్లి మాత్రం పల్లెటూరిలో..!
అతడిని టచ్ చేయలేరు.. వేలెత్తి చూపిస్తే బ్యాట్‌తోనే రిప్లై
అతడిని టచ్ చేయలేరు.. వేలెత్తి చూపిస్తే బ్యాట్‌తోనే రిప్లై
ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్
ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్
చుండ్రును నివారించి.. జుట్టు రాలడాన్ని తగ్గించే అద్భుతమైన ఆకు కూర
చుండ్రును నివారించి.. జుట్టు రాలడాన్ని తగ్గించే అద్భుతమైన ఆకు కూర
మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిందని చెప్పే హెచ్చరిక సంకేతాలు!
మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిందని చెప్పే హెచ్చరిక సంకేతాలు!
వారి రేషన్ కార్డులు రద్దు కాబోతున్నాయ్..! కేంద్రం కీలక నిర్ణయం
వారి రేషన్ కార్డులు రద్దు కాబోతున్నాయ్..! కేంద్రం కీలక నిర్ణయం